HBD Deepika Padukone వివాదాల మధ్య దీపిక పదుకోన్ బర్త్ డే.. Project K టీమ్ క్రేజీగా విషెస్!

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన దీపిక పదుకోన్.. కన్నడ చిత్రం ఐశ్వర్యతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత షారుక్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దీపిక.. కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస చిత్రాలతో భారీ విజయాలను అందుకొంటూ టాప్ హీరోయిన్‌గా మారింది. అయితే పఠాన్ చిత్రంలోని బేషరమ్ రంగ్ సాంగ్ వివాదం మధ్య దీపిక పదుకోన్ జన్మదిన్నాన్ని జరుపుకొంటున్నది. ఆమె వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం, బర్త్ డే విశేషాల గురించిన వివరాల్లోకి వెళితే..

భారతీయ భాషల్లో టాప్ హీరోయిన్‌గా

భారతీయ భాషల్లో టాప్ హీరోయిన్‌గా

కన్నడ, హిందీ, తమిళ చిత్రాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దీపిక పదుకోన్‌కు బాలీవుడ్‌లోనే భారీ బ్రేక్ లభించింది. లవ్ ఆజ్ కల్, హౌస్‌ఫుల్, చెన్నై ఎక్స్‌ప్రెస్, కాక్ టెయిల్, హ్యాపీ న్యూ ఇయర్, పికూ, బాజీరావు మస్తానీ, పద్మావత్, గెహ్రాయియాన్, బ్రహ్మస్త్ర చిత్రాల్లో నటించి భారీ సక్సెస్‌లను సొంతం చేసుకొన్నది.

హాలీవుడ్, అమెరికన్ చిత్రాలతో

హాలీవుడ్, అమెరికన్ చిత్రాలతో

కేవలం బాలీవుడ్ చిత్రాలతో సరిపెట్టుకోకుండా.. హాలీవుడ్, అమెరికన్ చిత్రాల్లో నటించింది. ఫైండింగ్ ఫ్యానీ, ట్రిపుల్ ఎక్స్: రిటర్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ అనే ఇంగ్లీష్ చిత్రాల్లో నటించింది. హీరోయిన్‌గా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తూ.. బాలీవుడ్‌లో నిర్మాతగా మారింది. ఛపాక్, 83 చిత్రాలను నిర్మించింది.

నిర్మాతగా అవతారం ఎత్తి..

నిర్మాతగా అవతారం ఎత్తి..

ఇలా టాప్ హీరోయిన్‌గా, నిర్మాతగా రాణిస్తున్న దీపిక పదుకోన్ జనవరి 5వ తేదీన జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జన్మించిన ఈ అందాల సుందరి ఈ ఏడాది బర్త్ డేతో 37వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ K సినిమా యూనిట్‌తోపాటు అభిమానులు విషెస్ అందజేశారు.

ప్రాజెక్ట్ K టీమ్ విషెస్

ప్రాజెక్ట్ K టీమ్ విషెస్

ప్రస్తుతం దీపిక పదుకోన్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్, ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీపిక బర్త్ డే పురస్కరించుకొని ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. డార్క్‌గా ఉన్న ప్రదేశంలో దీపిక పదుకోన్ ఒంటరిగా నిలుచుకొని పోస్టర్‌లో కనిపించింది. ఈ పోస్టర్‌కు ఏ హోప్ ఇన్ ది డార్క్ (చీకటిలో ఆశాకిరణం) అని ట్యాగ్‌లైన్ పెట్టారు. సినీ నిర్మాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న వైజయంతి మూవీస్ కూడా దీపికకు బర్త్ డే విషెస్ అందజేసింది.

దీపిక పదుకోన్ కెరీర్ ఇలా..

దీపిక పదుకోన్ కెరీర్ ఇలా..

దీపిక పదుకోన్ కెరీర్ విషయానికి వస్తే.. 2023, 2024 సంవత్సరాల్లో బిజీగా మారిపోయింది. ఆమె నటించిన పఠాన్ చిత్రం జనవరి 26వ తేదీన రిలీజ్ కానున్నది. అలాగే షారుక్ ఖాన్‌తో జవాన్, అలాగే ఫైటర్ చిత్రాల్లో నటిస్తున్నది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ప్రభాస్ చిత్రం ప్రాజెక్టులో కూడా హీరోయిన్‌గా నటిస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X