For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఊరికే అదే చెప్పుకుంటూ ఉంటే ఎలా? ఎంజాయ్ చేసే దానినే ఎంచుకుంటా.. విజయ్ దేవరకొండ కామెంట్

    |

    సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి పేరు తెచ్చుకోవడం, స్టార్ హీరోగా ఎదగడం అంత సులువైన విషయం కాదు. ఎంత కష్టపడ్డప్పటికీ అది అందరికీ సాధ్యపడదు కూడా. కానీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఆ ఫీట్ చాలా సులువుగా అనతి కాలంలోనే చేరుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ రౌడీ స్టార్ కొద్దికాలంలోనే స్టార్ హీరో స్థాయిలో క్రేజ్ సంపాదించాడు. ముఖ్యంగా యువతను బుట్టలో వేసుకొని ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నాడు.

    పెళ్లిచూపులు తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా 'అర్జున్ రెడ్డి'. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్‌లో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ చిత్రంలో ముద్దుల వరద పారించాడు విజయ్. దీంతో చిన్న సినిమాగా విడుదలైనా భారీ విజయం సాధించింది అర్జున్ రెడ్డి చిత్రం. ఆ తర్వాత ఒక్కసారిగా హీరో విజయ్ దేవరకొండ అందరి దృష్టిలో పడిపోయాడు. అతని దశ తిరిగింది. విజయ్‌తో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు క్యూ కట్టారు. అయితే తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటించిన విజయ్.. తన కెరీర్‌లో అర్జున్ రెడ్డి విజయాన్నే పదే పదే చెప్పుకోవడం సరికాదంటూ ఆసక్తికరంగా స్పందించాడు.

    Vijay devarakonda sensational comment on Arjun Reddy

    సినిమా సినిమాకు నటుడిగా మీరు భారీ క్రేజ్ కొట్టేస్తున్నారు. మీకంటూ వ్యక్తిగత లక్ష్యాలు ఏమున్నాయ్ అనే ప్రశ్నకు బదులిస్తూ నటుడిగా గొప్ప కీర్తి గడించడమే తన టార్గెట్ అని చెప్పుకొచ్చాడు విజయ్. తన సినీ కెరీర్‌లోనే సూపర్‌ హిట్‌గా చెప్పుకుంటున్న అర్జున్‌ రెడ్డి చిత్రాన్ని కొన్నేళ్ల తర్వాత చూసినప్పుడు సిగ్గుపడాలని, నటుడిగా ఆ స్థాయికి ఎదగాలని చెప్పారు ఆయన పేర్కొన్నాడు. ఇంకా కొనేళ్లు ఏళ్లు గడిచాక కూడా అర్జున్‌ రెడ్డి సినిమానే నా ఉత్తమ చిత్రం అని చెప్పుకుంటే దానర్థం నేను ఎదగడం లేదనే అవుతుందని చెప్పి విజయ్ దేవరకొండ తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో చాటుకున్నాడు. నటన పరంగా నిరంతరం కొత్త విషయాల్ని నేర్చుకుంటూ ఉండాలని, ప్రతి సినిమా ది బెస్ట్‌ కావాలనేదే తన ఉద్దేశమని ఆయన చెప్పారు. ఎప్పటికీ అర్జున్ రెడ్డి గురించే చెప్పుకోవడం కాదు.. మరిన్ని హిట్ సినిమా చేయాలని, తాను చూసి ఎంజాయ్‌ చేసేలా ఉండే చిత్రాల్ని ఎంపిక చేసుకుంటానని విజయ్ చెప్పుకొచ్చారు.

    అర్జున్ రెడ్డి సినిమా తర్వాత గీతగోవిందం చిత్రంతో పలకరించిన విజయ్ ఆ తర్వాత టాక్సీవాలా రూపంలో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక విజయ్ లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ జులై 26 వ తేదీన విడుదలకు సిద్దమయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌లో రష్మిక, విజయ్ లిప్‌లాక్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

    English summary
    Young hero Vijay Deverakonda spoke about his future films. commented on his own movie Arjun Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X