For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంతపై అలా ఎగబడడంతో.. బాడీగార్డ్‌లా మారిన బాలీవుడ్ హీరో.. భయపెట్టకండి అంటూ

  |

  బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవాలి అని సమంత సరికొత్తగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. గత పదేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రహీరోయిన్ గా కొనసాగిన సమంత పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అదే తరహాలో తన స్టార్ హోదాను కొనసాగించింది. ఇక విడాకులు తీసుకున్న అనంతరం ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

  ఇక ఇటీవల ఆమె బాలీవుడ్ నుంచి ఒక ఆఫర్ అందుకుంది. ఇక ఆ ప్రాజెక్టును స్టార్ట్ చేయడానికి అటువైపు వెళ్ళింది ఈ క్రమంలో ఆమెకు ఒక చిన్నపాటి చేదు అనుభవం ఎదురవగా యువహీరో ఆమెను ప్రొటెక్ట్ చేసే విధంగా ప్రవర్తించాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతుంది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

  స్పెషల్ సాంగ్ తో..

  స్పెషల్ సాంగ్ తో..

  సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత తన సినిమా కెరీర్ విషయంలో చాలా కొత్తగా ఆలోచిస్తుంది. తన ఉనికిని ఇతర ఇండస్ట్రీలో కూడా చాటుకునేందుకు మంచి అవకాశాలు కోసం ప్రయత్నం చేస్తోంది సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్ అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ అయితే అందుకుంది.

  సమంత ఫుల్ హ్యాపీ

  సమంత ఫుల్ హ్యాపీ

  పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ తో తన స్థాయి మరింత పెరిగింది అని దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం మంచి ఆనందాన్ని ఇచ్చింది అని కూడా సమంత ఇటీవల ముంబైలో ఒక ఈవెంట్ లో వివరణ ఇచ్చింది. అంతేకాకుండా ఆ పాటతోనే జనాలు ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ మరిచిపోయే విధంగా మాట్లాడుతున్నారు అని ఎక్కువగా ఆ పాటను గుర్తు చేసుకుంటున్నారు అని కూడా ఆమె సంతోషంగా తెలియజేసింది.

  బాలీవుడ్ ప్రాజెక్ట్

  బాలీవుడ్ ప్రాజెక్ట్

  అయితే సమంత ఇటీవల అమెజాన్ ప్రైమ్ నిర్మించబోయే యాక్షన్ ఫిలిం కోసం ముంబై వెళ్ళింది. ఆ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్టు పనులు కూడా సిద్ధమయ్యాయి. ద ఫ్యామిలీ మెన్ దర్శకులు రాజ్ అండ్ డీకే తెరకెక్కించబోయే ఆ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా సమంతా హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు ఫినిష్ అయినట్లుగా తెలుస్తోంది.

  ఎగబడిన మీడియా

  అయితే ఇటీవల సమంత ముంబైకి వెళ్లి అక్కడ చిత్ర యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా కలుసుకుంది. ఈ క్రమంలో ఆమెను ఫోటోలు తీసేందుకు అక్కడే కెమెరామెన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. అంతేకాకుండా ఆమెను పలు రకాల ప్రశ్నలు అడిగేందుకు కూడా ప్రయత్నం చేశారు. అందరూ ఒకేసారి వచ్చేసరికి సమంత ఏమీ మాట్లాడకుండా కాస్త తడబడుతూ స్మైల్ అయితే ఇచ్చేసింది.

  Recommended Video

  The Legends We Lost In 2021.. చిరస్మరణీయులు | Filmibeat Telugu
  ప్రొటెక్ట్ చేసిన హీరో

  ప్రొటెక్ట్ చేసిన హీరో

  ఇక ఆమె పరిస్థితిని ముందుగానే అర్థం చేసుకున్న వరుణ్ ధావన్ ఆమెను ప్రొటెక్ట్ చేసే విధంగా ప్రయత్నం చేశాడు. ఆమెను అలా బయట పెట్టకండి అంటూ కాస్త నెమ్మదిగానే వారికే సున్నితంగా అర్థమయ్యేలా చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఆమెను కారు వరకు ఒక బాడీగార్డు తరహాలో కాపాడుతూ తీసుకు వెళ్ళాడు. ఇక వరుణ్ ధావన్ ఆ విధంగా సమంతకు సహాయం చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది

  English summary
  Bollywood hero Varun dhawan protect samantha ruth prabhu
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X