For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను ఈ స్థాయికి రావడానికి ఆయన కూడా ఓ కారణం.. మసూద టీమ్‌తో విజయ్ దేవరకొండ

  |

  మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి విజయవంతమైన చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన మూడో చిత్రం మసూద. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

  విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మసూద చిత్రానికి టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అండగా నిలిచారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించడమే కాకుండా.. వాట్ ఏ గ్రేట్ ట్రైలర్.. చాలా ఎగ్జయింటింగ్‌గా ఉంది. ఈ సినిమాకు పూర్తి మద్దతుగా ఉంటుంది అని ఆయన ట్వీట్ చేయడం తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమా యూనిట్‌తో సమావేశమై వారికి తన సపోర్టును ప్రత్యక్షంగా ప్రకటించారు. ఇటీవల యూనిట్‌ను సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. మసూద సినిమాపై తనకున్న ప్రేమను తెలియజేశారు. ఇక అప్పుడే భయపడాల్సిన అవసరం లేదు.. అస్సల్ భయం ముందుంది అంటూ తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటుంది.

  Vijay Deverakonda wishes great success for Masooda team

  ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ''టీమ్‌లో చాలా మంది నాకు తెలుసు. చిత్ర హీరో తిరు.. నా ఫస్ట్ సినిమా అప్పటి నుంచి తెలుసు. నాతోపాటు అతను కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నగేష్ నా 'పెళ్లిచూపులు' సినిమా కెమెరామ్యాన్. 'అర్జున్ రెడ్డి' సినిమా ఓ షెడ్యూల్ అతను చేశాడు. నా ఉన్నతికి ఆయన కూడా ఓ ప్రధాన కారణం. అతనంటే నాకెంతో ఇష్టం. రాహుల్ 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాని మా నవీన్‌తో ప్రొడ్యూస్ చేశాడు.

  ఇప్పుడు మళ్లీ కొత్త బంచ్‌తో ఈ సినిమా చేస్తున్నారు. సాయికిరణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అంటే నాకెంతో ఇష్టం. నవంబర్ 18న 'మసూద' సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. భయపెడుతుంది కూడా. ఈ మూవీ ట్రైలర్ నాకెంతో నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అందుకే నా ప్రేమ, అభినందనలు ఈ టీమ్‌కి ఇలా తెలియజేస్తున్నాను. అందరూ థియేటర్లలో ఈ సినిమాని చూడండి. ఈ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను..'' అని అన్నారు.

  చాలా కాలం తరువాత తెలుగులో పూర్తి హారర్ డ్రామాగా ఈ సినిమా వస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ఎస్‌విసి బ్యానర్ ద్వారా విడుదల చేస్తున్నారు.

  Vijay Deverakonda wishes great success for Masooda team

  నటీనటులు: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు నటించిన ఈ చిత్రానికి
  బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
  కళ: క్రాంతి ప్రియం
  కెమెరా: నగేష్ బానెల్
  స్టంట్స్: రామ్ కిషన్ మరియు స్టంట్ జాషువా
  సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
  ఎడిటింగ్: జెస్విన్ ప్రభు
  పిఆర్‌వో: బి.వీరబాబు
  నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
  రచన, దర్శకత్వం: సాయికిరణ్.

  English summary
  Rowdy Star Vijay Deverakonda extends best wishes to Team Masooda. he actor has spent quality time interacting with Team 'Masooda'. He used the occasion to know more about the film's subject and the team's journey. The 'Arjun Reddy' star expressed his interest to catch the movie at the earliest.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X