For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, నేను కూడా ఇబ్బంది పడ్డా.. క్యాస్టింగ్ కౌచ్‌పై అనసూయ

  |

  రంగుల ప్రపంచంలో క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పటివరకు ఎంతో మంది సినీ తారలు వారికి ఎదురైన చేదు అనుభవాల గురించి బయటపెట్టిన విషయం తెలిసిందే. కొందరు డైరెక్ట్ గా కమిట్మెంట్ అడిగిన వారి పేర్లు బయట పెడుతుండగా మరికొందరు ఇన్ డైరెక్ట్ గా బడా బాబుల గుట్టు విప్పుతున్నారు. ఇటీవల యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై వివరణ ఇచ్చింది. ఇండస్ట్రీలో ఎలా పైకి రావలన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుందని అందుకు సంబంధించిన ఉదాహరణలు వివరించింది.

  ఎంబీఏ పూర్తి చేసి.. సినిమాల్లోకి..

  ఎంబీఏ పూర్తి చేసి.. సినిమాల్లోకి..

  ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అనసూయా ఎంబీఏ పూర్తి చేసిన తరువాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. కొన్నాళ్లకు యాంకర్ గా ఎంట్రీ ఇవ్వడంతో ఆమె కెరీర్ ఊపందుకుంది. జబర్దస్త్ షో ద్వారా అనసూయా ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఈ స్థాయికి రావడానికి కేవలం తన టాలెంట్ ని మాత్రమే నమ్ముకున్నానని అనసూయ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది.

  ఈజీగా బలైపోతున్నారు.

  ఈజీగా బలైపోతున్నారు.

  అనసూయ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో పెద్దగా ఎవరు తెలియదు. అయినా కూడా నేను ఇబ్బందులు ఏమి ఎదుర్కోలేదు. నా టాలెంట్ ని నమ్ముకొని ముందుకు వెళ్లడం జరిగింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక అమ్మయి ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఒక సినిమా కోసం మంచి క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు కొందరు ఆడవాళ్ళు ఈజీగా బలైపోతున్నారు.

  ఇది కాకపోతే దినమ్మలాంటి క్యారెక్టర్

  ఇది కాకపోతే దినమ్మలాంటి క్యారెక్టర్

  ఇది కాకపోతే దినమ్మ లాంటి క్యారెక్టర్ వస్తుందని దాన్ని వదిలేయవచ్చు. అలా చేయకుండా కొందరు ఉండేలేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కేవలం టాలెంట్ ని మాత్రమే నమ్మాలి. ప్రస్తుత రోజుల్లో కాంపిటీషన్ అంత ఈజీగా లేదని నేను చెప్పడం లేదు. ఒక పాత్రలో నేను నటించినప్పుడు అంతకంటే ఎక్కువగా నటించే వాళ్ళు మరో పది మంది ఉండవచ్చు. .

  కొన్నిసార్లు బలికావాల్సి వచ్చింది

  కొన్నిసార్లు బలికావాల్సి వచ్చింది

  కానీ ఎప్పుడైనా సరే మీలో ఉన్న బలాన్ని టాలెంట్ ని మాత్రమే నమ్ముకోవాలి. నేను కొన్నిటిని మిస్ అయ్యాను. పేవరేటిజం అనే దానికి కొన్నిసార్లు బలికావాల్సి వచ్చింది. కానీ ఎప్పుడు కూడా ఆ విషయాన్ని బయటకు అయితే చెప్పలేదు. అదే కావాలని రాద్దాంతం కూడా చేయలేదు.

  Checkmate Movie Trailer | Anchor Vishnupriya చెక్ మేట్ ట్రైలర్, విష్ణుప్రియ యమ హాట్ గురూ !
  సమయం వచ్చింది కాబట్టి బయటపెడుతున్నా

  సమయం వచ్చింది కాబట్టి బయటపెడుతున్నా

  సమయం వచ్చింది కాబట్టి బయటపెడుతున్నా.. రెండు సంవత్సరాల క్రితం ఒక గ్రూప్ పేవరేటిజం కారణంగా నేను మంచి అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ నేను నా సామర్ధ్యాన్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాను. ఈ పాత్రకు అనసూయ తప్పితే మరొకరు న్యాయం చేయలేరు అనేలా హార్డ్ వర్క్ చేయాలి. కేవలం ఈ ఒక్క విషయంలో టార్గెట్ పెట్టుకోగలిగితే క్యాస్టింగ్ కౌచ్ అనే కాదు.. క్యాస్టింగ్ పిల్లో కూడా మన దరిదాపుల్లో కనిపించదు' అంటూ అనసూయ వివరణ ఇచ్చింది.

  English summary
  Tollywood's number one anchor is Suma Kanakala. What started as a career as anchor has received more craze than Star Actors. Powerful in terms of extracting the suma people who currently dominate the Hot Anchors. Recently, a shocking rumor came over suma, who has been busy anchoring TV shows and pre-rock events.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X