సన్నీలియోన్ తరువాత, బీహార్ పరీక్షల్లో అనుపమ పరమేశ్వరన్.. ఏకంగా టీచర్ పోస్టు కోసం..
ప్రేమమ్ సినిమాతో వెండితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మరోసారి ఇంటర్నెట్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ బ్యూటీ గ్లామరస్ ఫొటోలను ఎక్కువగా పోస్ట్ అయితే చేయదు. అయినప్పటికీ అమ్మడికి కుర్రాళ్ళల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఇక ఇటీవల అమ్మడు ఎవరు ఊహించని విధంగా ఒక విభిన్నమైన వార్తతో అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ విషయంలో ఆమెకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా కొంతమంది నెటిజన్లు అది నిజమని అనుకున్నారు.

సోషల్ మీడియాలోనే..
అఆ సినిమాతో తెలుగు వారికి బాగా దగ్గరైన అనుపమ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. అనంతరం శతమానం భవతి సినిమా కూడా ఆమెను ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వెళుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది.

టీజర్ కొలువు కోసం..
ఇక చాలా కాలం తరువాత అనుపమ పరమేశ్వరన్ పేరు ఎవరు ఊహించాని విధంగా ఒక పరీక్ష న్యూస్ తో వైరల్ అయ్యింది. బీహార్ లో ఆమె టీచర్ అవ్వడానికి ఎస్ టెట్ పరీక్ష రాసినట్లుగా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో కొంతమంది అనుపమ ఇక హీరోయిన్ గా కనిపించదేమో అంటూ మీమ్స్ కూడా వైరల్ చేస్తున్నారు.

ఆశ్చర్యాన్ని కలిగించిన అనుపమ
అసలు మ్యాటర్ లోకి వెళితే మరొకరి మార్కుల మెమోలో అనుపమ ఫొటో జత చేసినట్లు తెలుస్తోంది. బీహార్‌కు చెందిన రిషికేశ్ అనే యువకుడు రీసెంట్ గా బీహార్ లో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (STET) రాశాడు. ఇక రిజల్ట్ వచ్చిన అనంతరం మార్కులు బాగానే వచ్చినప్పటికీ ఫొటో మాత్రం ఏకంగా అనుపమ పరమేశ్వరన్ ది ఉండడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

గతంలో సన్నీలియోన్ పేరు కూడా..
బీహార్ లో ఇలాంటి పొరపాట్లు జరగడం కొత్తేమి కాదు, పరీక్షల హాల్ టికెట్స్ లో కూడా చాలాసార్లు తప్పిదాలు జరిగాయి. బీహార్ యూనివర్సిటీ ఆన్ లైన్ గ్రాడ్యుయేషన్ పార్ట్ 2 ఎగ్జామ్ లో కూడా ఒక విద్యార్థి దరఖాస్తులో.. తల్లిదండ్రులు ఇమ్రాన్ హష్మి, సన్నీ లియోన్‌గా పేర్కొన్నారు. ఇక అడ్రెస్ ముంబై రెడ్ ఏరియా అని ప్రింట్ చేయడం అప్పట్లో అందరిని షాక్ కు గురి చేసింది.

విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా
ఈ ఉదాహరణలు బట్టి బీహార్ లో విద్యావ్యవస్థ ఎంత దారుణంగా ఉందొ అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ట్విటర్ వేదికగా నితీష్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా అంటూ మండిపడ్డారు.


Click it and Unblock the Notifications











