Arthi agarwal: తారలా మెరిసి మాయమైన అందాల నటి.. చివరి రోజుల్లో అలాంటి నరకం చూసి..

సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతోమంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. కేవలం ఒకరిద్దరు మాత్రమే ఇండస్ట్రీలో కొన్నాళ్ల పాటు అలానే కొనసాగుతూ ఉంటారు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ కొంతమంది హీరోయిన్స్ ను మరచిపోవడం అంత ఈజీ కాదు. అలాంటి బ్యూటీలలో ఆర్తి అగర్వాల్ ఒకరు. ఆమె జీవితం ఎంత హ్యాపీగా కొనసాగిందో చివరి రోజుల్లో అంతే విషాధంగా ముగిసింది. స్టార్ వరల్డ్ లో ఎగురుతున్న ప్రతిసారి ఎదో ఒక రకంగా దెబ్బ పడింది.. చివరికి అనుమానంగానే ఆమె జీవితం ముగిసింది.ఇక జూన్ 6న ఆమె వర్దంతి సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు షేర్ చేసుకున్నారు.

ఆ సినిమా హిట్టవ్వడంతో

ఆ సినిమా హిట్టవ్వడంతో

ఆర్తి అగర్వాల్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. నువ్వు నాకు నచ్చావు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమా హిట్టవ్వడంతో అమ్మడు ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత నువ్వు లేక నేను లేను, అల్లరి రాముడు అంటూ వరుస ఆఫర్స్ అందుకుంది. కెరీర్ మొదట్లోనే ఏకంగా మెగాస్టార్ తో పోటీ పడుతూ ఇంద్ర సినిమాలో నటించింది.

 2005 తరువాత బ్యాడ్ టైమ్

2005 తరువాత బ్యాడ్ టైమ్

2005 వరకు బాగానే కొనసాగిన ఆమె కెరీర్ ఒక్కసారిగా పలు ఘటనలతో యూ టర్న్ తీసుకోవడం అందరిని షాక్ కు గురి చేసింది. ఒకసారి అనుకోకుండా కిందపడి గాయలపాలైంది. తలకు తీవ్రంగా దెబ్బ తగలడం వలన అప్పట్లో ఆ న్యూస్ పలు అనుమానాలకు దారి తీసింది.

సూసైడ్ అటెంప్ట్.. లవ్ ఫెయిల్యూర్

సూసైడ్ అటెంప్ట్.. లవ్ ఫెయిల్యూర్

ఇక ఒకనొక సమయంలో ఆమె ప్రేమలో ఉన్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి. యువ హీరోతో ప్రేమలో విఫలం అవ్వడం వలన సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు కూడా అనేక రకాల కథనాలు వచ్చాయి. అన్ని సమస్యలు దాటుకుంటూ వచ్చినప్పటికీ ఆర్తి అగర్వాల్ మళ్ళీ హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు చేసింది.

అదే ఆమెకు శాపంగా మారింది

అదే ఆమెకు శాపంగా మారింది

మధ్యలో నరసింహుడు, ఛత్రపతి వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఇక 2007లో తస్వాల్ కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్నప్పటి 2009లోనే అతనితో విభేదాలు వచ్చి విడాకులు తీసుకుంది. మళ్ళీ సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆర్తి అగర్వాల్ అమెరికాలో లైపోసక్షన్ సర్జరీ చేసుకొని లావు తగ్గాలని అనుకుంది. కానీ అదే ఆమెకు శాపంగా మారింది.

Recommended Video

'Chhapaak' Will Have Impact In Society Says Laxmi Agarwal
ఆరు వారాల పాటు నరకం చూసి..

ఆరు వారాల పాటు నరకం చూసి..

సర్జరీ ఫెయిల్ అవ్వడంతో ఆరు వారాల పాటు నరకం చూసిన ఆమె చివరికి గుండెపోటు రావడంతో మరణించినట్లు ఆమె మేనేజర్ అప్పట్లో మీడియాకు వివరణ ఇచ్చారు. కానీ ఆమె మరణం వెనుక పలు అనుమానాలు కూడా వచ్చాయి. డాక్టర్స్ పై అలాగే ఆర్తి అగర్వాల్ పేరెంట్స్ పై కూడా అప్పట్లో పోలీస్ కేసు నమోదైంది. దీంతో ఆర్తి అగర్వాల్ అలా వివాదాలలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X