Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Manchu Lakshmi: లెగ్స్ అందాలతో స్టన్ అయ్యేలా చేసిన మంచు లక్ష్మి.. ఇలా ఎప్పుడైనా చూశారా?
మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి సినిమా ఇండస్ట్రీలో ఒక నటిగానే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. అయితే ఆమె నిర్మాతగా కంటే కూడా నటిగానే చాలా మంచి గుర్తింపును అందుకున్నారు. ఇక సినిమాలు చేస్తున్న చేయకపోయినా కూడా సోషల్ మీడియాలో ఆమె రెగ్యులర్ గా ఏదో ఒక ఫోటోతో మాత్రం ఫాలోవర్స్ ను అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక రీసెంట్ గా ఆమె లెగ్స్ అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేశారు. ఇలా మంచు లక్ష్మిని ఎప్పుడూ చూసి ఉండరేమో అనేలా ఆమె స్టిల్స్ అయితే ఇచ్చింది. ఆ వివరాలలోకి వెళితే..

నిర్మాతగా నటిగా...
మంచు లక్ష్మి మొదట నటిగా కంటే నిర్మాతగా తన అడుగులు వేయాలని అనుకుంది. ఆమె మంచి డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను కూడా నిర్మించింది. గుండెల్లో గోదారి అనే సినిమాతో నిర్మాతగానే కాకుండా నటిగా కూడా ప్రశంసలు కురిపించింది. కానీ కమర్షియల్ గా మాత్రం ఆ సినిమా సక్సెస్ కాలేదు. ఇక వారి సోదరులతో కూడా ఆమె కొన్ని సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే.

విలన్ పాత్రల్లో..
ఒక నిర్మాతగా సక్సెస్ కాకపోవడంతో మంచు లక్ష్మి కొన్ని సినిమాలలో ముఖ్యమైన పాత్రలలో కూడా నటించింది. ముఖ్యంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ నుంచి వచ్చిన అనగనగా ఒక ధీరుడు సినిమాలో ఆమె నటించిన విలన్ పాత్రకు మంచి గుర్తింపును అందించింది. అంతే కాకుండా పలు అవార్డులు కూడా వచ్చాయి. ఆ సినిమా అనంతరం కూడా ఆమె కొన్ని సినిమాలలో నెగిటివ్ పాత్రలలో కనిపించింది.

లిప్ లాక్ సీన్
కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా మంచు లక్ష్మి సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ఆమెకు కంటెంట్ నచ్చితే ఏదో ఒక విధంగా ఆ సినిమాలను ప్రేక్షకుల వరకు తీసుకువెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా ఒక మలయాళం సినిమాలో లెస్బియన్ పాత్రలో కూడా నటించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులోనే లిప్ లాక్ చేసిన సన్నివేశం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

లెగ్స్ అందాలతో స్టిల్స్
ఇక సోషల్ మీడియాలో మంచు లక్ష్మి పోస్ట్ చేస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు కూడా అప్పుడప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇక రీసెంట్ గా ఆమె ఒక స్టైలిష్ డ్రెస్ లో కనిపించిన విధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. మంచు లక్ష్మి ఒక వైపు లెగ్స్ మరొకవైపు అందమైన చూపులతో కుర్రాళ్లను ఊహించని విధంగా అట్రాక్ట్ చేసింది.
వయసు పెరుగుతున్నా..
నాలుగు పదుల వయసు వచ్చిన కూడా ఆమె ఇంకా చాలా తక్కువ వయసున్న నటిగా కనిపిస్తోంది అని కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక మంచు లక్ష్మి ఫిట్నెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది అని అర్థమవుతుంది ఇక ఆమెకు ప్రస్తుతం అయితే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆహా లో ఆమె ఫుడ్ కు సంబంధించిన షో కూడా చేస్తున్న విషయం తెలిసిందే.