సౌందర్య ఆ గెస్ట్‌హౌస్‌కి వెళ్లాల్సిందే.. బిగ్‌బాస్ ఫ్లోరా షైనీ షాకింగ్ కామెంట్స్
మహానటి సావిత్రి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమపై అంతటి ప్రభావం చూపారు సౌందర్య. గ్లామర్, సెంటిమెంట్, లేడీ ఓరియెంటెడ్ ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోతూ 90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. అబ్బాయిల కలల రాకుమారిగా నిలిచిన ఆమె.. తమకు కాబోయే భార్య అచ్చం సౌందర్య మాదిరిగానే అందంగా, అణుకువతో ఉండాలని కోరుకునే వారంటే అతిశయోక్తి కాదు. ఎంతో ఉన్నత స్థాయికి చేరాల్సిన దశలో చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు సౌందర్య. ఆవిడ సన్నిహితులు, ఇండస్ట్రీలోని సౌందర్య మిత్రులు ఇప్పటికీ ఆమె గొప్పదనం గురించి చెబుతూనే ఉంటారు. తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఫ్లోరా షైనీ షాకింగ్ కామెంట్స్ చేసింది.
90లలో ఇండస్ట్రీని ఊపేసిన సౌందర్య
1992లో గంధర్వ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు సౌందర్య. ఈ క్రమంలో మనవరాలి పెళ్లి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత వరుస బ్లాక్ బస్టర్స్‌తో సౌందర్య దూసుకొచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం హిందీలలో అందరి అగ్రనటుల సరసన నటించారు. పవిత్రబంధం, రాజా, పెళ్లి చేసుకుందాం రా తదితర సినిమాలో సౌందర్య మహిళా ప్రేక్షకులకు ఫేవరెట్‌గా నిలిచారు. 2003లో కర్ణాటకకే చెందిన జీఎస్ రఘు అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని పెళ్లాడారు సౌందర్య.

తిరిగిరాని లోకాలకు సౌందర్య
వివాహం జరిగినా సినిమాల్లో నటిస్తూనే వచ్చిన సౌందర్య.. 2004లో ఏప్రిల్ 17న బీజేపీ తరపున ఓ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరారు. అయితే ఛాపర్‌లో సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన కాసేపటికే అది కుప్పకూలింది. ఈ ఘటనలో సౌందర్య సహా కొందరు దుర్మరణం పాలయ్యారు. ఆమె మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సౌందర్య మరణించి ఇప్పటికీ 21 సంవత్సరాలు గడిచినా ఆమెను అభిమానులు మరిచిపోలేకపోతున్నారు.
నర్తనశాలను పక్కనపెట్టిన బాలయ్య
సౌందర్య మరణంతో ఆమె తీయాల్సిన పలు చిత్రాలు ఆగిపోయాయి. ముఖ్యంగా నటసింహం నందమూరి బాలకృష్ణ తన తండ్రి స్పూర్తి నర్తనశాలను స్వయంగా డైరెక్ట్ చేసి తెరకెక్కించాలని అనుకున్నారు. ఇందులో ద్రౌపది పాత్రకు సౌందర్యను ఒప్పించి ఆమె కాల్షీట్లు తీసుకున్నారు. సినిమా సెట్స్ పైకి వెళ్లిన కొద్దిరోజులకే సౌందర్య దుర్మరణం పాలవ్వడంతో బాలయ్య తన ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టారు. ద్రౌపది పాత్రకు సౌందర్య లాంటి నటి మాత్రమే న్యాయం చేయగలరని చెప్పి ఆయన నర్తనశాలను పూర్తిగా రద్దు చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి 17 నిమిషాల ఫుటేజ్ మాత్రం ఇటీవల ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ చేశారు.
గెస్ట్‌హౌస్ అంటే ఇష్టం
చిత్ర పరిశ్రమలోని ఆమె సన్నిహితులు, సౌందర్యతో పనిచేసిన నటీనటులు అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూలలో ఆమె గొప్పదనం గురించి చెప్పుకుంటూ ఉంటారు. తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్, సీనియర్ హీరోయిన్ ఫ్లోరా షైనీ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్దుకుపోదాం రండి సినిమాలో సౌందర్యతో కలిసి పనిచేశాను.. ఎక్కడ షూటింగ్ ఉన్నా ఆమెకు హోటల్స్‌లో బస చేయడం ఇష్టం ఉండేది కాదు. గెస్ట్‌హౌస్‌లలో ఉండటానికే ఇష్టపడేవారు. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే. నాకు కూడా సౌందర్యతో కలిసి గెస్ట్‌హౌస్‌లో ఉండే అవకాశం కల్పించారు. సౌందర్య ఒక లవ్లీ పర్సన్, ఆమె సెట్‌లోకి వస్తుంటే ఒక పాజిటివ్ ఆరా, పాజిటివ్ ఆటిట్యూడ్ స్పెడ్ అయ్యేది. సౌందర్యతో నేను ఒక్క సినిమా మాత్రమే చేసే అవకాశం వచ్చిందని, నేను జూనియర్‌ని అయినా ఆమె నాతో ప్రవర్తించిన విధానం నేను కొత్త వాళ్ల దగ్గర ఎలా ఉండాలో నేర్పించిందని ఫ్లోరా షైనీ తెలిపారు.


Click it and Unblock the Notifications











