Don't Miss!
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Finance
Sebi: 19 సంస్థలకు షాక్ ఇచ్చిన సెబీ.. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం..
- News
ఈటల రాజేందర్ విషయంలో బీజేపీలో ఏం జరుగుతుంది.. పార్టీలో ఆయనకెందుకీ ఉక్కపోత!!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
ఎన్టీఆర్ హీరోయిన్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా.. చిన్నపిల్లకే ఎక్కువ ఎఫెక్ట్ జాగ్రత్త అంటూ ఎమోషనల్ పోస్ట్
దేశంలో కరోనా కేసులు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండడం ఆరోగ్య శాఖ అధికారులతో పాటు సామాన్య ప్రజలను కూడా టెన్షన్ పెడుతోంది. సుమారు వారం రోజుల నుంచి రోజూ రెండు లక్షల పైచిలుకు కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ఈ రోజు కూడా రెండు లక్షల 73 వేల 810 కేసులు నమోదయ్యాయి. కేసుతో పాటు కరోనా మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. గడిచిన పది ఇరవై నాలుగు గంటల్లో 1619 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయిన విషయం మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఫ్యామిలీ మొత్తానికి కరోనా
కరోనా
ప్రభావం
ఎక్కువగా
మహారాష్ట్ర
అందులో
ముంబై
ప్రాంతంలో
కనిపిస్తోంది.
దాదాపు
బాలీవుడ్
నటీనటులు
అందరూ
అక్కడే
సెటిల్
అయిన
కారణంగా
తరచూ
ఎవరో
ఒకరు
కరోనా
బారిన
పడుతూనే
ఉన్నారు.
ఒకరిద్దరు
లెజెండ్రీ
నటులు
కరోనా
కారణంగా
ప్రాణాలు
కూడా
కోల్పోవాల్సిన
పరిస్థితి
ఏర్పడింది.
అయితే
ఎన్టీఆర్
తో
ఒకప్పుడు
వరుస
సినిమాలు
చేసిన
నటి
సమీరా
రెడ్డి
కుటుంబం
మొత్తం
కరోనా
బారిన
పడినట్లు
సమాచారం.
ఆమె
అత్త
మినహా
సమీరా
రెడ్డి,
సమీరా
రెడ్డి
భర్త,
సమీరా
రెడ్డి
ఇద్దరు
పిల్లలకు
కరోనా
సోకినట్లు
సమాచారం.

నాలుగు రోజులు లైట్ తీసుకున్నా...
ఈ విషయాన్ని సమీరారెడ్డి స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా పంచుకుంది. చాలా మంది తన గురించి తన పిల్లల గురించి అడుగుతున్నారు అని అందుకే ఈ విషయం వెల్లడిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. కొద్ది రోజుల క్రితం హాన్స్ (ఆమె కొడుకు)కి ఫీవర్ వచ్చింది అని, తలనొప్పి , ఒళ్లు నొప్పులు కడుపులో ఇబ్బంది ఇలాంటి సమస్యలు రావడంతో ముందు మామూలుగా వచ్చినవి అని భావించినా నాలుగు రోజుల పాటు అవి కంటిన్యూ కావడంతో కరోనా టెస్ట్ చేయించామని చెప్పుకొచ్చింది. దీంతో హాన్స్ కు కరోనా పాజిటివ్ అని తేలిందని, అయితే ముందు చాలా టెన్షన్ పడినా సరే నెమ్మదిగా ధైర్యం తెచ్చుకున్నామని సమీరారెడ్డి చెప్పుకొచ్చింది. అన్నకు కరోనా సోకాక చెల్లెలికి కూడా ఈ లక్షణాలు కనిపించడంతో మామూలు జ్వరానికి జలుబు వాడే మందులు ఆమెకు వాడానని ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పుకొచ్చింది.

జాగ్రత్త..పిల్లలకే ఎఫెక్ట్
అయితే కరోనా సెకండ్ వేవ్ గురించి చాలా అప్రమత్తంగా ఉండాలని ఎందుకంటే ఇందులో పిల్లలకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతోందని ఆమె చెప్పుకొచ్చింది. కానీ డాక్టర్లు ఈ సెకండ్ వేవ్ లో మైల్డ్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయని నమ్ముతున్నారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఎక్కువగా విటమిన్ సి మల్టీవిటమిన్ తీసుకోమని డాక్టర్లు సూచిస్తున్నారు అని చెప్పుకొచ్చింది. వారిద్దరికీ కావాల్సిన అన్ని సమకూర్చడంతో వారు త్వరగా కోలుకున్నారని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే పిల్లలకు లక్షణాలు తగ్గి పోయిన సరే 14 రోజుల పాటు కాస్త దూరంగా ఉంచాలని అలా చేస్తేనే మరొకరికి సోకకుండా ఉంటుందని చెప్పుకొచ్చింది.
Recommended Video

అదృష్టం కొద్దీ ఆమెకు సోకలేదు
అదృష్టం కొద్దీ తన అత్తగారికి కరోనా సోకలేదని ఆమెకు ఒక్కరికే నెగిటివ్ వచ్చింది అని చెప్పుకొచ్చింది. తనకు తన భర్తకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని పిల్లల నుంచి తమకు సోకినట్లు భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ సమయంలో మెడిటేషన్, ఆవిరి పీల్చడం, సాల్ట్ వాటర్ తో పుక్కిలించడం, ఊపిరి తీసుకునే వ్యాయామం చేయడం, ప్రాణాయామం చేయడం, కడుపునిండా కావలసిన భోజనం చేయడం లాంటి కొన్ని పద్ధతులు ఫాలో కావడంతో ప్రస్తుతానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది. కరోనా వస్తే నెగిటివ్గా ఫీల్ అవ్వద్దు అని అసలు భయపడొద్దు అని మీ నుంచి మరొకరికి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది.