‘ఆ డైరెక్టర్‌ నా జీవితం పాడు చేశాడు.. ఆడదాని ఉసురు తగిలితే’

90వ దశకంలో తన అంద చందాలు, నటనతో ప్రేక్షకులను అలరించారు హీరోయిన్ రాశి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అగ్రనటుల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా వెలుగొందారు. బొద్దుగా, ముద్దుగా ఉంటూ.. పెదవులపై చెరగని చిరునవ్వుతో కుర్రాళ్ల కలల రాకుమారిగా నిలిచారు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని అనూహ్యంగా వెండితెరకు దూరమయ్యారు. తాజాగా జబర్దస్త్ వర్ష నిర్వహిస్తోన్న కిస్సిక్ టాక్స్‌కు హాజరైన రాశి తన జీవితంలో ఎదురైన కష్టాలను పంచుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..

బాలనటి నుంచి హీరోయిన్‌గా
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాశి అసలు పేరు.. రవళి కానీ విజయలక్ష్మీగా వెండితెరకు పరిచయమయ్యారు. తొలుత బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. బాలనటిగా రావు గారి ఇల్లు, బాల గోపాలుడు, చెట్టు కింద ప్లీడర్, ఆదిత్య 369 , పల్నాటి పౌరుషం సినిమాల్లో నటించారు. తమిళంలో ప్రియం చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రాశి.. పెళ్లిపందిరి, గోకులంలో సీత, శుభాకాంక్షలు , పండుగ, డాడి డాడీ, స్వప్నలోకం, హరిశ్చంద్ర, కృష్ణబాబు, సముద్రం, ప్రేయసి రావె, పోస్ట్‌మన్, మూడు ముక్కలాట వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా అలరించారు. హీరోయిన్‌గానే కాకుండా సముద్రం, వీడే, వెంకీ సినిమాలలో ఐటెం సాంగ్స్‌తోనూ అలరించారు రాశి.

Actress Raasi made sensational comments on Tollywood director in a podcast hosted by Jabardasth Varsha

సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీ
అవకాశాలు తగ్గుతున్న దశలో 2005లో శ్రీ ముని అనే వ్యక్తిని పెళ్లాడి లైఫ్‌లో స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఓ పాప సంతానం. పెళ్లయిన దాదాపు పదేళ్ల తర్వాత పుట్టడంతో ఆమెను అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు రాశి. సినిమాలకు చాలాకాలం పాటు బ్రేక్ ఇచ్చిన రాశి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ అయిన ఆమె తల్లి ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సినిమాలతో పాటు బుల్లితెరపైనా అడుగుపెట్టి గిరిజ కళ్యాణం, జానకి కలగనలేదు తదితర సీరియల్స్‌లో నటించారు రాశి.

గోకులంలో సీత -2కు రెడీ
తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తోన్న కిస్సిక్ టాక్ షోకు గెస్ట్‌గా హాజరైన రాశి కీలక విషయాలు పంచుకున్నారు. తన భర్తను పెళ్లి చేసుకుందామని నేనే ప్రపోజ్ చేశా, మా ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. మా అన్నయ్య చాలా కోపిష్టి.. ప్రేమ విషయం తెలియగానే నన్ను నిలదీశాడు. నా పాపకు జన్మనివ్వడం నా జీవితంలో జరిగిన మేజిక్.. 2004లో నాకు పెళ్లయితే 10 ఏళ్ల తర్వాత నాకు పాప పుట్టిందని రాశి తెలిపారు. బాగా వెయిట్ పెరిగాను, చాలా రిస్కీ డెలివరీ అయ్యింది.. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే శ్రీకాంత్ వాళ్ల అబ్బాయి రోషన్‌ పక్కన మా అమ్మాయిని హీరోయిన్‌గా చేయించాలని ఉందని చెప్పారు రాశి. పవన్ కళ్యాణ్ గారు నా ఫేవరెట్ యాక్టర్.. గోకులంలో సీత 2 చేయాలనుకుంటున్నారా? నేనైతే రెడీ అని ఆయనకు చాలా సార్లు చెప్పా. చిరంజీవి గారితో ఒక్క సినిమా కూడా చేయలేకపోయాను. అయినా నా 21వ పుట్టినరోజుకు చిరంజీవి ఐ బ్యాంక్‌కు నా కళ్లు దానం చేశాను, నన్ను చూసి చాలామంది అమ్మాయిలు ఐ డోనేట్ చేశారని రాశి గుర్తుచేసుకున్నారు.

ఆ సినిమాతో నా జీవితం నాశనం
ఒక డైరెక్టర్ నన్ను మగరాయుడిలా ఉండాలని, లుక్ మార్చాలని, ట్రైనర్‌ని పెట్టి వెయిట్ లాస్ చేయించాడు. ఫస్ట్ డే షూటింగ్‌కి వెళ్లాను.. చేయకూడని సీన్ ఫస్ట్ డేనే పెట్టేశాడు. ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా ఎవరిని మరిచిపోతావంటే ఆ డైరెక్టర్ పేరు చెబుతాను. ఆ సినిమాలో నేను చేసిన సీన్స్‌తో ఆడియన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. నా కెరీర్‌కు ఆ సినిమా ఫుల్ స్టాప్ వేసేసింది, ఆ సినిమా తర్వాత మరే సినిమా నేను చేయలేదు. ఆడపిల్ల ఉసురు పోసుకోకూడదు.. మా ఇంట్లో వాళ్లు కూడా నా విషయంలో ఏదైనా అనే ముందు దాన్ని ఏడిపించొద్దు, దాని ఉసురు పోసుకోవద్దు అనే వాళ్లని రాశి ఆవేదన వ్యక్తం చేశారు. నా పుట్టినరోజు నాడే మా నాన్నగారు చనిపోయారు.. హీరోయిన్‌గా నన్ను స్క్రీన్ మీద చూసి సంతృప్తితో వెళ్లిపోయారని రాశి తన జీవితంలో చోటు చేసుకున్న ఘటనలను పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. రాశి కెరీర్ నాశనం చేసిన ఆ డైరెక్టర్ ఎవరంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: actress raasi jabardasth varsha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X