యాడ్ కోసం 150 కోట్లు... శ్రీలీలకు కళ్లు చెదిరే ఆఫర్, టాప్ స్టార్స్‌ని వెనక్కినెట్టి!

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే టక్కున వినిపించే పేరు శ్రీలీల. తన అందం, యాక్టింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్‌తో వరుస ఆఫర్స్ సొంతం చేసుకుంటున్నారు శ్రీలీల. సీనియర్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరి ఛాయిస్ శ్రీలీలే. టాలీవుడ్‌కు దూరంగా బాలీవుడ్‌లో సెటిలవ్వాలని గట్టిగా ట్రై చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలతో పాటు యాడ్స్, బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తోనూ దుమ్మురేపుతున్నారు. తాజాగా ఓ క్రేజీ యాడ్‌లో నటించేందుకు ఆమెకు అవకాశం దక్కింది.

తెలుగులో మాస్ మహారాజా రవితేజ సరసన మాస్ జాతర సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఇది కాకుండా తమిళంలో పరాశక్తి, హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన ఆషీకి 3లో, పవర్‌స్టర్ పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు. ఇవి కాకుండా మరిన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

Agent Ching Attack Ranveer Singh and Sreeleela s 150 crore ad directed by Atlee

బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీలీల
సినిమా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటూ ఉండటంతో మిగిలిన హీరోయిన్లు ఈమెను చూసి కుళ్లుకుంటున్నారు. ఇక బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తోనూ ఈ ముద్దుగుమ్మ భారీగా సంపాదిస్తోంది. ఇప్పటికే న్యూడ్ స్కిన్ కేర్, అమృత గ్రూప్, ప్రెస్టా వుమెన్స్ వేర్, నీరూస్ తదితర బ్రాండ్స్‌కు శ్రీలీల అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా శ్రీలీల అండార్స్‌మెంట్స్ కెరీర్‌లోనే మైల్ స్టోన్ అనదగ్గ ఆఫర్ వచ్చింది.

యాడ్స్ కోసం భారీగా రెమ్యునరేషన్
సాధారణంగా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సెలబ్రిటీల చేత బ్రాండింగ్ చేయిస్తూ ఉంటాయి. ఇందుకోసం భారీగా రెమ్యునరేషన్ సైతం ఆఫర్ చేస్తాయి. ఈ వాణిజ్య ప్రకటనల బడ్జెట్ కూడా 10 నుంచి 20 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో స్టార్స్ రెమ్యునరేషన్, మేకింగ్ కోసం కేటాయిస్తారు. ఒక నిమిం కష్టపడితే కోట్లకు కోట్లు వచ్చిపడుతుండటంతో సెలబ్రిటీలు యాడ్స్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. హీరోల రేంజ్, కంపెనీల స్థాయిని బట్టి కూడా వాణిజ్య ప్రకటనల బడ్జెట్‌లు మారిపోతుంటాయి.

150 కోట్లతో యాడ్
తాజాగా శ్రీలీల నటించిన యాడ్ కోసం ఏకంగా 150 కోట్ల రూపాయలు కేటాయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. చింగ్స్ దేశీ చైనీస్ అనే కంపెనీ ఈ యాడ్ కోసం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్‌లను సంప్రదించింది. దీనిని డైరెక్ట్ చేయడానికి కోలీవుడ్ దర్శకుడు అట్లీని రంగంలోకి దించారు. తాజాగా విడుదల చేసిన యాడ్ ప్రోమోలో రణవీర్ సింగ్ .. ఏజెంట్ చింగ్‌గా, శ్రీలీల ఏజెంట్ మిర్చిగా, బాబీ డియోల్ ... వైట్ నాయిస్ రోల్‌లో కనిపించారు. అక్టోబర్ 19న పూర్తి యాడ్‌ను రిలీజ్ చేయనున్నారు.

సినిమాలను మించి పోయేలా యాడ్ బడ్జెట్
ఇక ఈ యాడ్‌ని చూస్తే.. అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ మూవీని పోలీ ఉంది. 150 కోట్ల బడ్జెట్‌తో ఇప్పటి వరకు భారత్‌లో తెరకెక్కిన అతిపెద్ద వాణిజ్య ప్రకటనలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు.. బాలీవుడ్‌లో ఇటవల తెరకెక్కిన సినిమాల కంటే దీని బడ్జెట్ ఎక్కువ కావడం విశేషం. ఛావా చిత్రం 130 కోట్ల రూపాయలు, రైడ్ 2కి 120 కోట్ల రూపాయలు, స్త్రీ 2కి 60 కోట్ల రూపాయలు, సైయారాకి 45 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అయ్యింది. ఇక రణవీర్ సింగ్ గతంలోనే ఈ చింగ్ చైనీస్ కంపెనీ కోసం పలు వాణిజ్య ప్రకటనలలో నటించారు. వాటిలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో తమన్నా భాటియాతో కలిసి ఇన్‌స్టంట్ నూడిల్స్ ప్రకటనలో కనిపించారు. అయితే తాజా వాణిజ్య ప్రకటనలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ భారీగా ఉండే అవకాశం ఉంది. అది ఎంత అనేది మాత్రం తెలియరాలేదు.

More from Filmibeat

Read more about: ranveer singh sreeleela atlee
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X