For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నాగార్జున హీరోయిన్.. లైఫ్‌కు ముప్పు మారిన సమయంలో అంటూ...

  |

  బాలీవుడ్ నటి దియా మిర్జా దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తమకు కలిగిన పుత్రోత్సావాన్ని తమ సన్నిహితులు, అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకొన్నారు. తన మాతృత్వపు అనుభవాన్ని ఇన్స్‌టాగ్రామ్‌లో పంచుకొన్నారు. దియా మిర్జా వ్యక్తిగత జీవితం, ఆమె చేసిన పోస్టు వివరాల్లోకి వెళితే...

  దియా మిర్జా తొలి మ్యారేజ్ బ్రేకప్

  దియా మిర్జా తొలి మ్యారేజ్ బ్రేకప్

  బాలీవుడ్‌లో అందాల భామగా మన్ననలను అందుకొన్న హైదరాబాదీ దియా మిర్జా మొదటి వివాహం నిర్మాత సాహిల్ సంఘాతో జరిగింది. అయితే సుధీర్ఘంగా సాగిన వారి వివాహం జీవితంలో కలతలు చోటు చేసుకోవడంతో విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. దాంతో సాహిల్, దియా మిర్జా 11 ఏళ్ల వైవాహిక జీవితానికి 2019లో తెరపడింది.

  ముంబై వ్యాపారవేత్తతో రెండో వివాహం

  ముంబై వ్యాపారవేత్తతో రెండో వివాహం

  ఆ తర్వాత వ్యాపారవేత్త వైభవ్ రేఖితో దియా మిర్జా అఫైర్ పెట్టుకొన్నారు. అనంతరం వారిద్దరూ ఫిబ్రవరి 15వ తేదీన వివాహం చేసుకొన్నారు. వివాహం తర్వాత కొద్ది రోజులకే ఆమె తాను గర్బవతిని అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దాంతో ఆమెకు అభిమానులు శుభాక్షాంక్షలు తెలియచేస్తూ అభినందించారు.

  దియా మిర్జాకు తొలి సంతానం

  దియా మిర్జాకు తొలి సంతానం

  తాజాగా మే 14వ తేదీన తమకు కుమారుడు పుట్టారనే వార్తను ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తమ కుమారుడి చేతిని పట్టుకొన్న ఫోటోను షేర్ చేశారు. చిన్నారి ముఖం చూపించకుండా సీక్రెట్‌గా ఉంచారు. దియా మిర్జా దంపతులు తమ కుమారుడికి ఆవ్యయాన్ ఆజాద్ రేఖీ అని నామకరణం చేశారు. నవజాత శిశువుకు సంబంధించిన ఐసీయూలో వైద్యులు, నర్సుల సంరక్షణలో స్వేచ్ఛగా ఆజాద్ జన్మించాడు అని తన పోస్టులో పేర్కొన్నారు.

  ఇన్స్‌టాగ్రామ్‌లో దియా మిర్జా ఎమోషనల్‌గా

  ఇన్స్‌టాగ్రామ్‌లో దియా మిర్జా ఎమోషనల్‌గా

  ప్రముఖ రచయిత ఎలిజబెత్ స్టోన్ రాసిన కొటేషన్‌ను.. సంతానం కలుగాలనే కోరిక హృదయం నుంచి పుట్టాలి. ఆ పిల్లాడి చేయి పట్టుకొని తిరిగితే ఆ అనుభూతి గొప్పగా ఉంటుంది అని దియ మీర్జా ఉదహరించారు. పైన చెప్పిన కొటేషన్ నా భర్త మనసుకు దగ్గరగా ఉంటుంది. చిన్నారి జననం ఓ మిరాకిల్. చాలా తొందరగా స్వేచ్ఛగా ఈ భూమిపైకి వచ్చారు అంటూ దియా మిర్జా తన పోస్టులో పేర్కొన్నారు.

  సకాలంలో వైద్యుల జాగ్రత్తతో

  సకాలంలో వైద్యుల జాగ్రత్తతో

  నేను గర్భం దాల్చిన సమయంలో ఉదర సంబంధిత సమస్యలు ఏర్పడ్డాయి. కడుపులో బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ పెరిగిపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. ఆ సమస్య నా ప్రాణాలకు ముప్పుగా మారింది. సకాలంలో డాక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో సీ సెక్షన్ ద్వారా అత్యవసరంగా చిన్నారికి జన్మనిచ్చేందుకు చర్యలు తీసుకొన్నారు అని తన పోస్టులో దియా మిర్జా వెల్లడించారు.

  Akkineni Nagarjuna Exclusive Interview | Wild Dog
  దియా మిర్జా సినీ కెరీర్

  దియా మిర్జా సినీ కెరీర్

  దియా మిర్జా కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో రెహ్నా హై తెరే దిల్ మే చిత్రంతో గుర్తింపు పొందిన ఆమె.. సంజు, తప్పడ్ లాంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించింది. తాజాగా తెలుగులో నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది.

  English summary
  Actress Dia Mirza blessed with Baby Boy, Emotional Posts on Instagram. Dia Mirza wrote that, "To have a child is to decide forever to have your heart go walking around outside your body.”These words perfectly exemplify Vaibhav & my feelings right now. Our heartbeat, our son Avyaan Azaad Rekhi was born on May 14th. Having arrived early, our little miracle has since then been cared for by tireless nurses and doctors in the Neonatal ICU.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X