60 ఏళ్ల వయసులోనూ తరగని అందం.. కుర్రాళ్లని తలదన్నేలా నదియా కసరత్తులు

చిన్న వయసులోనే అందరికీ జుట్టు నెరిసిపోతూ, బట్టతలతో, బానపొట్టతో పెద్ద వయసులా కనిపించేవారు నటులు కొందరైతే .. 60 ప్లస్‌లోనూ చెక్కుచెదరని అందంతో మెరిసిపోయేవారు ఎందరో. అక్కినేని నాగార్జున, రేఖ, హేమామాలిని, భాగ్యశ్రీ, మాధురీ దీక్షిత్ వంటి వారు వయసు పెరుగుతున్నా ఇంకా గ్లామర్‌తో మెరిసిపోతున్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానం, కఠినమైన డైట్లు, క్రమం తప్పని వ్యాయామంతో వారు తమ అందాన్ని కాపాడుకుంటున్నారు. వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అని ఇలాంటి వారు నిరూపిస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు అలనాటి హీరోయిన్ నదియా. 60 ఏళ్ల వచ్చినా చెక్కుచెదరని గ్లామర్‌తో ఆమె వెలిగిపోతున్నారు.

18 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా
24 అక్టోబర్ 1966న ముంబైలో ఓ మలయాళీ కుటుంబంలో జన్మించారు నదియా. ఆమె అసలు పేరు జరీనా మోయిడు. 1984లో మలయాళ చిత్రం నొక్కెతా దూరతు కన్నుమ్ నట్టు ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. తొలి సినిమాలోనే మోహన్‌లాల్, పద్మినీ వంటి స్టార్స్‌తో నటించే అవకాశం దక్కించుకున్నారు నదియా. ఈ సినిమాకు గాను ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకున్నారు నదియా. 1988లో సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు నటించిన బజార్ రౌడీ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు నదియా. ఆ తర్వాత వింత దొంగలు, ఓ తండ్రి ఓ కొడుకు అనే సినిమాలు చేశారు నదియా.

Actress Nadhiya doing workouts at the age of 60 her video goes viral

పెళ్లితో నటనకు గుడ్‌బై
హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉండగానే నదియా పెళ్లి పీటలెక్కారు. 1988లో శిరీష్ గాడ్‌బ్లే అనే వ్యక్తిని పెళ్లాడగా.. ఈ దంపతులకు సనమ్, జనా అనే కుమార్తెలు సంతానం. పెళ్లి తర్వాత భర్తతో కలిసి అమెరికాకు వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డారు నదియా. భర్త, పిల్లల కోసం నటనకు దూరమైన నదియా తిరిగి 2000లో ఇండియాకు వచ్చారు. 2004లో తమిళ చిత్రం ఎం కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. తల్లిగా, అక్కగా, వదినగా టర్న్ అయిన నదియా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అందమైన హీరో, హీరోయిన్లకు స్టైలీష్ మదర్‌గా నిలిచారు.

25 ఏళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ
దాదాపు పాతికేళ్ల తర్వాత 2011లో మిర్చి సినిమాతో తిరిగి తెలుగు వారిని పలకరించారు నదియా. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్‌కు తల్లిగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్‌కు మేనత్తగా బాగా పాపులర్ కావడంతో పాటు ఎన్నో అవార్డులను అందుకున్నారు. అనంతరం దృశ్యం, బ్రూస్ లీ, అ ఆ, నా పేరు సూర్య, మిస్ ఇండియా, వరుడు కావలెను, దృశ్యం 2, ఘనీ, సర్కారు వారి పాట, అంటే సుందరానికీ వంటి చిత్రాల్లో నటించారు నదియా. 2023లో చివరిసారిగా ఓ తమిళ చిత్రంలో నటించిన నదియా మళ్లీ కనిపించలేదు.

60 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్
59 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని గ్లామర్‌తో మెరిసిపోతున్నారు నదియా. అందాన్ని కాపాడుకోవడానికి వయసును లెక్క చేయకుండా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నారు. తాజాగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫోటోలు, వీడియోలను నదియా షేర్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ వయసులోనూ కష్టపడుతున్న నదియాను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. త్వరలోనే ఆమె సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు.

More from Filmibeat

Read more about: nadhiya movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X