పోకిరి బ్రహ్మీ సీన్ రిపీట్.. ప్రగ్యా జైస్వాల్ ను చుట్టూ ముట్టిన యాచకులు.. డబ్బులు లేకపోవడంతో..
గ్లామరస్ గర్ల్ ప్రగ్యా జైస్వాల్ గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు చేసుకోవాలని ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది గాని ఆమెకు అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ రావడం లేదు. ఇక అందాలను అరబోయడంలో మాత్రం అమ్మడు ఏ మాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో హాట్ నెస్ డోస్ ను అంతకంతకు పెంచుతూనే ఉంది. ఇక ఈ బ్యూటీకి ఇటీవల ఒక వింత అనుభవం ఏర్పడింది. యాచకులు ఒకేసారి చుట్టూ ముట్టడంతో కొన్ని నిమిషాల వరకు ఏమీ తోచలేదు.

ఆ సినిమాతో మంచి గుర్తింపు
వరుణ్ తేజ్ - క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన కంచె సినిమా ద్వారా మంచి గుర్తింపు అందుకున్న ప్రగ్యా జైస్వాల్ ఆ తరువాత అనుకున్నంతగా సక్సెస్ చూడలేకపోయింది. ఎలాంటి సినిమా చేసినా కూడా ఆ స్థాయిలో సక్సెస్ రాలేదు. అయినప్పటికీ అమ్మడు ఏ మాత్రం తగ్గకుండా తన అందలతోనే అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తోంది.

వారి వలన ఇబ్బంది పడిన ప్రగ్యా
ఇక ఇటీవల ప్రగ్యా జైస్వాల్ భిక్షాటన చేసుకునే కొంతమంది పిల్లల వలన అనుకోని విధంగా కాస్త ఇబ్బంది పడింది. అందరూ చుట్టూ ముట్టినా కూడా పెద్దగా ఆగ్రహానికి లోనవ్వకుండా సంయమనం పాటించింది. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పోకిరి సీన్ రిపీట్
పోకిరి సినిమాలో బ్రహ్మానందం సీన్ అందరికి గుర్తుండే ఉంటుంది. యాచకులంతా చుట్టూ చేరి ఎటూ వెళ్లకుండా బిక్షం అడగడం ఆ సినిమాలో హైలెట్ కామెడీ సీన్ గా నిలిచింది. ఇక కొద్ది సేపటి వరకు ప్రగ్యా కూడా అలాంటి అనుభవాన్ని ఎదుర్కొంది. కారులో ఎక్కడానికి కూడా వీలు పడలేదు.

ఎక్కువ డబ్బు లేకపోవడంతో..
జిమ్ నుంచి బయటకు రాగానే యాచకులు డబ్బులు ఇవ్వండి అంటూ బ్రతిమాలారు. చుట్టూ సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. ఇక చివరికి కారు ఎక్కిన తరువాత ఇస్తానని చెప్పడంతో తన దగ్గర ఉన్న రెండు మూడు నోట్లను ఇచ్చి అందరూ సమానంగా పంచుకోవాలని చెప్పింది. అంతే కాకుండా తన దగ్గర మరింత డబ్బు లేకపోవడంతో డ్రైవర్ నుంచి కూడా కొంత చేంజ్ తీసుకొని వారికి ఇచ్చింది.


Click it and Unblock the Notifications











