పనిపిల్లలపై హీరోయిన్ వేధింపులు.. ఫుట్‌పాత్‌పైనే అమ్మాయిలు దారుణంగా

ఇటీవలి కాలంలో హీరోయిన్లు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. పలు కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లినవారు కూడా ఉంటున్నారు. నోటి దురుసు, వివాదాస్పద వ్యాఖ్యల్లో కొందరు హీరోలకు ఏమాత్రం తగ్గడం లేదు హీరోయిన్లు. అవసరమైతే నాలుగు ఆకులు ఎక్కువే చదివామని నిరూపించుకుంటున్నారు. టాలీవుడ్ టూ బాలీవుడ్ కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచే హీరోయిన్లు ఎందరో ఉన్నారు. వారి మాటలు, చేతలు అన్నీ వివాదాస్పదమే. ఈ కోవలోకే వస్తారు డస్కీ బ్యూటీ డింపుల్ హయాతి.

జర్రా జర్రా సాంగ్‌తో పాపులర్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ చిత్రంలో జర్రా జర్రా అనే ఐటెం సాంగ్‌లో తళుక్కున మెరిసింది డింపుల్ హయాతి. ఈ పాటలో తన డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఛాన్సులు మాత్రం రాలేదు. ఈ సినిమా కంటే ముందు గల్ఫ్ అనే మూవీలో కనిపించింది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది? ఎప్పుడు వెళ్లింది కూడా తెలియదు.

Dimple Hayathi faces serious allegations from maids at home

చేసిన సినిమాలన్నీ ఫ్లాప్
గద్ధలకొండ గణేష్ మూవీ తర్వాత ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన అభినేత్రి అనే మూవీలో కీ రోల్ పోషించింది. అనంతరం దేవి 2, ఏరుకలతో పాటు హిందీలో అత్రాంగి రే, తమిళ్‌లో వీరమయే వాగై సోదమ్‌లో నటించింది డింపుల్. ఈ దశలో సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ సరసన నటించిన ఖిలాడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇందులో బికినీతో పాటు రొమాంటిక్ సీన్స్‌లోనూ టాప్ లేపింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ సరసన రామబాణం సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయ్యింది.

ఐపీఎస్ ఆఫీసర్‌తో గొడవ
సినిమాల సంగతి పక్కనపెడితే.. వ్యక్తిగతంగా డింపుల్ హయాతి వివాదాల్లో ఇరుక్కుంది. గతేడాది హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద ఐపీఎస్ అధికారి వాహనాన్ని డింపుల్ పదే పదే తన్నిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సదరు అధికారి పలుమార్లు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా డింపుల్ పట్టించుకోకపోవడంతో చివరికి పోలీస్ స్టేషన్ వరకు వ్యవహారం వెళ్లింది. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది.

పనిమనుషులకు టార్చర్
తాజాగా డింపుల్ హయాతి మరో వివాదంలో ఇరుక్కుంది. తన ఇంట్లో పెంపుడు కుక్కల్ని చూసుకోవడానికి ఆమె ఒడిషాకు చెందిన ఇద్దరు యువతుల్ని పిలిపించుకుని.. వారిద్దరిని డింపుల్, ఆమె భర్త టార్చర్ చేసినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమ్మాయిలతో పనిచేయించుకుని వారికి డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా అసభ్యపదజాలంతో దూషించినట్లుగా వీరిద్దరిని పనికి కుదిర్చిన మహిళ ఆరోపిస్తున్నారు. తన భర్త న్యాయవాది అని మీరు నన్నేం చేయలేరంటూ అమ్మాయిల్ని బెదిరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ అమ్మాయిలు రోడ్డునపడ్డారు.. ఫుట్‌పాత్‌పై పడుకుని తమకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై హీరోయిన్ డింపుల్ హయాతి, ఆమె భర్త ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. అయితే ఈ గ్యాప్‌‌లో అసలు డింపుల్‌కి పెళ్లి ఎప్పుడైంది? ఆమె భర్త ఎవరు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Read more about: dimple hayathi movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X