Just In
- 2 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 3 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 4 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 5 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అనసూయకు బిగ్ షాక్: చిరంజీవి అలా డిసైడ్ చేయడంతో యాంకరమ్మకు మొండిచేయి.!
అనసూయ భరద్వాజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు అనడంలో సందేహం లేదు. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈమె.. ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఈ ఒక్క షో ద్వారానే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకుంది. గ్లామర్‌కు గ్లామర్, యాక్టింగ్‌కు యాక్టింగ్ చేయగలిగే అనసూయ.. టీవీ షోలతో బిజీగా ఉంటూనే.. సినిమాల్లోనూ నటించి మెప్పిస్తోంది.
ఇప్పటికే పలు చిత్రాల్లో అత్యుత్తమ నటనను కనబరించింది. ఈ క్రమంలోనే భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. తాజాగా ఈమెకు భారీ షాక్ తగిలిందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం చిరంజీవి తీసుకున్న నిర్ణయమే అంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

అనసూయ అంటే ఇవే గుర్తుకొస్తాయి
చాలా ఏళ్ల క్రితం వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చిత్రం ‘నాగ' ద్వారా అనసూయ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. క్రేజ్ వచ్చిన తర్వాత చేసిన ‘క్షణం', ‘సోగ్గాడే చిన్ని నాయన', ‘రంగస్థలం', ‘యాత్ర' చిత్రాలకు మంచి పేరు వచ్చింది. వీటిలో రంగమ్మత్త పాత్రకు మాత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

ఆమె క్రేజ్‌కు ఇది కూడా కారణమే
స్టార్ యాంకర్ అనసూయ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడం వెనుక సోషల్ మీడియా పాత్ర కూడా ఉంది. అక్కడ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె.. తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ విశేషాలను పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలను షేర్ చేస్తోంది. దీంతో అనసూయ ఫాలోవర్లు క్రమంగా పెరుగుతున్నారు.

సీనియర్ డైరెక్టర్ సినిమాలో స్పైసీ రోల్
గత ఏడాది అనసూయ ‘కథనం' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక, ఈ ఏడాది ఆమె ఒప్పుకున్న మొదటి చిత్రం ‘రంగమార్తాండ'. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఆమె స్పైసీ రోల్ చేస్తుందని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇందులో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు.

మెగాస్టార్ సినిమాలో కీలక పాత్ర
ఇక, మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో అనసూయ కీలక పాత్ర చేయబోతుందని ఆ మధ్య ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఆమె పాత్ర సినిమాను మలుపు తిప్పేదిగా ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. అలాగే, ఇప్పటికే కొరటాల శివ.. అనసూయకు కథను కూడా వినిపించాడనే టాక్ వినిపించింది.

చిరు నిర్ణయంతో అనసూయకు షాక్
తాజాగా ఈ అంశం గురించి ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో అనసూయను నటింపజేయాలనుకున్న పాత్రను పొడిగించాలని చిరంజీవి.. కొరటాలకు చెప్పారనేదే ఆ వార్త సారాంశం. అంతేకాదు, ఈ పాత్రకు మంచి పేరున్న సీనియర్ నటిని తీసుకోవాలని కూడా సూచించారని అంటున్నారు. ఇదే నిజమైతే అనసూయకు షాక్ తగిలినట్లే.!