For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లికి ముందే నాపై కోపం, వాళ్లింట్లో గొడవ, ఒప్పుకోలేదు: పర్సనల్ లైఫ్ విషయాలపై స్నేహ

  |

  'వినయ విధేయ రామ' సినిమాలో రామ్ చరణ్ వదిన పాత్రలో నటించిన స్నేహను ప్రముఖ కమెడియన్ అలీ తాను హోస్ట్ చేస్తున్న 'అలీతో సరదాగా' షోకు ఆహ్వానించి ముచ్చటించారు. ఈ సందర్భంగా అలీ తనదైన శైలిలో స్నేహ నుంచి ఆసక్తికర విషయాలు రాబట్టారు.

  ఈ సందర్భంగా ఆమె తన ప్రొఫెషనల్ లైఫ్ విషయాలతో పాటు... పర్సనల్ లైఫ్ విషయాలు కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తన భర్త ప్రసన్నతో ప్రేమయాణం, పెళ్లి, పెళ్లికి ముందు జరిగిన కొన్ని సంఘటనల గురించి వెల్లడించారు.

  అసలు పేరు సుహాసిని రాజా రామ్ నాయుడు

  అసలు పేరు సుహాసిని రాజా రామ్ నాయుడు

  తన అసలు పేరు సుహాసిని రాజా రామ్ నాయుడు. సినిమాల్లోకి వచ్చే ముందు పేరు మార్చుకున్నాను. ముంబైలో పుట్టాను... దుబాయ్‌లో కొంతకాలం ఉన్నాం. తర్వాత చెన్నై షిప్టయ్యాం. అయితే తమ పూర్వీకులు ఎక్కడి వారో తనకు తెలియదు అని స్నేహ తెలిపారు.

  9వ క్లాసులోనే ఫస్ట్ లవ్ లెటర్

  9వ క్లాసులోనే ఫస్ట్ లవ్ లెటర్

  దుబాయ్‌లో 9వ తరగతి చదువుతున్నపుడు 4వ తరగతి అబ్బాయి నాకు లవ్ లెటర్ ఇచ్చాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, లవ్ చేస్తున్నాను అని అందులో రాసి ఉంది. నీ వయసేంటి నా వయసేంటి అంటే... నీకు ఓకే అయితే నాకు ఓకే' అని ముద్దుగా చెప్పాడు. లవ్ అంటే ఏమిటో తెలియని వయసులో అది వెరీ క్యూటీ, ఇన్నోసెంట్ లెటర్ అని స్నేహ గుర్తు చేసుకున్నారు.

  ఇంటర్మీడియట్‌లోనే సినిమాల్లోకి...

  ఇంటర్మీడియట్‌లోనే సినిమాల్లోకి...

  ఇంటర్ పూర్తయ్యాక సినిమాల్లోకి వచ్చాను. హీరోయిన్ అంటే ఓ రేంజిలో జీవితం ఉంటుందని అనుకుని వచ్చాను. కానీ ఇక్కడకు వచ్చాక అది ఎంత కష్టంగా ఉంటుందో అర్థమైంది. తొలి సినిమా సమయంలోనే ఏడ్చేసి మళ్లీ దుబాయ్ వెళ్లిపోతాను అని అమ్మానాన్నతో చెప్పాను. వారు సర్దిచెప్పడంతో కంటిన్యూ అయ్యాను అని స్నేహ తెలిపారు.

  ప్రసన్న వాళ్ల ఇంట్లో పెళ్లి ఇష్టం లేదు

  ప్రసన్న వాళ్ల ఇంట్లో పెళ్లి ఇష్టం లేదు

  పెళ్లికి మా ఇంట్లో 200 శాతం ఓకే... కానీ ప్రసన్న వాళ్ల ఇంట్లో ఇష్టం లేదు. దాదాపు సంవత్సరం గొడవ పడ్డ తర్వాత ఒప్పుకున్నారు. కానీ పెళ్లి తర్వాత మా మామగారు చాలా రియలైజ్ అయ్యారు. నీలాంటి మంచి అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు అంటూ ప్రశంసించారు అని స్నేహ తెలిపారు.

  పెళ్లికి ముందే కోపం, ఆయనే ప్రపోజ్ చేశారు

  పెళ్లికి ముందే కోపం, ఆయనే ప్రపోజ్ చేశారు

  పెళ్లికి ముందు, మా మధ్య ప్రేమ మొదలవ్వడానికి ముందు పసన్నకు నాపై కోపం ఉండేది. నేను చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో ఆయన చేశారు. అప్పుడు ప్రసన్న అయితే నేను ఆ సినిమా చేయను అని చెప్పానట, అది నాకు కూడా గుర్తు లేదు. అప్పటి నుంచి నాపై కోపం పెంచుకున్నారు. తర్వాత ఇద్దరం మరో సినిమా చేసినపుడు కూడా నాతో మాట్లాడలేదు. అయితే నా గురించి పూర్తిగా తెలుసుకున్నాక రియలైజ్ అయ్యారు. ఆయనే ముందు ప్రపోజ్ చేశారు అని స్నేహ తెలిపారు.

  హనీమూన్లో నా కోసం...

  హనీమూన్లో నా కోసం...

  పెళ్లి తరువాత హనీ మూన్ వెళ్లాం. ప్రసన్నకి బంగీ జంప్ ఇష్టం. నాకేమో భయం... నాతో పట్టుబట్టి జంప్ చేయించారు. అయితే అందుకు నేను టాటూ వేయించుకోవాలని కండీషన్ పెట్టడంతో వెంటనే వేయించుకున్నారు. భయపడుతూనే బంగీ జంప్ చేశాను. జంప్ చేస్తూ నాకు ఆయన ఐ లవ్ యూ చెప్పడం ఎప్పటికీ గుర్తుండి పోతుందని స్నేహ తెలిపారు.

  వాళ్ల మాట వినకుండా వెళ్లితే యాక్సిడెంట్

  వాళ్ల మాట వినకుండా వెళ్లితే యాక్సిడెంట్

  ఓ సినిమా షూటింగ్ కోసం రాత్రి పూట తిరుపతి వెళ్లాల్సి వచ్చింది. ఇంట్లో నాన్న, అన్నయ్య ఈ సమయంలో వద్దని చెప్పినా వినలేదు. కొంతదూరం వెళ్లిన తరువాత కారు ప్రమాదానికి గురైంది. దీంతో 6 నెలలు పాటు నడవలేని పరిస్థితి ఏర్పడింది. దేవుడి దయ వల్ల 2 నెలల్లో కోలుకున్నాను అని స్నేహ తెలిపారు.

  English summary
  Actress Sneha revealed her personal life details in Alitho Saradaga show. Suhasini Rajaram Naidu, popularly known by her stage name, Sneha, is an Indian film actress, who works in the South Indian film industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X