‘బాబాయ్ అని నమ్మితే ... నా ఛాతీ బాగుందంటూ రోడ్డుపైనే దారుణంగా’
ఆడపిల్ల అర్ధరాత్రి నడిచినప్పుడే మన దేశానికి నిజమై స్వాతంత్య్రం అమిన జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. కానీ అర్ధరాత్రి సంగతి ఏమో కానీ పట్టపగలు కూడా మహిళలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు, ఆఫీస్‌లోనే కాదు సొంతింటిలోనే ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతోంది. తండ్రి, అన్న, తమ్ముడు, పెదనాన్న, బాబాయ్, మావయ్య ఇలా రక్త సంబంధీకులే మహిళల పాలిట కీచకులు అవుతున్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా లైంగిక వేధింపులుకు అతీతులు కాదు.. అయినవారి చేతుల్లోనే అత్యాచారానికి గురైన నటీనటులకు లెక్క లేదు. తాజాగా బాబాయ్ వరుస అయ్యే వ్యక్తి చేతిలో చిన్న వయసులోనే తాను లైంగిక వేధింపులు అనుభవించానని సంచలన వ్యాఖ్యలు చేసింది ఓ స్టార్ హీరోయిన్. ఈ వివరాల్లోకి వెళితే..
ఓవర్ నైట్ స్టార్
ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి పాపులర్ అయిపోయారు బాలీవుడ్ నటి ఆయేషా ఖాన్. ముఖ చిత్రం సినిమాతో తెలుగు వారిని పలకరించింది. ఆ తర్వాత చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా పెద్దగా హిట్ కాకపోడంతో ఆమె జనం కళ్లలో పడలేదు. అయితే ఓం భీమ్ బుష్ సినిమా ఆమెకు బ్రేక్ తీసుకొచ్చింది. ఓ చిన్న పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందంకుర్రాళ్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. మంచి హైట్, వైట్ స్కిన్ టోన్, అందంతో అజంతా శిల్పంలా ఉన్న ఆయేషాను చూడగానే కుర్రాళ్ల పల్స్ రేట్ పెరిగిపోయింది.

హిందీ బిగ్‌బాస్‌లో హల్‌చల్
నిజానికి ముంబైకి చెందిన ఆయేషా ఖాన్ బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించింది. కసాటి జిందగీ కే అనే సీరియల్‌లో చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత బల్వీర్ రిటర్న్ అనే ధారావాహికలోనూ నటించింది. అయితే సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వచ్చిన హిందీ బిగ్‌బాస్ 17లో అవకాశం దక్కించుకోవడంతో ఆయేషా ఫేట్ మారిపోయింది. గేమ్స్, డిస్కషన్స్ ఇలా అన్నింటిలోనూ సత్తా చాటిన ఈ చిన్నది.. దాదాపు 11 వారాల పాటు హౌస్‌లో ఉండి ఎలిమినేట్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఆమెను మళ్లీ హౌస్‌లోకి పంపారు నిర్వాహకులు. ఫైనల్‌కు ముందు 97వ రోజున ఆయేషా ఖాన్ ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత లక్కీ భాస్కర్, మనమే, జాట్, కిస్ కిసికో ప్యార్ కరూన్ 2లో ఆమె నటించారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆయేషా ఖాన్ ఎప్పటికప్పుడు సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత అంశాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటారు ఈ ముంబై భామ. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్‌లో తాను ఎదుర్కొన్న కష్టాలు, తనపై చిన్న వయసులోనే జరిగిన లైంగిక వేధింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాబాయ్ అనుకున్నా
పేదరికం కారణంగా తినడానికి తింటి కూడా ఉండేది కాదని, చికెన్ తినాలని ఉన్నా కొనుక్కోలేకపోయానని ఆయేషా చెప్పింది. చిన్న వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె వాపోయింది. ఓ రోజున రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా... మా నాన్నగారి ఫ్రెండ్ ఒకరు పిలిచారు. ఆయనను బాబాయ్ అని పిలిచే దానిని.. వెనక్కి తిరిగి చూడగా ఆయన కనిపించారు. తను స్కూటర్‌పై వచ్చి.. నీ వక్షోజాలు బాగున్నాయని అసభ్యంగా మాట్లాడాడు. ఆ మాటల గురించి ఆలోచిస్తూ షాక్‌లో ఉండగానే.. బాబాయ్ మళ్లీ వెనక్కి వచ్చి నాకు కన్ను కొట్టి.. అసభ్యకరంగా సైగలు చేశాడు. ఆయన అలా ఎందుకన్నాడో? ఏం మాట్లాడుతున్నాడో కానీ తెలియని వయసు నాది. తర్వాత ఇంటికెళ్లి ఒక్కదానినే ఏడ్చా... ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే కళ్ల వెంట ఆగకుండా నీరొస్తుందని ఆయేషా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











