Don't Miss!
- News
Reactor Blast: అచ్యుతాపురంలో పేలిన రియాక్టర్.. ఒకరు మృతి..
- Lifestyle
హైబ్లడ్ ప్రెజర్ ను తక్కువగా అంచానా వేయకండి..ఇది ఎలా ప్రాణం తీస్తుందో తెలుసా?
- Finance
Economic Survey: పెరిగిన భారత ఎగుమతులు.. బొమ్మల నుంచి ఆయుధాల వరకు: ద్రౌపదీ ముర్ము
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Sports
INDvsAUS : ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న కోహ్లీ.. ఆసీస్ సిరీస్ ముందు కూడా!
- Automobiles
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
సూచీ లీక్స్ అంటూ నా వీడియో రిలీజ్ చేశారు.. అది మా చెల్లి కంట పడడంతో.. హీరోయిన్ ఆవేదన
కొన్నేళ్ల క్రితం సూచి లీక్స్ అంటూ కొంతమంది సినీ తారల ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా పలు వెబ్ సైట్స్ లలో కూడా తమిళ స్టార్స్ కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు కూడా లీక్ అయ్యాయి. అయితే గత రెండేళ్ల క్రితం వరకు కూడా సూచి లీక్స్ కు సంబంధించిన ఏ విషయం కూడా బయటికి రాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మరొక తమిళ్ హీరోయిన్ ఆ పేరును ప్రస్తావనలోకి తీసుకువచ్చింది. తన వీడియోలు కూడా వైరల్ అయ్యాయని.. ఒక వీడియో అయితే తన సోదరీ కంట పడింది అని చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

రేష్మ పసుపులేటి
ఇటీవల కాలంలో తమిళ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేర్లలో రేష్మ పసుపులేటి ఒకరు. ఈ బ్యూటీ మొదట టెలివిజన్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకొని ఆ తర్వాత బిగ్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చింది. వారి ఫ్యామిలీలో చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. దీంతో ఆమె చాలా తొందరగానే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ రేష్మ మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకుంటుంది.

రేష్మ వీడియోలు వైరల్
టెలివిజన్ యాంకర్ నుంచి ఇప్పుడు సినిమా హీరోయిన్ గా కొనసాగుతున్న రేష్మ పసుపులేటి కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ లో కూడా నటించింది. అయితే ఏ పాత్ర చేసిన కూడా సినిమాలో చాలా కీలకంగా ఉండే విధంగా మాత్రం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఇటీవల కాలంలో రేష్మ ప్రైవేట్ వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి అని వార్తలు కూడా వైరల్ అయ్యాయి.

సోదరి కంట పడిందట
ముఖ్యంగా కొన్ని అశ్లీల వెబ్ సైట్స్ లలో కూడా రేష్మ పసుపులేటి హాట్ వీడియో వైరల్ అవ్వడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే అది కాస్త రేష్మ పసుపులేటి దగ్గరకు కూడా వెళ్ళింది. ఆమె సొంత సోదరి రేష్మ కు ఫోన్ చేసి తనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో అలాగే ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యిందట.

సుచిలిక్స్ అంటూ
రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రేష్మ పసుపులేటి తనకు సంబంధించిన వీడియో పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. సుచిలిక్స్ అంటూ రేష్మ పసుపులేటి పేరుతో ఒక వీడియోను కొన్ని వెబ్ సైట్స్ లలో వైరల్ అయ్యేలా చేశారు. ఒక విధంగా ఆ వీడియో చూసి నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. అది కూడా నా కుటుంబ సభ్యులకు తెలియడంతో మొదట్లో అయితే చాలా కంగారుపడ్డాను.. అని చెప్పింది.

ఫ్యామిలీ అర్థం చేసుకుంది
నిజానికి అది నా వీడియో కాదు. అసలు నాకు బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. కావాలని ఎవరో సూచి లీక్స్ పేరుతో వీడియోను మార్నింగ్ చేసి ఇంటర్నెట్లో వదిలారు. అసలు ఆ వీడియోకు నాకు ఏ సంబంధం లేదు. నా కుటుంబ సభ్యులు మాత్రం నన్ను ఎంతగానో అర్థం చేసుకున్నారు. మొదట్లో నేను కంగారుపడినప్పటికీ వారు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవారు కావడంతో వెంటనే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు.. అని రేష్మ పసుపులేటి వివరణ ఇచ్చింది.