twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నొప్పి భరించా, బాలయ్యతో ఆ అవసరం రాలేదేమో, ప్రభాస్‌తో పెట్టుకోను: రామ్ చరణ్

    |

    Recommended Video

    Kiara Advani Funny Comments On Ram Charan @VVR Movie Team Interview | Ram Charan | Boyapati Srinu

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డివివి ఎంటర్టెన్మెంట్స్ నిర్మించిన 'వినయ విధేయ రామ' జనవరి 11న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ మీడియా ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు.

    ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ... 'వినయ విధేయ రామ' టైటిల్‌కు తగిన విధంగానే నా క్యారెక్టర్ రాముడి క్యారెక్టర్ మాదిరిగానే ఉంటుంది. యుద్ధం చేయాలని ఆయనకు ఎదురుగా ఎప్పుడూ అనుకోకూడదు. అదే సమయంలో ఫ్యామిలీ వ్యాల్యూస్ ఉన్న గ్రేట్ హస్బెండ్, గ్రేట్ బ్రదర్ అవన్నీ ఈ క్యారెక్టర్లో కనిపిస్తాయని తెలిపారు.

    చాలా నొప్పి భరించాను

    చాలా నొప్పి భరించాను

    సినిమాలో తన ఒంటిపై కనిపించే టాటూ గురించి రామ్ చరణ్ ప్రస్తావిస్తూ... అది స్టిక్కర్లతో వేసిన టాటూ. అది వేయించుకోవడానికి దాదాపు 2 గంటల సమయం పట్టేది. తీయడానికి గంటర్నర సమయం పట్టేది. తీసేపుడు చాలా నొప్పి అనుభవించాల్సి వచ్చేదని రామ్ చరణ్ తెలిపారు.

    బాలయ్యతో ఆ అవసరం లేదేమో

    బాలయ్యతో ఆ అవసరం లేదేమో

    నందమూరి హీరోల సినిమాలు, మెగా హీరోల సినిమాల విషయంలో బోయపాటి డిఫరెన్స్ ఏదో చూపించినట్లు అనిపిస్తోంది. నందమూరి హీరోల సినిమాల్లో కేవలం గెటప్ మీదనే ఆయన ఫోకస్ పెడుతున్నారు. మెగా హీరోల సినిమాల విషయంలో బాడీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.. ఎందుకిలా? అని యాంకర్ ప్రశ్నించగా... ‘డైరెక్టర్ చెప్పిన ప్రతి రిక్వైర్మెంట్ హీరో దగ్గర ఉండాలి. మేము ఆయన చెప్పిందే చేస్తాం. బహుషా బోయపాటి‌గారు ఆ రిక్వైర్మెంట్ అవసరం లేక నందమూరి హీరోలను అడగలేదేమో? బాలకృష్ణ‌గారి బాడీ నరసింహ నాయుడు, సమరసింహారెడ్డిలో చాలా బావుంటుంది. ఆయన అడిగితే చేసేవారేమో? అని చరణ్ చెప్పుకొచ్చారు.

    2018 పోల్: ఈ హీరోలు, హీరోయిన్ల జాతకాలు మీ చేతుల్లోనే.. ఓట్ వేసి గెలిపించండి!2018 పోల్: ఈ హీరోలు, హీరోయిన్ల జాతకాలు మీ చేతుల్లోనే.. ఓట్ వేసి గెలిపించండి!

    తమన్నా తర్వాత కియారాతో ఆ ఫీల్ కలిగింది

    తమన్నా తర్వాత కియారాతో ఆ ఫీల్ కలిగింది

    గతంలో తమన్నా మంచి డాన్స్ పార్ట్‌నర్ అనిపించేవారు. చాలా రోజుల తర్వాత కియారా రూపంలో మంచి డాన్స్ పార్ట్‌నర్ దొరికిన ఫీలింగ్ కలుగుతోంది. కియారాకు పెద్ద కళ్లు ఉన్నాయి. అది ఆమెకు అడ్వాంటేజ్. ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగా ఇస్తుందని తెలిపారు.

    అందుకే ఫ్యామిలీతో బాగా కలిసిపోతుంది

    అందుకే ఫ్యామిలీతో బాగా కలిసిపోతుంది

    తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా మా ఫ్యామిలీస్‌తో కలిసి పోవడానికి కారణం ఆమె కూడా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కావడమే. మదర్, డాటర్, ఫాదర్ కాకుండా చాలా పెద్ద కుటుంబం ఆమెది. ఫ్యామిలీ ఇంపార్టెంట్ తెలుసు కాబట్టే అందరితో కలిసిపోతుందన్నారు.

