హైదరాబాదీతో అవికా గోర్ డేటింగ్... అతడి వల్లే ఫిజికల్‌‌గా కూడా అంటూ.. మా బంధం అలాంటిదే!

చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అవికా గోర్ ప్రతీ ఇంటిలో ఒక సభ్యురాలయ్యారంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆ సీరియల్ ద్వారా పక్కింటి అమ్మాయి అనే భావనను ప్రేక్షకుల్లో క్రియేట్ చేసింది. చిన్నతనంలోనే తనదైన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకొన్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాదీతో పీకల్లోతు ప్రేమలో మునిగిన అవికా గోర్ తన అఫైర్, వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు వెల్లడిస్తూ...

మిలింద్‌తో రెండేళ్లుగా డేటింగ్ అంటూ

మిలింద్‌తో రెండేళ్లుగా డేటింగ్ అంటూ

హైదరాబాద్‌కు చెందిన మిలింద్ చంద్వానీతో అఫైర్ కొనసాగుతున్నది. రెండేళ్లుగా ఇద్దరం డేటింగ్ చేస్తున్నాం. కామన్ ఫ్రెండ్స్ ద్వారా మా ఇద్దరికి పరిచయం జరిగింది. అప్పటి నుంచి మేమిద్దరం కలుస్తు ఉండటంతో మా ఇద్దరి మధ్య బంధం ఏర్పడింది. మిలింద్‌తో పరిచయం తర్వాత నాలో ఎన్నో మార్పులు సంభవించాయి అని అవికా గోర్ వెల్లడించింది.

అతడి వల్లే అలా మారిపోయానంటూ..

అతడి వల్లే అలా మారిపోయానంటూ..

నాపై మిలింద్ ప్రభావం అన్ని రకాలుగా పడింది. మానసికంగా, శారీరకంగా, ఎమోషనల్‌గా చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను. నా గురించి, చుట్టుపక్కల ఉండే పరిస్థితుల గురించి అర్దం చేసుకోవడానికి మిలింద్ చాలా సహకరించాడు. నాలో అనూహ్యమైన మార్పులకు క్రెడిట్ అంతా ఆయనదే. నేను ఫిజికల్‌గా కూడా మారిపోవడానికి ఆయనే కారణం అంటూ అవికా గోర్ తెలిపారు.

 మిలింద్‌తో బంధం.. ఓ గర్వంగా అంటూ

మిలింద్‌తో బంధం.. ఓ గర్వంగా అంటూ

తన బాయ్‌ఫ్రెండ్‌ మిలింద్ చంద్వానీ గురించి చెబుతూ.. అనేక సమస్యలపై స్పందించే యాక్టివిస్ట్. ఎంటీవీ రోడీస్ రియల్ హీరోస్ 2019లో కంటెస్టెంట్‌గా అందర్నీ ఆకట్టుకొన్నాడు. ఆయనతో నా బంధం చాలా చాలా ప్రత్యేకమైనది. ప్రస్తుతం సమాజంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో అలాంటి వ్యక్తి నా హృదయానికి చేరువకావడం, ప్రేమికుడిగా నాతో జీవనం సాగించడాన్ని గర్వంగా ఫీల్ అవుతాను అని అవికా గోర్ పేర్కొన్నారు.

నా కెరీర్ గ్రాఫ్ దూసుకుపోవడం గ్యారెంటి...

నా కెరీర్ గ్రాఫ్ దూసుకుపోవడం గ్యారెంటి...

అవికా గోర్ తన ప్రాజెక్ట్ గురించి వెల్లడిస్తూ.. చాలా ఎక్సైటింగ్ కలిగించే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అవుతున్నాను. చాలా చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. రానున్న రోజుల్లో నా కెరీర్ గ్రాఫ్ దూసుకుపోతుందనే విశ్వాసం కలుగుతున్నది. నాలో కేవలం ఫిజికల్ ట్రాన్స్‌పర్మేషన్ జరగలేదు...మానసికంగా, ఎమోషనల్‌గా మారిపోయాను. నాలో కాన్పిడెన్స్ మరింత పెరిగింది. నాలో కొత్త అందాలు కనిపిస్తున్నాయి అంటూ అవికా గోర్ తెలిపింది.

Recommended Video

Comedian Ali Fires On Film Critics | Raju Gari Gadi Succsess Meet
 నాగచైతన్యతో కలిసి థ్యాంక్యూలో

నాగచైతన్యతో కలిసి థ్యాంక్యూలో

ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన అవికా గోర్.. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య, రాశీఖన్నా కలిసి నటిస్తున్న థ్యాంక్యూ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే అమరన్ అనే చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. అలాగే కల్యాణ్ దేవ్, నవీన్ చంద్ర చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X