For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒకడు ఎదిగితే కాళ్లు పట్టి లాగుతారు.. అంతా దేవుడే చూసుకొంటాడు.. విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్

  |

  దేశవ్యాప్తంగా లైగర్ సినిమా ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. విజయ్ దేవరకొండ, అనన్య పాండే దేశంలోని ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు. ముంబై నుంచి ఇండోర్ వరకు విజయ్ దేవరకొండ, అనన్య పాండేకు ప్రేక్షకులు, సినిమా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అయితే తెలుగు ప్రేక్షకులకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఫ్యాన్‌డమ్ టూర్‌లో భాగంగా వరంగల్‌లో ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ తర్వాత విజయ్ దేవరకొండ, అనన్య పాండే తెలుగు మీడియా సమావేశం నిర్వహించారు.

  నాకు యాటిట్యూడ్ లేదంటూ విజయ్ దేవరకొండ

  నాకు యాటిట్యూడ్ లేదంటూ విజయ్ దేవరకొండ


  అయితే హైదరాబాద్ మీడియా సమావేశంలో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. బాలీవుడ్‌కు వెళ్లినందున గతంలో మాదిరిగా మీరు మీ యాటిట్యూడ్‌తో మాట్లాడటం లేదు. మీరు స్వేచ్ఛగా మాట్లాడటం లేదు అని అడిగితే.. నాకు అలాంటి ఫీలింగ్ లేదు. నేను కూడా ఫ్రీగా మాట్లాడుతాను. మీరు కూడా ఫ్రీగా మాట్లాడండి అంటూ కాలు మీదు కాలు వేసుకొని.. టేబుల్‌పై కాళ్లు పెట్టి ఫన్నీగా మాట్లాడారు. అయితే ఈ సంఘటనపై ఓ వర్గం మీడియా ఘాటుగా స్పందిచింది.

  తనపై అనుచిత కథనాలపై

  తనపై అనుచిత కథనాలపై

  విజయ్‌ దేవరకొండకు యాటిట్యూడ్ పెరిగిపోయింది. మీడియాతో ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వ్యవహరించారు అని కొన్ని వెబ్ సైట్లలో ఆ ఫోటోను పోస్ట్ చేసి కథనాలు రాశారు. ఈ ఘటనపై విజయ్ దేవరకొండ ఘాటుగా స్పందించారు. తనపై అన్యాయంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై ఘాటుగా ట్వీట్ చేశారు.

  ఎకురు ఎదుగుతున్నారంటే.. వారిని

  ఎకురు ఎదుగుతున్నారంటే.. వారిని

  హైదరాబాద్ మీడియా సమావేశంలో తాను టేబుల్‌పై కాళ్లు పెట్టుకోవడంపై అభ్యంతరకరంగా కథనాలు రాయడంపై విజయ్ దేవరకొండ తప్పుపట్టారు. ఏదైనా రంగంలో ఒకరు ఎదుగుతున్నారంటే.. వారిని కాళ్లు పట్టి లాగేందుకు కుట్రలు పన్నడం సహజం. స్వయంకృషితో ఎదిగే వాళ్లను టార్గెట్ చేయడం జరగడం కొత్తేమీ కాదు. ఇలాంటి విషయాలపై గట్టిగానే ఫైట్ చేస్తాం అని విజయ్ దేవరకొండ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  భగంతుడే రక్షణగా నిలుస్తాడు అంటూ

  ఇక ఇదే అంశం గురించి విజయ్ దేవరకొండ మరింత వివరణ ఇస్తూ.. ఎప్పుడైతే మీకు మీరు నిజాయితీగా ఉన్నప్పుడు.. ప్రతీ ఒక్కరి కోసం మంచి చేయాలనుకొంటారు. తన చుట్టు ఉన్న మనుషులను ప్రేమిస్తూనే ఉంటారు. మిగితా విషయాలను భగవంతుడే చూసుకొంటాడు. వారికి భగంతుడే రక్షణగా నిలుస్తాడు అని ట్వీట్‌లో వెల్లడించారు.

  అమెరికాలో లైగర్ భారీగా అడ్వాన్స్ బుకింగ్

  అమెరికాలో లైగర్ భారీగా అడ్వాన్స్ బుకింగ్

  ఇదిలా ఉండగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై రూపొందిన లైగర్ చిత్రం ఆగస్టు 25వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతున్నది. పలు ప్రాంతాల్లో ప్రారంభమైన అడ్వాన్సు బుకింగ్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తున్నది. అమెరికాలో 160 లొకేషన్లలో 480 షోల ద్వారా 86K డాలర్లు వసూలు చేసింది.

  English summary
  Vijay Deverakonda tweet about negative campaign on Liger. He tweeted that Anybody trying to grow in their field Will Always have a Target on their back - But we fightback. And when you are honest, yourself and want the best for everyone - The love of people and God will protect you
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X