సర్రోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన ప్రీతి జింటా.. భర్తకు డబుల్ ధమాకా!

బాలీవుడ్ నటిగా, బిజినెస్ ఉమెన్‌గా, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ భాగస్వామి ప్రీతి జింటా జీవితంలో సంతోషకరమైన క్షణాలు చోటుచేసుకొన్నాయి. ప్రీతి జింటా, జీన్ గూడ్‌ఎనఫ్ దంపతులు పండంటి కవలలకు సర్రోగసి విధానంలో జన్మనిచ్చారు. తమ జీవితంలోకి వచ్చిన ఇద్దరు చిన్నారులను చూసి మురిసిపోతూ తమ సంతోషాన్ని అభిమానులు, సన్నిహితులతో పంచుకొన్నారు. ప్రీతి జింటా వ్యక్తిగత జీవితం, పిల్లల గురించి చెప్పిన విషయాలు మీకోసం..

1998లో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రీతి జింటా

1998లో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రీతి జింటా

మణిరత్నం, రాంగోపాల్ వర్మ, శేఖర్ కపూర్ దర్శకత్వంలో రూపొందిన దిల్ సే చిత్రం ద్వారా 1998లో ప్రీతి జింటా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. తొలి చిత్రంలోనే షారుక్ ఖాన్‌తో నటించే అవకాశాన్ని దక్కించుకొన్నది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్‌తో కలిసి ప్రేమంటే ఇదేరా చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. బాబీ డియోల్‌తో కలిసి నటించిన సోల్జర్ చిత్రంతో బాలీవుడ్‌లో సక్సెస్ సాధించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రెండు దశాబ్దాలపాటు కొనసాగారు.

ఐపీఎల్ జట్టుకు ఓనర్‌గా

ఐపీఎల్ జట్టుకు ఓనర్‌గా

ఆ తర్వాత వ్యాపార రంగంలోకి ప్రవేశించిన ప్రీతి జింటా.. పారిశ్రామికవేత్త నెస్ వాడియా, మోహిత్ బర్మన్‌తో కలిసి ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టును కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో తొలి మహిళా ఓనర్‌గా, యంగెస్ట్ భాగస్వామిగా అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. 2017లో సౌతాఫ్రికాలో జాన్సీ సూపర్ లీగ్‌లో స్టెల్లెన్‌బాస్క్ కింగ్స్ జట్టుకు ఓనర్‌గా మారారు.

అమెరికా పారిశ్రామిక వేత్తతో వివాహం

అమెరికా పారిశ్రామిక వేత్తతో వివాహం

కెరీర్ పరంగా, వ్యాపారపరంగా దూసుకెళ్తున్న ప్రీతి జింటా అమెరికాకు చెందిన పారిశ్రామిక వేత జీన్ గుడ్‌ఎనఫ్‌తో ప్రేమలో పడింది. వారిద్దరూ 2016లో లాస్ ఎంజెలెస్‌లో వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత ప్రీతి జింటా లాస్ ఎంజెలెస్‌లో స్థిరపడింది. తాజాగా ఈ దంపతులు జై జింటా గుడ్‌ఎనఫ్, జియా జింటా గుడ్‌ఎన్‌ఎఫ్ జన్మనిచ్చారు.

సర్రోగసి ద్వారా ఇద్దరు చిన్నారులకు జననం

సర్రోగసి ద్వారా ఇద్దరు చిన్నారులకు జననం

తమకు కవల పిల్లలు జన్మించిన నేపథ్యంలో ట్విట్టర్‌లో ప్రీతి జింటా స్పందిస్తూ.. మీకు అద్భుతమైన వార్తను పంచుకోవాలని అనుకొంటున్నాం. మా ఫ్యామిలీలోకి జై జింటా, జియా జింటా గుడ్‌ఎనఫ్ వచ్చారు. మాకు కవల పిల్లలు జన్మించారు. అందుకు ఆనందంతో ఉప్పొంగిన హృదయంతో మీతో ఈ విషయాన్ని పంచుకొంటున్నాం అని ప్రీతి జింటా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మా జీవితంలో కొత్త అధ్యాయం అంటూ

మా జీవితంలో కొత్త అధ్యాయం అంటూ


తమ జీవితంలోకి వచ్చిన చిన్నారుల గురించి వెల్లడిస్తూ.. మా లైఫ్‌లో కొత్త అధ్యాయం మొదలైందనే విషయాన్ని చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నాం. మా అద్బుతమైన జర్నీలో భాగమవ్వడమే కాకుండా సర్రోగసి ద్వారా ఇద్దరు బిడ్డలకు ప్రాణం పోసిన డాక్టర్లు, నర్సులకు రుణపడి ఉంటాం. జీన్, ప్రీతీ, జై, జియా తరఫున మీకు కొండంత ప్రేమతో ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాం అని ప్రీతి జింటా ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X