twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy birthday Vijayashanthi: పిల్లలు లేకపోవడానికి కారణమిదే.. చివరికి ఆస్తులు మొత్తం వాళ్లకోసమే

    |

    సినినటిగా 90లలో లేడి సూపర్ స్టార్ గా గుర్తింపు అందుకున్న విజయశాంతి నేడు 55వ వసంతంలోకి అడుగు పెట్టారు. విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది సినీ ప్రముఖులు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఇక విజయశాంతి ఆల్ మోస్ట్ స్టార్ హీరోల రేంజ్ లో గుర్తింపు అందుకొని ఎంతో లగ్జరీ లైఫ్ ను చూశారు. అయితే ఆమె పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదు. అందుకు ఒక కారణం కూడా ఉందని తెలియజేశారు.

    గొప్ప సినిమాల్లో అదొకటి..

    గొప్ప సినిమాల్లో అదొకటి..

    40 సంవత్సరాల సినీ కెరీర్‌లో, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలతో పాటు ముఖ్యంగా తెలుగులో ఆమె ఎన్ని విజయాలను అందుకున్నారు. వివిధ భాషలలో మొత్తంగా 187 చిత్రాలలో నటించారు. ఆమె నటించిన గొప్ప సినిమాల్లో కర్తవ్యం (1990) ఒకటి. సూపర్ కాప్ గా చేసినందుకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు కూడా లభించింది.

    ఎన్నో అవార్డులు

    ఎన్నో అవార్డులు

    ప్రతిఘటన (1985)లో చేసిన పాత్రకు గాను విజయశాంతి మొదటిసారి రాష్ట్ర నంది అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఇక ఆమె ఉత్తమ నటిగా నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డులు, ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. 2003 లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, అలాగే తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమమణి అవార్డు కూడా దక్కింది.

    మెగాస్టార్ తో 19 సినిమాలు

    మెగాస్టార్ తో 19 సినిమాలు

    ఎక్కువగా ఆమె మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేసి గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, స్వయం కృషి, కొండవీటి దొంగ, మెకానిక్ అల్లుడు, యముడికి మొగుడు వంటి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నారు. అప్పట్లో విజయశాంతి, మెగాస్టార్ చిరంజీవి అంటే ఓపెనింగ్స్ ఒక రేంజ్ లో ఉండేవి. మొత్తంగా వారి కలయికలో 19 సినిమాలు వచ్చాయి.

    రాజకీయాల్లో పోరాటాలు

    రాజకీయాల్లో పోరాటాలు

    ఇక సినిమాలను తగ్గించిన అనంతరం మెల్లగా రాజకీయాల వైపు అడుగులు వేసిన విజయశాంతి అనేక సామాజిక అంశాలపై పోరాటాలు కూడా చేశారు. ఎక్కువశాతం ఆమె ప్రతిపక్ష పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఎంతగానో పోరాడారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అనంతరం ఆమె ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

    Recommended Video

    బొమ్మ దద్దరిల్లిపోద్ది.. సరిలేరు నేకేవ్వరు డైలాగ్ చెప్పిన మహేష్
    విజయశాంతి భర్త..

    విజయశాంతి భర్త..

    ఇక విజయశాంతి 1988 లో M. V. శ్రీనివాస్ ప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు. చెన్నై - హైదరాబాద్ లలో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఆయన దగ్గుబాటి పురందరేశ్వరికి దగ్గరి బంధువు కూడా. అయితే పెళ్లి అనంతరం పిల్లలు కావాలనే వద్దనుకున్నట్లు విజయశాంతి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

    ఆస్తులు మొత్తం వాళ్లకోసమే..

    ఆస్తులు మొత్తం వాళ్లకోసమే..

    నా జీవితం మొత్తం కూడా ప్రజలకు అంకితం చేయాలని అనుకున్నాను. ఎందుకంటే వారి ఆదరణ వల్లే నేను ఎంతో స్టార్ డమ్ చూశాను. లగ్జరీ లైఫ్ ను అనుభవించాను. నాకు పిల్లలు ఉండి ఉంటె స్వార్థం వచ్చి ఉండేదేమో. అందుకే నేను నా భర్త ఇద్దరం కూడా పిల్లల వద్దని అనుకున్నాము. రేపు మా అనంతరం ఆస్తులు అన్ని కూడా పేద ప్రజలకు ఉపయోగించాలి, ఉచిత విద్యా, ఉచిత చదువు వంటి మంచి పనులు కోసం ఉపయోగించాలని అనుకుంటున్నట్లు తెలియజేశారు.

    English summary
    Vijayashanthi, who was recognized as a lady superstar in the 90s as a movie star, has entered the 55th spring today. Many cine celebrities are offering their best wishes on the occasion of Vijayashanthi birthday. Vijayashanthi was recognized in the range of All Most Star Heroes and had a very luxurious life. However she did not want to have children.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X