twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Anasuya :భయపడేదాన్ని కాదు.. ఇప్పట్నుంచి నా పేరు వాడితే కోర్టుకు వెళ్తా..మీడియాకు వార్నింగ్..

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం సృష్టించిన వాడి వేడి ఇంకా తగ్గలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు మంచి మెజారిటీతో ప్రకాష్ రాజు మీద గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే మొట్టమొదటిసారిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగి రెండు రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఆ వ్యవహారం మీద ప్రెస్ మీట్ లు నడుస్తూనే ఉన్నాయి. అయితే ఈ రోజు ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించిన తర్వాత మీడియాతో మాట్లాడిన అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

    రెండో రోజుకి వాయిదా ఎందుకు ?

    రెండో రోజుకి వాయిదా ఎందుకు ?

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజు ప్యానల్ నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా పోటీ చేసి ఓడిపోయిన అనసూయ భరద్వాజ్ నిన్న రాత్రి సోషల్ మీడియా వేదికగా అనేక ప్రశ్నలు కురిపించింది. మా సంస్థలో మొత్తం 900 మంది సభ్యులు ఉన్నారు. వాళ్లలో సుమారు 600 మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆ ఓట్ల లెక్కింపు రెండో రోజుకి వాయిదా వేయాల్సినంత టైమ్ ఎందుకు పట్టిందంటారు? ఆహా ఏదో అర్థం కావడం లేదు అని అనసూయ భరద్వాజ్ ప్రశ్నించింది.

    రాత్రికి రాత్రే

    రాత్రికి రాత్రే

    ఆ తరువాత అనసూయ మరో ట్వీట్ చేస్తూ.. క్షమించాలి. ఒక్క విషయం గురించి తెగ నవ్వొచ్చింది. మీతో పంచుకోవాల్సిందే. ఆ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. మీరు ఏమనుకోవద్దు. నిన్న అనసూయ అత్యధిక మెజారిటీ, భారీ మెజారిటీతో గెలుపు అని, ఈ రోజు లాస్ట్, ఓటమి పాలు అని అంటున్నారు. రాత్రికి రాత్రే ఏం జరిగి ఉంటుందబ్బా అని అనసూయ భరద్వాజ్ వెటకారం చేసింది.

    ప్రశ్నల వర్షం

    ప్రశ్నల వర్షం

    ఇదే విషయం మీద ఈరోజు మీడియా కనిపించగానే మీడియా మీద ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు లోపల ఇంకా ఓట్ల లెక్కింపు కూడా మొదలు కాకుండా అనసూయ భారీ మెజారిటీతో గెలుపొందినది అంటూ ఎలా స్క్రోలింగులు వేశారు అని ఆమె ప్రశ్నించింది. నేను అదే నమ్మి ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశాను దీనికి ఎవరు సమాధానం చెబుతారు? మీరు నిజానిజాలు తెలుసుకోకుండా ఎలా వార్తలు రాస్తారు అంటూ అనసూయ ఫైర్ అయింది.

     ఎవరు చెబితే బ్రేకింగ్ వేశారు?

    ఎవరు చెబితే బ్రేకింగ్ వేశారు?

    ఆ రోజు అసలు ఎవరు చెబితే మీరు బ్రేకింగ్ వేశారు? అని అనసూయ ప్రశ్నించగా అక్కడున్న మీడియా ప్రతినిధులు తమకు ఇన్ పుట్స్ అందాయని చెప్పారు. తాను కూడా మీడియా నుంచి వచ్చాను అని చెప్పిన అనసూయ మీడియా న్యూస్ రిపోర్ట్ చేయాలి గాని క్రియేట్ చేయకూడదని ఆమె చెప్పుకొచ్చింది.

     మాకు మోసం జరిగింది

    మాకు మోసం జరిగింది

    అయితే అనసూయను మీడియా ప్రతినిధులు ఏదో ఒకటి మాట్లాడాలి అని కోరగా అసలు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం అది కాదు అని మాకు మోసం జరిగింది అని చెప్పడానికి రాలేదని ఆమె చెప్పుకొచ్చింది. మా ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేయగా వారిని గెలిపించిన వారికి సమాధానం చెప్పడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టామని ఆమె వెల్లడించింది.

    Recommended Video

    Raviteja Released Venuvu lo Song From Natyam Movie
    కోర్టుకు వెళ్తా జాగ్రత్త

    కోర్టుకు వెళ్తా జాగ్రత్త

    అయితే ఆమె వెళ్లకుండా మీడియా ప్రతినిధులు అడ్డుగా నిలబడి ఏదో ఒకటి మాట్లాడాలి అని కోరగా సంయమనం కోల్పోయిన అనసూయ ఇకమీదట నా ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలను నా పేరు వాడితే కచ్చితంగా కోర్టుకు వెళతానని వార్నింగ్ ఇచ్చింది. ఇకమీదట అనసూయ ప్రమేయం లేకుండా అనసూయ పేరు యూట్యూబ్ ఛానల్ లో కానీ న్యూస్ చానల్స్ లో గాని కనిపిస్తే కోర్టుకు వెళ్తానని ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎట్టకేలకు మీడియా ప్రతినిధులు ప్రశ్నలు సంధిస్తున్నా సరే ఆమె వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది

    English summary
    Anasuya Bharadwaj gave strong warning to media channels.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X