'ఆ స్టార్ హీరోను పీకల దాకా ప్రేమించా.. కానీ చెల్లి అంటూ షాక్..'
సామాన్యులతో పాటు సెలబ్రెటీలకు కూడా ప్రేమకథలు, క్రష్‌లు ఉంటాయ. కొందరు వీటిని మనసులో దాచుకుంటే, మరికొందరు బయటపెడుతుంటారు. కలిసి పనిచేసే సమయంలో హీరోల వ్యక్తిత్వాన్ని పలువురు హీరోయిన్లు పడిపోతుంటారు. వారికి పెళ్లయి, పిల్లలున్నా ఎంతో ఇష్టం చూపిస్తుంటారు. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇలాంటి జంటలు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ హీరోయిన్.. ఓ హీరోని ఎంతో ప్రేమించగా, అతను చెల్లెలు అని పిలవడంతో షాకైంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె ఎవరిని ప్రేమించారు? ఈ వివరాల్లోకి వెళితే..
శ్రీదేవితో బంధుత్వం
అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కుటుంబానికి చెందిన మహేశ్వరి 90వ దశకంలో హీరోయిన్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీదేవి అక్క కూతురే మహేశ్వరి. 17 ఏళ్ల వయసులో 1994లో భారతీరాజా దర్శకత్వంలో తమిళ చిత్రం కరుత్తమ్మ ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు మహేశ్వరి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత అమ్మాయి కాపురం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది మహి. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి హీరోగా వచ్చిన గులాబీ సినిమాతో ఆమెకు బ్రేక్ వచ్చింది. నీలి కళ్లు, అందంమైన రూపంతో అప్పట్లో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది మహేశ్వరి.

గులాబీతో స్టార్‌డమ్
అనంతరం దెయ్యం, మృగం, పెళ్లి, ప్రియరాగాలు, నవ్వులాట, ఓ పనైపోతుంది బాబు, మా బాలాజీ, రామసక్కనోడు, నీ కోసం, బలరాం, మా అన్నయ్య, నాగులమ్మ, తిరుమల తిరుపతి వెంకటేశ చిత్రాలతో తెలుగువారిని అలరించారు మహేశ్వరి. 30 ఏళ్లకు పైగా కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు. అయితే పాతికేళ్ల క్రితం తిరుమల తిరుపతి వెంకటేశ సినిమా తర్వాత మహేశ్వరి ఏ సినిమాలోనూ నటించలేదు. అయితే బుల్లితెరపై సీరియల్స్, రియాలిటీ షోలతో ఆమె ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు.
అక్కా అక్కా అని పిలిచేదాన్ని
శ్రీదేవి తనను ఎంతో బాగా చూసుకునేవారని.. ఆమె వరుసకు తనకు పిన్ని అవుతారని, కానీ అక్కా అక్కా అని పిలిచేదాన్నని మహేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆవిడ ఫారిన్‌లో షూటింగ్‌లో ఉన్నట్లుగా ఉంది తప్పించి.. చనిపోయారని అనిపించడం లేదని ఆమె కన్నీటి పర్యంతమైంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే 2008లో గుంటూరుకు చెందిన జయకృష్ణ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మహేశ్వరి పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యారు.
మీనాకు క్లోజ్ ఫ్రెండ్
ఇక నటి మీనాకు మహేశ్వరి క్లోజ్ ఫ్రెండ్. ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు తోడుగా నిలుస్తుంటారు. మీనా భర్త విద్యాసాగర్ మరణించి ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లగా.. మీనాను తిరిగి మామూలు మనిషిని చేయడంలో మహేశ్వరి కీలకపాత్ర పోషించారు. ఇప్పటికీ వీరిద్దరూ తరచుగా కలుస్తూనే ఉంటారు. తాజాగా జగపతి బాబు హోస్ట్‌గా ప్రసారమవుతున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో మీనా, సిమ్రన్‌లతో పాటు మహేశ్వరి కూడా హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆ హీరో చెల్లి అని పిలిచాడు
తాను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ని ఎంతో ఇష్టపడ్డానని మహేశ్వరి చెప్పింది. క్రష్ కంటే కూడా అజిత్ వ్యక్తిత్వాన్ని నేను గౌరవిస్తా, ఆయనతో రెండు సినిమాలు కూడా చేశాను. ఓ సినిమా కొంచెం ఆలస్యం కావడంతో షూటింగ్ పూర్తి కావడానికి ఏడాదిన్నర పట్టింది. ఇక ఆ సినిమా షూటింగ్ లాస్ట్ రోజున ఆయనను మళ్లీ కలవలేం, చూడలేమని తెలిసి బాధపడుతున్నా. అజిత్ నా దగ్గరికొచ్చి మహి.. నువ్వు నా చెల్లెలు లాగా.. నీకు ఏం కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా నన్ను కలవమన్నారు. ఆ మాట చెప్పాక ఇక మనం ఏం చేయలేం కదా అని మహేశ్వరి చెప్పడంతో జగపతి బాబు, మీనా, సిమ్రన్‌లు నవ్వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











