ఆ ఇంజెక్షన్‌లతో వయసులోకి... ఆ పాపం వాళ్లదే, హీరోయిన్ రాశి షాకింగ్ కామెంట్స్
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు అందమే పెట్టుబడి. అందాన్ని, శరీరాన్ని కాపాడుకున్నప్పుడే వీరి కెరీర్ నాలుగు కాలాల పాటు సాగుతుంది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చిన ఆశలు వదులుకోవాల్సిందే. చాలామంది హీరోయిన్లు చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలో కథానాయికలుగా అడుగుపెట్టారు. అయితే వీరిలో చాలామంది యవ్వనంలో ఉన్నట్లుగా, పెద్ద వయసుగా కనిపించడానికి రకరకాల ఇంజెక్షన్లు తీసుకున్నారని రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. కొందరు హీరోయిన్లపై మాత్రం ఏళ్లు గడుస్తున్నా.. ఈ రూమర్ వెంటాడుతూనే ఉంది. వీరిలో సీనియర్ నటి రాశి కూడా ఒకరు.
కుర్రాళ్ల కలల రాకుమారిగా
90వ దశకంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపారు రాశి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అగ్రనటుల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా వెలుగొందారు. సౌందర్య, మీనా, రోజా, రమ్యకృష్ణ, రంభ వంటి స్టార్ హీరోయిన్లు దున్నేస్తున్న సమయంలో రాశి తనదైన ముద్ర వేశారు. ముఖంపై చెరగని చిరునవ్వుతో, బొద్దుగా, చూడగానే ఆకట్టుకునే రూపంతో ఒక తరం కుర్రాళ్లకి నిద్రలేని రాత్రులను మిగిల్చారు రాశి. తమకు కాబోయే భార్య రాశిలాగే ఉండాలని అప్పట్లో అబ్బాయిలు అనుకున్నారంటే అతిశయోక్తి కాదు.

బాలనటి నుంచి హీరోయిన్‌గా
బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాశి.. తొలుత రావు గారి ఇల్లు, బాల గోపాలుడు, చెట్టు కింద ప్లీడర్, ఆదిత్య 369 , పల్నాటి పౌరుషం తదితర సినిమాల్లో నటించారు. అయితే తమిళ చిత్ర పరిశ్రమ ఆమెకు హీరోయిన్‌గా తొలి అవకాశం ఇచ్చింది. తమిళంలో ప్రియం చిత్రం హీరోయిన్‌గా రాశి తొలి సినిమా. ఆ తర్వాతపెళ్లిపందిరి, గోకులంలో సీత, శుభాకాంక్షలు , పండుగ, డాడి డాడీ, స్వప్నలోకం, హరిశ్చంద్ర, కృష్ణబాబు, సముద్రం, ప్రేయసి రావె, పోస్ట్‌మన్, మూడు ముక్కలాట వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా అలరించారు. హీరోయిన్‌గానే స్పెషల్ సాంగ్స్‌తోనూ ఆకట్టుకున్నారు రాశి.
పెళ్లితో సినిమాలకు దూరం
అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే 2005లో శ్రీ ముని అనే దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె. భర్త, కుమార్తె, ఇంటి బాధ్యతల కారణంగా పెళ్లి తర్వాత సినీరంగానికి ఆమె దూరమయ్యారు. అయితే ఇటీవలే రాశి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సినిమాలతో పాటు బుల్లితెరపైనా అడుగుపెట్టి గిరిజ కళ్యాణం, జానకి కలగనలేదు తదితర సీరియల్స్‌లో నటించారు రాశి. ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈ సీనియర్ నటి.. తాజాగా ఓ ఛానెల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాశి .. వయసుకొచ్చినట్లు కనపడటానికి డ్రగ్స్, ఇంజెక్షన్ తీసుకున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. దీనికి ఆమె తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు.
నేను హీరోయిన్‌గా ఉన్నప్పటి నుంచి ఈ రూమర్ ప్రచారంలో ఉంది. మా ఫ్యామిలీకి అంత అవసరం కూడా లేదు. అమ్మకి నేనంటే ఎంతో ఇష్టం.. ఆమె దానిని బయటపెట్టకుండా చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. నాన్న ఎక్స్‌ప్రెసివ్.. నాకు ఏదైనా అయితే చచ్చిపోతారాయన. అంత ప్రేమ నేనంటే. నాకు ఇంజెక్షన్ కాదు కదా.. చిన్న ఈగ వాలి, అది కుట్టేస్తుందేమోనని భయపడతాడు. అలాంటిది ఆ మనిషి ఆ పనిచేస్తారంటే చాలా పాపం. పాపం మాటలు మాట్లాడకూడదు, దగ్గరుండి చూసి ఆ డ్రగ్ నువ్వే సప్లయ్ చేసి, ఇంజెక్షన్ చేస్తే నువ్వు మాట్లాడు. నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ఏం తెలుసని మాట్లాడుతున్నారు? అంటూ రాశి సీరియస్ అయ్యారు.
నేను పెళ్లి చేసుకుంటానని మమ్మీతో చెబితే.. ఎందుకని ఒక్క మాట కూడా అనలేదు. చేసేసుకో విజ్జి.. ఎవరైనా అబ్బాయిని చూడనా అని అన్నారు. ఆమెకు ఇప్పుడు కూడా నేను వర్క్ చేయడం ఇష్టం లేదు. ఎందుకమ్మా.. హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చుగా అనేవారు. నాకిప్పుడు ఇంట్లో ఉండే లైఫ్ చాలా ఇష్టం.. ఇంట్లోంచి బయటికి వెళ్లను. ఈ అపార్ట్‌మెంట్‌లో 120 ఫ్లాట్‌లు ఉన్నాయి.. ఒక్క ఫ్లాట్‌లోకి నేనింత వరకు తాంబూలం తీసుకోవడానికి వెళ్లలేదు. వెళ్లి కూర్చొని టైంపాస్ చేసింది లేదు.. నా కూతురు మాత్రం మొత్తం అంతా తిరుగుతుందని రాశి అన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











