For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోయిన్ రాశి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ.. వందల కోట్ల ఆస్తులున్న వాళ్ళని కాదని పేదవాడితో పెళ్లి!

  |

  సీనియర్ హీరోయిన్ రాశి సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్దగా సినిమాలు చేయకపోయినప్పటికి ఇంకా ఆమె రేంజ్ మాత్రం కొంచెం కూడా తగ్గేలేదు. హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమయంలోనే ఆమె ఊహించని విధంగా పెళ్లి చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొన్నాళ్ళ పాటు సినిమాలకు, మీడియాకు దూరంగా ఉంటూ కుటుంబంతో హ్యాపీగా గడిపారు. అయితే ఆమె లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి అనుకోకుండా జరిగిందని రాశి తెలిపారు.

  తండ్రి కోరిక మేరకు..

  తండ్రి కోరిక మేరకు..

  1980లలోనే చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రాశి తండ్రి కోరిక మేరకు ఆ తరువాత హీరోయిన్ గా మారింది. తమిళ్ తెలుగు హిందీ అని తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేసింది. హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ పాత్రలతో కూడా మెప్పించింది. హీరోయిన్ గా ఒక ఎనిమిదేళ్ల వరకు బిజీగా ఉన్న రాశి కొన్నాళ్లకు సరికొత్త లుక్స్ తో ఊహించని షాక్ ఇచ్చింది.

  హైదరాబాద్ లోనే ఫ్యామిలీ..

  హైదరాబాద్ లోనే ఫ్యామిలీ..

  నిజం సినిమాలో ఆమె చేసిన బోల్డ్ రోల్ అప్పట్లో అందరిని షాక్ కి గురి చేసింది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తన భర్తతో కలిసి హైదరాబాద్ లోనే ఉంటోంది. వారికి ఒక పాప కూడా ఉంది. అయితే తన లవ్ స్టోరీ అనుకోకుండా మొదలైందని రాశి ఒక ఇంటర్వ్యూలో వివరించింది.

  వరకట్నం ఇచ్చేవాళ్లను కాదని..

  వరకట్నం ఇచ్చేవాళ్లను కాదని..

  రాశి వివరణ ఇస్తూ.. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో కెరీర్ కి ఎండ్ కార్డ్ పెట్టాలని నిర్ణయాన్ని తీసుకొని ఇంట్లో వాళ్ళను పెళ్లి సంబంధాలు చూడమని చెప్పిందట. అలా చెప్పన కొన్ని రోజులకే ఎదురుకట్నం ఇచ్చి మరి చేసుకునేందుకు వందల కోట్ల ఆస్తులున్న ధనవంతులు ముందుకు వచ్చారు. కానీ వారు ఎందుకో కరెక్ట్ కాదని అనుకున్న రాశి ఒక సాధారణ యువకుడిని పెళ్లి చేసుకుంది.

  సహాయ దర్శకుడిని చూసి..

  సహాయ దర్శకుడిని చూసి..

  అతను ఎవరో కాదు. పలు సినిమాలకు రాశితో పాటు సహాయక దర్శకుడిగా పని చేసిన శ్రీ ముని(SS.నివాస్). ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ ఎండ్ అయ్యే సమయంలో ఎవరో ఒకరిని ఆటపట్టించడం తనకు అలవాటాని చెప్పిన రాశి నివాస్ ని ఒక సారి ఆటపట్టించిందట. తన గురించి నేను ఒక స్పెషల్ విషయాన్ని చెప్పానని చెప్పు అని అసిస్టెంట్ ద్వారా నివాస్ కి తెలియజేసిందట రాశి.

  సరదాగా మొదలైన పరిచయం..

  సరదాగా మొదలైన పరిచయం..

  దీంతో నివాస్ కన్ఫ్యూజన్ కి గురయ్యి ఆ రెండు రోజులు ఏం చెప్పారని రాశి వెంటపడుతూ అడిగాడట. తరువాత చెబుతానని రాశి అతని ఫోన్ నెంబర్ తీసుకుంది. ఇక ఆ తరువాత ఫోన్ చేసి ఏమి లేదని సరదాగా అన్నానని నిరుత్సాహ పరిచిందట. ఆ చిన్న సరదా సీన్ ద్వారా ఇద్దరం స్నేహితులుగా మారినట్లు రాశి చెప్పింది.

  Vijay Devarakonda And Rashi Khanna Longest Kiss Ever In Tollywood || Filmibeat Telugu
   రాశి ప్రపోజల్..

  రాశి ప్రపోజల్..

  అప్పటికే పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో తన తండ్రి మరణం తనను తీవ్రంగా కలచివేసినట్లు చెప్పిన రాశి తన బాధను ఎక్కువగా నివాస్ తో షేర్ చేసుకుందట. కొన్నిరోజుల తరువాత ఎందుకో ఒక రోజు సడన్ గా బాధతో ఉండగా నివాస్ ని పెళ్లి చేసుకుంటావా అని అడిగేసిందట రాశి. కానీ అతను రెండు రోజులు కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడని తెలిపిన రాశి.. ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు వివరణ ఇచ్చింది.

  English summary
  Raasi, Nijam (2003) movie charecter was a sensation in that time. Earlier, Raasii, who looked like a girl next door, looked bold in the role. There were comments about why the hot-ness dose increased the appearance of the character, which was a shock to everyone.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X