Don't Miss!
- Finance
Google: ఉద్యోగుల తొలగింపు తర్వాత గూగుల్ మరో అడుగు.. ఏంటిది సుందర్ పిచాయ్..!
- Sports
Team India : సూర్యకుమార్‌పై మరీ ఎక్కువగా ఆధార పడుతున్న టీమిండియా..!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Shraddha Kapoor: సోషల్ మీడియాలో సాహో బ్యూటీ జెట్ స్పీడ్ రికార్డ్.. క్రేజ్ మామూలుగా లేదు
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా కూడా అందులో ఒక్కొక్కరు ఒక్కో విధమైన క్రేజ్ తో ముందుకు సాగుతున్నారు. ఇక అందరికంటే భిన్నమైన క్రేజ్ సంపాదించుకుంటున్న వారిలో శ్రద్ధా కపూర్ టాప్ లిస్టులో ఉంటుంది అనే చెప్పాలి. ఆమె వారసత్వం నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టినప్పటికీ కూడా మంచి టాలెంట్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది.
ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. శ్రద్ధ కపూర్ కు సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సాహో సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత బ్యూటీకి ఆఫర్ల సంఖ్య ఇంకా ఎక్కువగానే పెరిగింది.

ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో శ్రద్ధా కపూర్ పోస్ట్ చేసే ఫోటోలు కూడా నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఒక విధంగానే తన టాలెంట్ తోనే ఫాలోవర్స్ సంఖ్యను ఎక్కువగా పెంచుకుంటుంది. ఇక అప్పుడప్పుడు గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేయగానే నిమిషాల్లోనే ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోతూ ఉంటాయి. ఇక రీసెంట్ గా శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
ఇటీవల కాలంలో అత్యధికంగా ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాను హీరోయిన్ గా క్రేజ్ అందుకుంది. ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఇప్పుడు 75 మిలియన్స్ వరకు చేరింది. ఇన్స్టాగ్రామ్ లో ప్రస్తుతం విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఇక ఆ తర్వాత సెలబ్రిటీలలో శ్రద్ధా కపూర్ కూడా అత్యధిక వేగంగా ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం విశేషం. ఇక ప్రస్తుతం శ్రద్ధ కపూర్ రణ్ వీర్ సింగ్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లవ్ రంజన్ అనే ఆ సినిమా వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకులు ముందుకు రానున్నది.