For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తప్పు చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా.. కళ్లు మూసి కాపురం చేయాలా? అర్జున్‌కు విశ్వక్ సేన్ ఘాటైన కౌంటర్

  |

  తన సినిమా షూటింగ్‌కు రాకుండా ఇబ్బంది పెట్టారనే ఆరోపణలతో యువ హీరో విశ్వక్ సేన్‌పై సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. విశ్వక్ సేన్ ప్రవర్తనపై ప్రెస్ మీట్ పెట్టి ఘాటుగా స్పందించారు. అయితే అర్జున్ చేసిన వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ స్పందించారు. రాజయోగం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అర్జున్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఎలా రియాక్ట్ అయ్యారంటే?

  చాలా అవమానాలకు గురయ్యా

  చాలా అవమానాలకు గురయ్యా

  ఇండస్ట్రీలో సెటిల్ కావడానికి చాలా కష్టాలు పడ్డాయి. వేషాల కోసం చాలా ఆఫీసులు తిరిగాను. అవమానాలు గురయ్యాను. ముఖం మీదే ఆఫర్లు రిజెక్ట్ చేశారు. అవన్నీ విషయాలు నాకు చాలా గుర్తు ఉంటాయి. అలాంటి పరిస్థితి మళ్లీ రావొద్దని అనుకొంటాను. స్వయంగా వెళ్లిపోమాకే సినిమాను 12 లక్షలు పెట్టి తీశాం. ఆ తర్వాత నాకు ఆఫర్లు రావడం, విజయాలు సాధించడంతో ఈ స్థాయికి చేరుకొన్నాను అని విశ్వక్ సేన్ అన్నారు.

  నాతో ఏ నిర్మాత నష్టపోలేదు

  నాతో ఏ నిర్మాత నష్టపోలేదు

  సినిమాలో నటించడమే కాకుండా.. యూనిట్‌లో ప్రతీ పని నాదే అనుకొని చేస్తాను. సినిమా తీసిన తర్వాత నెల రోజులపాటు ప్రమోషన్స్ చేసుకొంటూ.. రోడ్లపై తిరుగుతుంటాను. 40 రోజులు షూట్ చేస్తే.. 20 రోజులు ప్రమోషన్ చేస్తాను. నా అంత కమిటెడె పర్సన్ ఎవరూ ఉండరు. గత మూడు సంవత్సరాల్లో మూడు సినిమాలు ఫినిష్ చేశాను. ఒక సినిమాలో నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్. అర్జున్ గారు చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించాలని అనుకొంటున్నాను.

  నేను పనిచేసిన ఏ డైరెక్టర్ బాధపడలేదు.. నాతో పనిచేసిన ఏ నిర్మాత నష్టపోలేదు. నేను భయపెట్టేంత చిన్న ప్రొడ్యూసర్స్‌తో పనిచేయలేదు. నేను చిన్న సినిమాలే అయినా.. నేను పెద్ద ప్రొడ్యూసర్స్‌తో పనిచేశాను. నేను పనిచేసిన యూనిట్‌లో లైట్ బాయ్‌ కూడా నేను కమిటెడ్ కాదని అంటే.. ఇండస్ట్రీలో వదిలేసి వెళ్తాను.

  స్క్రిప్టు అడిగితే.. వారం రోజుల ముందు

  స్క్రిప్టు అడిగితే.. వారం రోజుల ముందు

  సినిమా చేసిన తరుణంలో కొత్త డైరెక్టర్లు ఉన్నారు. ఏ సినిమాకైనా కలిసి పనిచేసే వాతావరణంలో పనిచేశాను. ఇచ్చి పుచ్చుకొనే ధోరణితో నేను ఉంటాను. అర్జున్ గారు ఆఫర్ ఇచ్చినప్పడు నేను ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే.. నేను చిన్నప్పటి నుంచి ఆయనను చూసి పెరిగాను. అందుకే ఆయనతో సినిమా చేయాలని అనుకొన్నాను. మూడుసార్లు కలిసి.. కథ విన్న తర్వాత సినిమా చేయాలని నిర్ణయించుకొన్నాను. మా జర్నీ బాగానే ముందుకెళ్లింది. నా సినిమాకు సంబంధించిన స్క్రిప్టు అడిగాను. ఫస్టాఫ్‌ స్క్రిప్టు వారం క్రితం మాత్రమే వచ్చింది అని విశ్వక్ సేన్ తెలిపారు.

