twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sai Pallavi: మొదటిసారి వివాదంపై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి.. తప్పుగా వక్రీకరించారు అంటూ..

    |

    టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపించిన హింస, గోరక్షక దళాలు చేస్తోన్న దాడుల మధ్య తేడా ఏముందని మానవత్వం అనేదాని గురించి ఆలోచించాలి అని ఆమె వివరణ ఇవ్వడంతో ఓ వర్గం వారి నుంచి తీవ్రంగా అభ్యంతరాలకు గురిచేసింది. ఈ విషయంలో భజరంగ్ దళ్ మరికొన్ని హిందూ సంఘాలు నాయకులు కూడా సాయి పల్లవి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మొన్నటి వరకు ఈ విషయంపై కొంత మౌనంగానే ఉన్న సాయి పల్లవి మొత్తానికి సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

    ఎప్పుడు లేని విధంగా..

    ఎప్పుడు లేని విధంగా..

    సౌత్ ఇండస్ట్రీలో మంచి టాలెంటెడ్ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సాయి పల్లవి ఎప్పుడూ కూడా వివాదాల్లోకి వెళ్ళింది లేదు. సైలెంట్ గా తన సినిమాలు తను చేసుకుంటూ వెళ్లిన ఆమె ఇటీవల విరాటపర్వం సినిమా ప్రమోషన్ లో భాగంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రెండు వర్గాల మధ్య జరిగిన దాడులు పై స్పందించిన సాయి పల్లవి మానవత్వం గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు.

    సాయి పల్లవికి కౌంటర్

    సాయి పల్లవికి కౌంటర్

    కాశ్మీర్ ఫైల్స్ లో చూపిన దాడులు అలాగే జై శ్రీరామ్ అంటూ కొందరు చేసిన దాడుల మధ్యలో రెండు వర్గాల మధ్య తేడా ఏముంది అని సాయిపల్లవి ఒక అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే పండిట్లను చంపిన ఉగ్రవాదులతో గోవులను కాపాడిన రక్షకులను పోల్చడం సరికాదని ఈ విషయంలో పూర్తి అవగాహనతో మాట్లాడాలని కూడా పలువురు ప్రముఖులు సాయి పల్లవికి కౌంటర్ కూడా ఇచ్చారు.

    ఆ వ్యాఖ్యలు వక్రీకరించారు

    ఆ వ్యాఖ్యలు వక్రీకరించారు

    ఇక ఫైనల్ గా సాయి పల్లవి మొదటిసారి ఈ వివాదంపై తన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముందుగా నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలపై మాట్లాడడం జరిగింది. లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అనే అభిప్రాయాలు కూడా చాలా వివరంగా తెలియజేశాను. అయితే నేను ఆ ఇంటర్వ్యూ మొత్తం చెప్పిన దాన్ని పట్టించుకోకుండా కేవలం ఆ వ్యాఖ్యలను మాత్రమే వక్రీకరించి ప్రచారం చేశారు. అందువల్ల కొంత మంది మనోభావాలు దెబ్బతిన్నాయి.

    ప్రాణాలు తీసే హక్కు లేదు

    ప్రాణాలు తీసే హక్కు లేదు

    నన్ను ఈ బాధ నుంచి తప్పించడానికి నన్ను ఆదరించే వారు చాలావరకు ప్రయత్నాలు చేశారు అని నాకు అర్థం అయింది. అయితే ఈ విషయంపై నేను డాక్టర్ గా ఒకటే కోరుకుంటాను. ఒక మనిషిని చంపే హక్కు ఎవరికీ లేదు. మతం ఏదైనా సరే హింసను కోరుకోదు. ప్రపంచంలో ఏ మనిషి జీవితాన్ని కూడా మరొకరు ముగించే హక్కు లేదు. ఆ విధంగా మాత్రమే నేను ఆలోచించాను. కాని దీన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకొని ప్రచారాలు చేశారు.

    నొప్పించాలని అనుకోలేదు

    నొప్పించాలని అనుకోలేదు

    చిన్నప్పుడు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అనే ప్రార్థన చేస్తూ పెరిగాను కాబట్టి నేను ఇప్పటికి కూడా అదే మనస్తత్వంతో పెరిగాను తోటి వారిని ఎప్పుడూ నొప్పించకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తాను. అలాంటిది ఈ విషయంలో నేను ఎవరిని కూడా కావాలనే ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. ఈ క్లిష్ట సమయంలో నాకు చాలామంది తోడుగా నిలిచారు. అలాగే దీని వలన ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని కూడా ఆమె తెలియజేశారు. మరి ఈ వివాదం ఇక్కడితో ముగిస్తూ ఉందో లేదో చూడాలి.

    English summary
    Actress Sai pallavi first reaction on controversial comments
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X