15 ఏళ్ల వయసులోనే అలాంటి చేదు అనుభవం.. ఇండస్ట్రీ బాగోతాన్ని బయటపెట్టిన అనుష్క శర్మ!
బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగా దూసుకుపోతున్నారు అందాల భామ అనుష్క శర్మ. హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర తారగా ఎదగాలంటే సామాన్యమైన విషయం కాదు. అయితే తాను వెండితెర మీద తారగా రాణించడానికి ఎన్ని కష్టాలు పడ్డారనే విషయాన్ని అనుష్క శర్మ పంచుకొన్నారు. ఈ క్రమంలో అనుష్క శర్మకు సంబంధించిన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలు మీకోసం..

15 ఏళ్ల వయసులోనే..
ఇక అనుష్క కెరీర్ ఆరంభంలో జరిగిన విషయాలను చెబుతూ.. నా 15వ ఏటనే సినిమాల్లో అవకాశాల కోసం ఆడిషన్స్‌కు వెళ్లాను. కానీ ప్రతీసారి ఏదో కొత్త అనుభవం, చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. చాలా మంది నా ముఖం చూసి లేత వయసు హీరోయిన్‌గా పనికి రావంటూ రిజెక్ట్ చేశారు. అలా చాలా అవకాశాలు చేజారాయి అంటూ అనుష్క శర్మ తెలిపారు

నా శరీరాన్ని చూసి..
యుక్తవయసులో ఉన్న నన్ను మాత్రమే చూశారు. కానీ నాలో ఉన్న ప్రతిభను చూడలేదు. కేవలం నేను ఎలా కనిపిస్తున్నాననే విషయాన్ని బట్టే పనికి రానని తేల్చేశారు. అలా ఓ వ్యక్తి నా టాలెంట్‌ను డిసైడ్ చేయడం నాకు నచ్చలేదు. అంతేకాకుండా నన్ను మానసికంగా కుంగదీసింది. కానీ చిన్న వయసులోనే అలాంటి చేదు అనుభవాలను, ఒత్తిడిని ధీటుగా తట్టుకొన్నాను అంటూ అనుష్క శర్మ పేర్కొన్నారు.

ఆ ఇద్దరి వల్లే జీవితాలు నాశనం
బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించాలని వచ్చే వారికి నిర్మాతలు, క్యాస్టింగ్ డైరెక్టర్లు శాపంగా మారుతారు. వారి వల్లే చాలా మంది ప్రతిభావంతులు మరుగున పడిపోతున్నారు. అలాంటి వారు మాట్లాడే తీరును చాలా తెలివిగా అర్ధం చేసుకొనే దానిని. వారి మాటల్లో ఉద్దేశాన్ని తొందరగా గ్రహించి వారి మనసులో ఎలాంటి చెడు భావనలు ఉన్నాయో అర్థం చేసుకొనేదానిని అంటూ అనుష్క శర్మ వెల్లడించారు.

నిర్మాతగా వెబ్ సిరీస్‌ల నిర్మాణం
ఇక అనుష్క శర్మ కెరీర్ విషయానికి వస్తే.. 2018లో షారుక్ ఖాన్‌తో జీరో సినిమా చేసిన తర్వాత ఏ చిత్రంలోను నటించలేదు. కానీ నిర్మాతగా పాతాల్ లోక్, బుల్‌బుల్ చిత్రాలను నిర్మించారు. ఓటీటీలో ఆ రెండు వెబ్ సిరీస్‌లు కూడా మంచి విజయాన్ని అందుకొన్నాయి. ఇక హీరోయిన్‌గా ఇంకా సినిమాలను అంగీకరించలేదు. మా, కాలా అనే చిత్రాలను నిర్మించింది. అవి త్వరలోనే విడుదల కానున్నాయి.
Recommended Video

విరాట్ కోహ్లీతోపాటు ఇంగ్లాండ్‌లో
బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తున్న క్రమంలోనే భారత క్రికెటర్ విరాట్ కోహ్లీతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వారిద్దరూ ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొన్నారు. ప్రస్తుతం వారికి వమికా అనే కూతురు పుట్టింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్ కోసం విరాట్ కోహ్లీతోపాటు అనుష్క, వమికా అక్కడికి చేరుకొన్నారు.


Click it and Unblock the Notifications











