విజయ్ దేవరకొండ ఓటీటీ ప్లాన్స్.. సరికొత్త కథలకు గ్రీన్ సిగ్నల్!
టాలీవుడ్ రౌడి స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో నెవర్ బిఫోర్ అనేలా సిద్ధమవుతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంలో రౌడి స్టార్ విభిన్నమైన లుక్కుతో కనిపిస్తున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా త్వరలో విడుదల చేయనున్నారు. అసలైతే గత నెలలోనే విజయ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయాల్సింది.
కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా రిలీజ్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇక త్వరలోనే న్యూ టీజర్ డేట్ పై క్లారిటీ ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ తుది దశకు చేరుకుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ లాక్ డౌన్ లో తన స్వచ్చంద సంస్థ ద్వారా పేదలకు సహాయం చేసిన విజయ్ అలాగే కొన్ని ఓటీటీకి సంబంధించిన స్క్రిప్ట్ లపై కూడా చర్చలు జరిపినట్లు సమాచారం.

విజయ్ నటించకపోవచ్చు గాని సొంత ప్రొడక్షన్ లోనే కొత్త వారికి సపోర్ట్ చేస్తూ అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే ఆహా యాప్ తో విజయ్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రమోషన్ లో కూడా సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తన సొంత ప్రొడక్షన్ లో ఇతర యువ దర్శకుల చేత వెబ్ సీరీస్ లను అలాగే స్పెషల్ కంటెంట్ సినిమాలను నిర్మించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కూడా విజయ్ కొందరు యువ దర్శకులకు బాగానే హెల్ప్ చేశాడు. మరి ఈసారి ఏ రేంజ్ లో సినిమాలను వదులుతాడో చూడాలి. ఇక విజయ్, పూరి జగన్నాథ్ లైగర్ అనంతరం సుకుమార్ తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











