బలవంతంగా అబార్షన్‌.. బాంబు పేల్చిన రకుల్ ప్రీత్ సింగ్

ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమను తన అంద చందాలతో ఏలారు రకుల్ ప్రీత్ సింగ్. సీనియర్లు, జూనియర్లు ఇలా ఏ హీరోకైనా ఆమె హీరోయిన్‌గా కావాలి. అలా కొన్నేళ్ల పాటు తిరుగులేని నటిగా సౌత్ ఇండస్ట్రీని ఒక ఊపింది రకుల్ ప్రీత్ సింగ్. కానీ తర్వాత వరుస ఫ్లాపులతో టాలీవుడ్‌కు దూరమై ఇప్పుడు ఫేడ్ అవుట్ దశకు చేరుకున్నారు. తెలుగు సినిమాలకు దూరంగా ముంబైలో ఉంటున్న రకుల్.. తాజాగా ప్రెగ్నెన్సీ, అబార్షన్‌లపై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి. ఈ వివరాల్లోకి వెళితే..

మిలటరీ బ్యాక్‌గ్రౌండ్
ఢిల్లీలో మిలటరీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చారు రకుల్ ప్రీత్ సింగ్. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు 18 ఏళ్ల వయసులో పాకెట్ మనీ కోసం రకుల్ ప్రీత్ సింగ్ మోడలింగ్ చేశారు. తర్వాత సినిమా రంగానే తన వృత్తిగా చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. 2009లో కన్నడంలో గిల్లి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురులో తొలుత హీరోయిన్‌గా రకుల్ ప్రీత్‌నే అనుకున్నారు. కొన్ని కారణాలతో ఆమె ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేయడంతో హన్సిక మోత్వానీకి హీరోయిన్‌గా అదృష్టం వరించింది.

Actress Rakul Preet Singh Make sensational comments on Forced Abortion

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా
రెండేళ్ల తర్వాత 2011లో కెరటం అనే చిత్రంతో తెలుగువారిని పలకరించారు రకుల్ ప్రీత్ సింగ్. సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో రకుల్‌కు తొలి బ్రేక్ దక్కింది . ఆ తర్వాత టాలీవుడ్‌లో ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు అగ్రనటులతో నటించే అవకాశం దక్కించుకున్నారు. టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్‌లలో బిజీ అయ్యింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానితో ప్రేమలో పడ్డ రకుల్ ప్రీత్ సింగ్ ఆయనతో కొన్నేళ్లు డేటింగ్ చేసి తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ సరసన ఇండియన్ 3లో, దే దే ప్యార్ దే 2లో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.

అబార్షన్ సింపుల్ కాదు
పెళ్లయి రెండేళ్లు కావొస్తున్నా, ఇప్పటి వరకు గుడ్‌న్యూస్ చెప్పకపోవడంతో రకుల్ అభిమానులు, కుటుంబ సభ్యులు శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెలబ్రిటీలు ఒకరి తర్వాత మరొకరు గర్భం దాలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రెగ్నెన్సీపై రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్షన్ చేయించుకోమని మహిళలకి చాలామంది సింపుల్‌గా సలహాలు ఇచ్చేస్తారని, కానీ దాని వెనుక కష్టాన్ని ఎవరూ అర్ధం చేసుకోరని రకుల్ ఆవేదన వ్యక్తం చేశారు.

భర్తలే అండగా నిలబడాలి
స్కిన్‌ని పిల్ చేస్తేనే ఆ పెయిన్ తట్టుకోలేం.. అలాంటి ఓ ప్రాణాన్ని మహిళ శరీరం నుంచి తొలగించడం అంటే ఎంతో కష్టమన్నారు రకుల్. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా కలిగే బాధ గురించి ఎవ్వరూ మాట్లాడరని.. నిజానికి వైద్య శాస్త్రం చెబుతున్న దానిని బట్టి ఒక మహిళ శరీరరం రెండు అబార్షన్‌లను మాత్రమే తట్టుకోగలదని, కానీ ప్రతి ఐదుగురిలో ఇద్దరు మహిళలు మూడు నుంచి ఐదు అబార్షన్లను భరించాల్సి వస్తోందని రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భర్తలే భార్యలకు అండగా నిలబడాలని.. అలాగే అబార్షన్ల గురించి ధైర్యంగా మాట్లాడటానికి ముందుకు రావాలని ఈ హీరోయిన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: rakul preet singh movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X