twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    200 కోట్లా? లైట్ తీస్కో.. అంతకంటే ఎక్కువే.. విజయ్ దేవరకొండ సెన్సేషనల్ ట్వీట్

    |

    సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న సినిమాను పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సినీ ప్రముఖుడు కరణ్ జోహర్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వరుస లాక్‌డౌన్లు ఈ సినిమా షూటింగుకు, రిలీజ్‌కు అడ్డంకిగా మారాయి.

    Vijay Deverakonda clarity about Liger OTT offer

    ఇలాంటి పరిస్థితుల్లో లైగర్ చిత్రానికి ప్రముఖ ఓటీటీ సంస్థ భారీగా ఆఫర్ ఇచ్చింది. అన్ని భాషల్లో డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కోసం రూ.200 కోట్ల ఆఫర్ ఇచ్చింది. అయితే ఈ ఆఫర్‌ను యూనిట్, నిర్మాతలు పరిశీలిస్తున్నదనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    Vijay Deverakonda clarity about Liger OTT offer

    అయితే అలాంటి ఆఫర్‌ను ఒప్పుకొనే సమస్యే లేదు అంటూ విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. లైగర్ థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని చెప్పకనే చెప్పేశాడు. 200 కోట్ల ఆఫర్ చాలా చిన్న మొత్తం. థియేటర్లలో ఇంత కంటే ఎక్కువ సంపాదిస్తాను అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ఇక విజయ్ దేవరకొండ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది.

    ఇదిలా ఉండగా, యాక్షన్, లవ్, రొమాంటిక్ చిత్రంగా రూపొందుతున్న లైగర్ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ అండీ లాంగ్‌ను రంగంలోకి దించారు. ఆయన అసలు పేరు ఆండ్రియాస్ నుయెన్. జాకీ ఛాన్ నటించిన ఆర్మూర్ ఆఫ్ గాడ్ 3, చైనీస్ జోడాయిక్, పోలీస్ స్టోరీ 2013, డ్రాగన్ బ్లేడ్ చిత్రాలకు స్టంట్ కోరియోగ్రఫిని అందించారు. 2006లో మ్యాగ్ ఫైటర్స్ అనే స్టంట్ టీమ్‌ను ప్రారంభించారు.

    లైగర్ చిత్రానికి పనిచేసే యూనిట్
    నటీనటులు: విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ, అనన్య పాండే, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, ఆలీ, మక్రంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను తదితరులు
    డైరెక్టర్: పూరీ జగన్నాథ్
    నిర్మాతలు: కరణ్ జోహర్, చార్మీ కౌర్, అపూర్వ మెహతా, హీరూ యష్ జోహర్, పూరీ జగన్నాథ్
    డీవోపీ: విష్ణు శర్మ
    ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
    ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
    స్టంట్ డైరెక్టర్: అండీ లాంగ్

    English summary
    Arjun Reddu fame Vijay Deverakonda clarity about Liger OTT offer which viral on the social media. Reports said that OTT firm offered 200 crores for the movie. in this occassion, Vijay Deveraonda wrote on twitter that, Too little. I’ll do more in the theaters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X