‘హీరోయిన్ల నాభిపై పండ్లు, ఐస్ ముక్కలు.. ఎప్పుడూ అదే పిచ్చి’
భారతీయ చిత్ర పరిశ్రమలో వందలాది మంది దర్శకులు ఉన్నారు. సినిమా తీయడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కొందరు యాక్షన్ బాగా తీస్తే, మరికొందరు కామెడీ, సెంటిమెంట్, డ్రామాలు బాగా తీయగలరు. అయితే రొమాంటిక్ సినిమాలు, సీన్స్ తీసే దర్శకులు చాలా తక్కువగా ఉంటారు. అయితే ఇలాంటి వారిపై విమర్శలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ దక్షిణాది ఇండస్ట్రీలోని దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నుంచి హీరోయిన్‌గా
ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యకు అసిస్టెంట్ కొరియగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టింది డైసీ షా. ఈమె అందం, డ్యాన్స్ స్కిల్స్‌తో సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది. బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్, గెస్ట్ రోల్స్ చేసింది. చిన్నాచితకా పాత్రలు వేస్తుండగా కన్నడంలో భద్ర అనే సినిమాతో డైసీ షా హీరోయిన్‌గా మారింది. తర్వాత ఏకంగా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన జై హోలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. అనంతరం హేట్ స్టోరీ 3, రామ్ రతన్, రేస్ 3, మిస్టరీ ఆఫ్ ది టాటూ వంటి సినిమాలలో నటించింది.

41వ వసంతంలోకి డైసీ షా
పాతికేళ్ల కెరీర్‌లో హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ చిత్రాల్లో నటించారు డైసీ షా. బుల్లితెరపైనా ఈ ముద్దుగుమ్మ దుమ్మురేపింది. ఫియర్ ఫ్యాక్టర్ : ఖాట్రోన్ కీ ఖిలాడీ 13 రియాలిటీ షోతో పాటు ది ఘోస్ట్ ఆఫ్ గాంధీ, రెడ్ రూమ్ వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది. ఈ ఆగస్ట్ 25తో 41వ వసంతంలోకి అడుగుపెట్టింది డైసీ షా. సినిమాలతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ ఈమె ముందుంటుంది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, రిలేషన్, పెళ్లి, ఇండస్ట్రీలోని విషయాలపై కీలక వ్యాఖ్యలు చేసింది డైసీ షా.
ఇద్దరితో బ్రేకప్స్
తనకు గతంలో ఇద్దరితో బ్రేకప్స్ జరిగాయని డైసీ షా చెప్పింది. ఓ కుర్రాడితో చాలా ఏళ్లపాటు ప్రేమలో ఉన్నానని.. తొలి నాలుగేళ్లలో అసలు పెళ్లి ఆలోచన రాలేదని, ఆ తర్వాత అతను ఆ ఉద్దేశం లేకుండా చేశాడి డైసీ షా తెలిపింది. ఇక అతనితో సంతోషంగా ఉండనని గ్రహించి వెంటనే బ్రేకప్ చెప్పానని ఆమె పేర్కొంది. రెండో వ్యక్తికి అనుమానం ఎక్కువని.. నేను ఎక్కడికి వెళ్తున్నా? అబ్బాయిలతో పనిచేస్తున్నానా? అని అడిగేవాడని ఆవేదన వ్యక్తం చేసింది డైసీ షా. దురదృష్టవశాత్తూ అతను కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనని కానీ నా గురించి ఇలా అనుకోవడాన్ని భరించలేకపోయానని ఆమె వాపోయింది.
నడుము, బొడ్డు పిచ్చి
ఇక దక్షిణాదిలో సినిమాల చిత్రీకరణపై డైసీ షా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ హీరోయిన్ల అందాలను, నడుము, బొడ్డును చూపించే పిచ్చి ఉందని వ్యాఖ్యానించింది. ఓసారి తాను ఓ కన్నడ ఛానెల్ చూస్తుండగ.. అందులో ఓ నటుడు హీరోయిన్ నడుముపై పండ్లు, ఐస్ ముక్కలు వేసి ఆమె నడుమును సలాడ్‌గా మార్చాడని మండిపడింది. హీరోయిన్ల నడుము, నాభి ప్రాంతాల్లో క్లోజప్ షాట్స్ పెట్టడం అన్ని ఇండస్ట్రీలలో ఉన్నప్పటికీ.. దక్షిణాదిలో ఇది కాస్త ఎక్కువగా ఉంటుందని డైసీ షా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరినీ ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కన్నడ సూపర్‌స్టార్, దర్శకుడు రవిచంద్రన్ ఇలాంటి రొమాంటిక్ సినిమాలు, పాటలు తీయడంలో సిద్ధహస్తుడు. ఇక తెలుగులో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు హీరోయిన్ల అందాలను అద్భుతంగా చూపిస్తారు. వీరినే ఉద్దేశించే డైసీ షా ఇలాంటి వ్యాఖ్యలు చేసిందా అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