  నాకు ఎన్నడూ లేని భయం

  నాకు ఎన్నడూ లేని భయం

  నేను సినిమా వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. నేను ఏదైనా చెబితే.. దాన్ని వదిలేయ్ అంటూ మాటలు మధ్యలోనే తుంచేసే వారు. నాకేదైనా నచ్చకపోతే.. దాని గురించి చర్చించే అవకాశం ఉండేది కాదు. నన్ను నమ్ము రాజా అంటూ నన్ను కట్ చేసేవారు. ఆయనతో వ్యవహారం.. కళ్లు మూసి కాపురం చేసే విధంగా ఉండేది. అయినా నేను సినిమా చేయడానికే సిద్దమయ్యాను. అయితే తెల్లవారి లేచి సెట్‌కు వెళ్తుంటే.. నాకు ఒక భయం కలిగింది. అలాంటి భయం నాకు ఎప్పుడు కలుగలేదు. అందుకే నేను ఆయనకు మెసేజ్ చేశాను అని విశ్వక్ సేన్ చెప్పారు

  డబ్బు వాపసు చేయమన్నారు అంటూ

  డబ్బు వాపసు చేయమన్నారు అంటూ

  నేను ఎప్పుడూ సినిమా నుంచి తప్పుకొంటున్నానని చెప్పలేదు. సినిమాను ఆపేయలేదు. ఈ రోజు ఒక్కరోజు సినిమా షూటింగ్ క్యాన్సిల్ చేయండి.. ఒకసారి మాట్లాడుకుందామని చెప్పాం. నేను, నా మేనేజర్ ఎక్కడికి రమ్మన్నా వస్తానని చెప్పాం. కానీ ఆయన మేనేజర్ అకౌంట్ డిటేయిల్స్ పెట్టి.. డబ్బులు వాపసు చేయమని మెసేజ్ పెట్టారు.

  షూటింగులో.. సెట్లో ముఖం ఎలాగో పెట్టుకొని.. నాలుగు రోజుల తర్వాత గొడవ జరిగితే ఏం బాగుంటుంది? నాకు నాలుగు గోడల మధ్య మాట్లాడటం నచ్చదు. ఏది ఉన్న ముఖం మీదే చెప్పడం అలవాటు. ఈ విషయంలో నా ఫ్యామిలీ కూడా బాధపడుతున్నారు అని విశ్వక్ సేన్ అన్నారు.

  అర్జున్ గారికి క్షమాపణలు

  అర్జున్ గారికి క్షమాపణలు

  అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నా గురించి రకరకాల మాటలు వినిపించాయి. నా గురించి రకరకాల డిబేట్లు పెట్టడం బాధ ఉంది. నేను సినిమా తర్వాత సినిమా చేస్తున్నాను. నేను సెట్‌లో ఎదైనా తప్పు చేస్తే.. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా. మిమ్మల్ని అవమానించారని భావిస్తే.. నేను క్షమాపణ చెబుతున్నాను. ఈ సినిమాలో పనిచేయడం లేదనేది అందరికి తెలుసు. అర్జున్ గారు బాగుండాలి. సినిమా బాగుండాలి.. ఆల్ ది బెస్ట్ అని విశ్వక్ సేన్ చెప్పారు.

  English summary
  Vishwak Sen strong reply to Action King Arjun Sarja allegations over movie Cancel in Rajayogam teaser release function. Few days back, Arjun had press meet in hyderabad and made allegations on Vishwak sen.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X