ఆ ఇద్దరినీ నాకు ఇచ్చినందుకు క్రిస్మస్‌కు థాంక్స్: విజయ్ దేవరకొండ
ఈ ప్రపంచంలో క్రిస్మస్ అనేది చాలా మందికి ప్రత్యేకమైన రోజు. అయితే టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండకు మరింత స్పెషల్. ఈ పర్వదినం రోజున జన్మించిన ఇద్దరు వ్యక్తుల వల్ల తన తన కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. ఆ ఇద్దరూ మరెవరో కాదు... టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, పరశురామ్.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమా విజయ్ దేవరకొండను ఓ రేంజికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరశురాం దర్శకత్వంలో వచ్చిన 'గీత గోవిందం' సినిమాతో రూ.100 కోట్ల వసూలు చేసిన హీరోల క్లబ్‌లో చేరాడు విజయ్.
ఈ విషయాన్ని గుర్తు చేసుకంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. 'మీ ఇద్దరూ ఒకే రోజు జన్మించారు. ఈ ఇద్దరినీ నాకు ఇచ్చిన క్రిస్మస్‌కు థాంక్స్. బిగ్ హగ్ అంటూ..... ట్వీట్ చేశారు.

సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తున్నారు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి తెలుగులో హిట్టయిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. పరశురాం తన తర్వాతి సినిమా ఓ స్టార్ హీరోతో చేసేందుకు ప్లాన్ చేసుకంటున్నారు.


Click it and Unblock the Notifications











