పొట్టకూటి కోసం శాండ్‌విచ్‌లు అమ్మి.. ఇప్పుడు రిచెస్ట్ హీరోయిన్‌గా, ఎవరో తెలుసా?

భారతీయ చిత్ర పరిశ్రమలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించిన నటీనటులు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించి ఆ తర్వాత తన ప్రతిభతో ధనవంతులుగా మారారు. చిరంజీవి, షారుఖ్ ఖాన్, రజనీకాంత్ ఇలా ఈ లిస్ట్ తీస్తే చాలా పెద్దదే. అలా బతుకుదెరువు కోసం తొలుత శాండ్‌విచ్‌లు అమ్ముకుని నేడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా, రిచెస్ట్ హీరోయిన్‌లలో ఒకరిగా వెలుగొందుతున్న ఓ నటీమణి ఉంది. ఈ వివరాల్లోకి వెళితే..

శాండ్‌విచ్‌‌లు అమ్మి
బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శక్తికపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు శ్రద్ధా కపూర్. తల్లిదండ్రుల తరపు కుటుంబాలు లతా మంగేష్కర్, పద్మినీ కొల్హాపూరి వంటి దిగ్గజాలకు చెందినవారు కావడం విశేషం. అమెరికాలో చదువుకున్న శ్రద్ధా కపూర్ అప్పట్లో తన పాకెట్ మనీ, ఇతర ఖర్చుల నిమిత్తం ప్రఖ్యాత స్టార్‌బక్స్‌లో బరిస్టాగా, ఐన్‌స్టీన్ బ్రదర్స్ బాగెల్స్‌లో శాండ్‌విచ్‌లను కూడా అమ్మినట్లు తన లింక్డిన్ ప్రొఫైల్‌లో రాసుకొచ్చింది. చదువు తర్వాత 2010లో టీన్ పత్తి అనే సినిమాలో ఓ చిన్న పాత్రతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు శ్రద్ధ. తొలి సినిమాలోనే అమితాబ్ బచ్చన్, మాధవన్ వంటి దిగ్గజాలతో పనిచేసే అవకాశం కొట్టేశారు.

From Sandwich maker to super star Stree 2 Actress Shraddha Kapoor s inspirational journey

ఆషికీ 2తో పాపులారిటీ
ఆ తర్వాత లవ్ కా ది ఎండ్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ అందుకున్నారు. ఈ దశలో ఆషికీ 2తో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అనంతరం హైదర్, ఏక్‌విలన్, ఏబీసీడీ 2, భాఘీ, సాహో, స్త్రీ 2 వంటి సినిమాలతో బాలీవుడ్‌లో తిరుగులేని నటిగా నిలిచారు శ్రద్ధా కపూర్. నటిగానే కాకుండా సింగర్‌గా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు ఈ ముద్దుగుమ్మ. భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగానే కాకుండా ప్రఖ్యాత ఫోర్బ్స్ ఇండియా సెలబ్రెటీ 100లో పలుమార్లు నిలిచారు శ్రద్ధా కపూర్.

స్త్రీ 2తో రికార్డులు బద్ధలు
గతేడాది స్త్రీ 2తో బాలీవుడ్ రికార్డుల్ని తిరగరాశారు శ్రద్ధా కపూర్. హార్రర్ - కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 880 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో సరికొత్త బెంచ్ మార్క్‌‌లు సృష్టించింది. స్త్రీ 2 తర్వాత ఆమె కొత్తగా ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా ఫాలోయింగ్ ఉంది. గతేడాది ఆగస్ట్‌లో మోస్ట్ ఫాలోవుడ్ ఇండియన్ ఉమెన్‌గా నిలిచింది శ్రద్ధా కపూర్. సినిమాలతో పాటు బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌, వ్యాపారాలతో ఆమె రెండు చేతులా సంపాదిస్తోంది.

ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా
సినిమాకు 10 నుంచి 12 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటారు శ్రద్ధా కపూర్. ఈమె ఆస్తుల విలువ 16 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో 130 కోట్ల రూపాయలు) ఉంటుందని అంచనా. ఒకప్పుడు బరిస్టాలో పనిచేయడంతో పాటు శాండ్‌విచ్‌లు అమ్మిన శ్రద్ధా కపూర్ తన కష్టంతో, ప్రతిభతో ఈ స్థాయికి చేరుకున్నారు. బలమైన సినీ నేపథ్యం ఉన్నప్పటికీ ఆమెకు బాలీవుడ్‌లో అంతగా అవకాశాలు రాలేదు. తనను తాను నిరూపించుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూసిన శ్రద్ధా కపూర్ ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా, రిచెస్ట్ హీరోయిన్‌లలో ఒకరిగా నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X