Don't Miss!
- News
ఆ చిన్నారి విమాన ప్రయాణానికి నిరాకరణ-ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ.5 లక్షల జరిమానా
- Sports
ఆర్సీబీ బుడ్డోడికి ట్రెంట్ బౌల్ట్ స్పెషల్ గిఫ్ట్.. అడిగిన వెంటనే..! వీడియో
- Finance
Rakesh Jhunjhunwala: రూ.కోట్లు కురిపించిన ఆ అయిదు స్టాక్స్ ఇవే
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి లవ్ రూమర్స్.. ఆ ఫొటోలతో క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!
ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో వస్తున్న కొన్ని రూమర్స్ ఊహించని విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా స్టార్స్ విడాకులు తీసుకోవడం కూడా ట్రెండింగ్ గా కొనసాగుతోంది. ఇక కొత్తగా పెళ్లిళ్లు చేసుకునేందుకు కూడా కొందరు స్టార్స్ సిద్ధమవుతున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. వరుణ్ తేజ్ కూడా ఒక హీరోయిన్ ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ఒక టాక్ వచ్చింది. ఇక మరొక రూమర్ కూడా వైరల్ అవుతున్న తరుణంలో లావణ్య త్రిపాఠి పోస్ట్ చేసిన ఫొటోలతో ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

నిహారిక పెళ్లి అయిపోగానే..
మెగా
హీరో
వరుణ్
తేజ్
త్వరలోనే
పెళ్లి
చేసుకోబోతున్నాడు
అని
గతంలో
చాలా
రకాల
కథనాలు
వెలువడ్డాయి.
2020
చివరలో
అతని
చెల్లి
నిహారిక
పెళ్లి
అయిపోగానే
ఆ
తరువాత
ఏడాదిలోనే
వరుణ్
పెళ్లి
కూడా
చేయబోతున్నట్లుగా
నాగబాబు
కూడా
ఒక
ఇంటర్వ్యూలో
క్లారిటీ
ఇచ్చారు.
కానీ
ఆ
విషయంపై
మళ్ళి
ఆ
తరువాత
వరుణ్,
నాగబాబు
స్పందించలేదు.

హీరోయిన్ తో ప్రేమలో..
ఇక వరుణ్ తేజ్ ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లుగా గత ఏడాది నుంచి అనేక రకాల రూమర్స్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. ఆ విషయంలో ఇంతవరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు గాని ఆ హీరోయిన్ మాత్రం తరచుగా మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ఫంక్షన్ లలో కూడా పాల్గొనడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతే కాకుండా నిహారిక పెళ్లికి ఆమె మాత్రమే వచ్చింది.

లావణ్య త్రిపాఠి మాత్రమే..
వరుణ్ తేజ్ ఇన్నేళ్ల ఇండస్ట్రీ కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో నటించాడు. కానీ లావణ్య త్రిపాఠి మాత్రమే ఎక్కువగా మెగా ఫ్యామిలీలో సందడి చేసింది. నిహారిక పెళ్లి వేడుకలో కూడా కనిపించడంతో రూమర్స్ కు ఇంకాస్త ఎక్కువ బూస్ట్ లభించింది. కొన్ని రోజుల అనంతరం రూమర్స్ కు మళ్ళీ బ్రేక్ పడినప్పటికి ఇప్పుడు మళ్లీ ఊపందుకున్నాయి.

త్వరలోనే పెళ్లి..?
అయితే రీసెంట్ గా వరుణ్ తేజ్ తన పుట్టినరోజు సందర్భంగా బెంగుళూరు వెళ్లాడని అక్కడ లావణ్య త్రిపాఠి ఉండడం వల్లనే హీరో ప్రత్యేకంగా వెళ్లినట్లు అనేక రకాల కథనాలు వేలువడ్డాయి. ఇద్దరు పార్టీలో కూడా పాల్గొన్నట్లు టాక్ రావడంతో త్వరలోనే పెళ్లి ఉంటుందని కూడా హెడ్ లైన్స్ వచ్చాయి.

ఫొటోలు పోస్ట్ చేయడంతో..
ఇక ఆ రూమర్స్ పై మొత్తానికి చెక్ పెడుతున్నట్లగా లావణ్య కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. డెహ్రాడూన్ లో ఉన్నట్లుగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లుగా లావణ్య సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు ప్రకృతి అందాలతో మునిగి తెలుతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ పోస్టులతో ప్రస్తుతం వరుణ్ తో లేనని ప్రేమ, పెళ్లి రూమర్ పై పరోక్షంగా ఒక కౌంటర్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది.

అతని తరువాతే.. వరుణ్ పెళ్లి..
ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతని ఫోకస్ సినిమాలపైనే ఉందట. ఇప్పుడైతే పెళ్లి చేసుకునే ఆలోచలో లేనట్లుగా తెలుస్తోంది. ఇక మెగా ఫ్యామిలీలో అతనికంటే పెద్ద సాయి ధరమ్ తేజ్ పెళ్లి కావాల్సి ఉంది. కాబట్టి అతని తరువాతే వరుణ్ పెళ్లి చేసుకునే అవకాశం ఉందట.