గర్భవతిగా ఉన్న అమీ జాక్సన్.. బాయ్ ఫ్రెండుతో గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్! (ఫోటోస్)

Recommended Video

Pregnant Amy Jackson Gets Engaged To Boyfriend George Panayiotou In London || Filmibeat Telugu

హీరోయిన్ అమీ జాక్సన్, ఆమె బాయ్ ఫ్రెండ్ జార్జ్ పనాయిటూ కొన్ని రోజులుగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి కూడా... మరికొన్ని రోజుల్లో వీరి ప్రేమకు ప్రతిరూపంగా ఓ బిడ్డ జన్మించబోతోంది. తాజాగా ఈ ప్రేమజంట కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ వేడుక జరుపుకున్నారు.

లండన్లోని ఓ హోటల్‌లో అమీ జాక్సన్-జార్జ్ పనాయిటూ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ కపుల్‌ను విష్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

డాన్స్ చేస్తూ హ్యాపీ మూడ్లో అమీ జాక్సన్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో అమీ జాక్సన్ హ్యాపీ మూడ్లో కనిపించారు. తనకు కాబయే భర్తతో డాన్స్ చేస్తూ సందడి చేశారు.. ఈ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన విందు వినోదాల్లో మునిగి తేలారు. ఎంగేజ్మెంట్ వేడుక సందర్భంగా అమీ జాక్సన్ లుక్ అదిరిపోయింది.

జనవరి 1న ప్రపోజ్ చేశాడు

జనవరి 1న ప్రపోజ్ చేశాడు

అమీ జాక్సన్‌కు జార్జ్... జనవరి 1న ప్రపోజ్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె గతంలో ఓ మేగజైన్ ఇంటర్వ్యూలో వెల్లంచారు. ‘జార్జ్ నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. అతడు ప్రపోజ్ చేసిన తర్వాత నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైనట్లయింది. ఈ ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ గర్ల్ నేను.' అంటూ వ్యాఖ్యానించారు.

ప్రెగ్నెన్సీ ప్రకటించి సర్ ప్రైజ్

ప్రెగ్నెన్సీ ప్రకటించి సర్ ప్రైజ్

అమీ, జార్జ్ ప్రేమ విషయం తెలిసినపుడు ఎవరూ ఆశ్చర్యపోలేదు కానీ... మార్చి 31న గర్బం దాల్చినట్లు అమీ జాక్సన్ ప్రకటించడంతో అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన హీరోయిన్ల లిస్టులో అమీ కూడా చేరిపోయారు. తల్లి కాబోతున్న సందర్భంగా తాను పొందుతున్న అనుభూతి ఎంతో గొప్పగా ఉందని పేర్కొన్నారు.

అనుకోకుండా అలా జరిగింది, అయినా హ్యాపీ..

అనుకోకుండా అలా జరిగింది, అయినా హ్యాపీ..

ప్రెగ్నెన్సీ అనుకోకుండా అలా జరిగిపోయింది. అయితే తాము అందుకు సిద్ధంగా ఉన్నామని అమీ జాక్సన్ వెల్లడించారు. తాజాగా నిశ్చితార్థం జరుగడంతో వీరి రిలేషన్ మరో లెవల్‌కి చేరుకున్నట్లయింది. బిడ్డ పుట్టిన తర్వాత పెళ్లి వేడుక ప్లాన్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు.

పెళ్లి ఎక్కడంటే...

పెళ్లి ఎక్కడంటే...

అమీ జాక్సన్, జార్జ్ పనాయిటూ వివాహం 2020 ప్రారంభంలో జరిగే అవకాశం ఉంది. పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే ప్లానింగ్ వేసుకున్నారు. గ్రీస్‌లోని మైకనోస్ ఐలాండ్‌లో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగబోతోంది. జార్జ్ పనాయిటూ బ్రిటన్లోని ఓ ధనవంతమైన కుటుంబానికి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X