డబ్బులు ఇచ్చి మరీ నన్ను తొక్కేస్తున్నారు.. OG హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫైర్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో భారీ హిట్ అందుకోక పోయినా ఆమెకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు అందుతున్నాయి. నెక్ట్స్ ప్రియాంక అరుళ్ మోహన్ ఏకంగా పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి వెండితెరపై అలరించేందుకు సిద్ధంగా ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న భారీ యాక్షన్ ఫిల్మ్ THEY CALL HIM OG ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ప్రియాంక కెరీర్ మరో మలుపు తిరిగే అవకాశం లేకపోలేదు.

కన్నడ చిత్ర పరిశ్రమలో తొలుత హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ క్రేజ్ సంపాదించుకుంది. ఆమె కర్ణాటకలో 1995 నవంబర్ 20న జన్మించింది. ఆమె కుటుంబం మొత్తం బెంగళూరులో ఉంటుంది. బయోలాజికల్ ఇంజనీరింగ్ లో ప్రియాంక మోహన్ డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఆ తర్వాత నటనపై తనకున్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. 2019లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కన్నడ చిత్రం ఒందు కథే హెల్లా అనే సినిమాలో నటించి హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.

Actress Priyanka Arul Mohan fire against Paid Trolls

ఆ తర్వాత డైరెక్ట్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నేచురల్ స్టార్ నాని ఈ కన్నడ బ్యూటీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. నాని ప్రియాంక మోహన్ కలిసి నటించిన చిత్రం గ్యాంగ్ స్టర్ 2019లో విడుదలై మంచి రిజల్ట్ ను అందుకుంది. ఆ తర్వాత తమిళ చిత్రాల్లోనే బిజీ అయ్యింది. ఇక మరోసారి నాని సరసన సరిపోదా శనివారం చిత్రంతో తిరిగి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ గ్యాప్ లో తమిళంలో స్టార్ హీరోలతో కలిసి పని చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ప్రియాంక మోహన్ రీసెంట్ కామెంట్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

కాంట్రవర్సీలకు, హద్దులు దాటిన సీన్లను ప్రియాంక మోహన్ ఎంతో దూరంగా ఉంటారు. వెండితెరపై అచ్చమైన తెలుగు హీరోయిన్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటూ ఉన్నారు. అలాంటి ప్రియాంక మోహన్ పై కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె కెరీర్ గ్రాఫ్, వ్యక్తిగత విషయాలపై మీమ్స్ చేస్తున్నారు. దానిపై ప్రియాంక మోహన్ ఇటీవల స్పందించింది. తనపై తప్పుడుగా ప్రచారం చేస్తుంది ఎవరో చెప్పే ప్రయత్నం చేసింది.

తనపై ఎవరో కావాలని ట్రోల్స్, మీమ్స్ చేయిస్తున్నారని, తనను ఎంతగానో బ్యాడ్ చేయాలని నెగెటీవ్ ప్రచారం చేస్తున్నారని మండి పడింది. నేను అంటే నచ్చని వాళ్లు, నన్ను ద్వేశించే వాళ్లు నన్ను తొక్కేసేలా నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. మీమర్స్ కు డబ్బులు ఇచ్చి మరీ ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇంత క్యూట్ అండ్ స్వీట్ హీరోయిన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయించాల్సిన అవసరం ఎవరికి ఉందని సందేహాలు మొదలయ్యాయి. ఇక సెప్టెంబర్ 25న OG చిత్రంతో ప్రియాంక మోహన్ అలరించబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X