    చాటుగా పార్టీలు చేసుకోను.. అందరితో కలిసే

    చాటుగా పార్టీలు చేసుకోను.. అందరితో కలిసే

    మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, పార్టీ జరిగినా అందరూ వచ్చేస్తారు. ఫ్రెండ్స్‌తో పార్టీ చేసినా నా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ల పిల్లలు అందరూ ఉంటారు. కనీసం 50 మంది లేనిదే పార్టీలో మజారాదు. ప్రైవేటుగా నలుగురు కూర్చుని చాటుగా చేసుకోవడం ఇష్టం ఉండదు. మాకు దగ్గరగా ఉండే వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్‌తోనే పార్టీలు ఉంటాయని చరణ్ తెలిపారు.

    ఉపాసన, కియారా మధ్య ఆ రాపో ఏర్పడింది

    ఉపాసన, కియారా మధ్య ఆ రాపో ఏర్పడింది

    ఉపాసన షూటింగులకు రావడం, కియారా మా ఇంట్లో జరిగే పార్టీలకు రావడం వల్ల ఇద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. ఆమె మహేష్ బాబు, నాతో సినిమా చేసినా... ఉపాసన, నమ్రతకు దగ్గరయింది. ఉపాసనకు డైరెక్టుగా ఫోన్ చేసి నాకు ఆకలేస్తుంది, ఫుడ్ పంపించమని అడుగుతుంది. కొన్నిసార్లు ఉపాసన స్వయంగా పంపిస్తుంది. వారి మధ్య ఆ కంఫర్టబుల్, రాపో ఏర్పడింది. మన సినిమాల్లో నటించడానికి ఎక్కడి నుంచో వచ్చిన వారిని బాగా చూసుకోవడం నా బాధ్యతగా భావిస్తాను అని రామ్ చరణ్ తెలిపారు.

    రొమాంటిక్ సీన్లు ఉంటే ఉపాసన ఎంకరేజ్ చేస్తుంది

    రొమాంటిక్ సీన్లు ఉంటే ఉపాసన ఎంకరేజ్ చేస్తుంది

    ఉపాసన కూడా షూటింగులకు వస్తుంది. అపుడు నాకు, హీరోయిన్ మధ్య ఏవైనా క్లోజ్ సీన్స్ ఉంటే... ఉపాసన ఇంకా బాగా చేయొచ్చుకదా, ఎందుకు ఇబ్బంది పడుతున్నావంటూ ఎంకరేజ్ చేస్తుంది. ఆమె సినిమాను సినిమాలా చూస్తుందని రామ్ చరణ్ తెలిపారు.

    2019లో నాన్నగారి టార్గెట్ అదొక్కటే

    2019లో నాన్నగారి టార్గెట్ అదొక్కటే

    2019లో నాన్న చిరంజీవిగారి ఓన్లీ టార్గెట్ ‘సైరా నరసింహారెడ్డి'. ఒక నిర్మాతగా ఆయన పూర్తిగా మా సినిమాకే ఉండాలని కోరుకుంటున్నాను అని రామ్ చరణ్ తెలిపారు. ఇలా ప్రకటించడం ద్వారా 2019 ఎన్నికల్లో ప్రచారానికి చిరంజీవి దూరంగానే ఉంటారని రామ్ చరణ్ చెప్పకనే చెప్పారు.

    నాన్న పడే కష్టం చూస్తే సిగ్గేస్తుంది

    నాన్న పడే కష్టం చూస్తే సిగ్గేస్తుంది

    నాన్నగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. కొన్ని సార్లు ఆయన కష్టం చూస్తుంటే సిగ్గేస్తుంది. ఆయన ఈ వయసులో అంత కష్టపడుతున్నారు.. మేము ఇంకెంత కష్టపడాలి అనిపిస్తుంది. ఇప్పటికీ ఉదయం 5.30 గంటలకు నిద్రలేచి 7 గంటల షాట్‌కు ఎక్సర్ సైజ్ చేసి, మేకప్ వేసుకుని వెళతారు. నిర్మాతగా నాకు ఆయన లాంటి నటుడు దొరకడం అదృష్టం.

    ప్రభాస్‌తో పెట్టుకోను, నా ఫ్రెండే... ‘సాహో'తో పోటీపడం

    ప్రభాస్‌తో పెట్టుకోను, నా ఫ్రెండే... ‘సాహో'తో పోటీపడం

    ‘సైరా' చిత్రం విడుదల సమయంలో ‘సాహో' కూడా వస్తుంది. రెండు సినిమా రిలీజ్ డేట్స్ మధ్య మినిమమ్ గ్యాప్ ఉండేలా చూస్తాం. పోటాపోటీగా రిలీజ్ చేయాలనుకోవడం లేదు. ప్రభాస్, యూవి క్రియేషన్స్ మేము ఫ్రెండ్స్... అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి విడుదల చేస్తామని రామ్ చరణ్ తెలిపారు.

    English summary
    Vinaya Vidheya Rama Movie: Ram Charan Interesting comments on Balakrishna and Prabhas. Vinaya Vidheya Rama is a Telugu movie starring Ram Charan, Kiara Advani and Vivek Oberoi in prominent roles. It is a drama directed by Boyapati Srinu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X