అనుష్క నెక్ట్స్ అప్డేట్స్: దర్శకుడు, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ ఖరారు
హీరోయిన్ అనుష్క నుంచి 'భాగమతి' తర్వాత ఏ సినిమా రాలేదు. ఆ మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఈ మంగులూరు బ్యూటీ బరువు తగ్గేందుకు కొన్ని నెలల పాటు ప్రకృతి పరమైన ట్రీట్మెంట్ తీసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం అనుష్క నెక్ట్స్ తన నెక్ట్స్ మూవీకి కమిటైనట్లు తెలుస్తోంది.
అనుష్క తర్వాతి సినిమా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందబోతోంది. తెలుగు రచయత, నిర్మాత కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అనుష్క రేంజికి తగిన విధంగా భారీస్థాయిలో ఈ సినిమా ఉండబోతోందట.

అయితే సినిమా కథ ఎలాంటి? ఏ కాన్సెప్టును ఈ చిత్రం కోసం ఎంచుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. అయితే షూటింగ్ ఎక్కువగా అమెరికాలోనే జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఓకే అయినట్లు సమాచారం. గీత గోవిందం చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించిన గోపీ సుందర్... అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కబోయే చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నారట.


Click it and Unblock the Notifications











