Rakul Preet Singh పెళ్లి ఎప్పుడంటే.. బాలీవుడ్ హీరోతో వివాహంపై క్లారిటీ ఇచ్చిన బ్యూటీ
గ్లామర్ హీరోయిన్‌గా దక్షిణాది చిత్రసీమతోపాటు బాలీవుడ్‌లో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. బాలీవుడ్ నటుడు, నిర్మాతతో తాను ప్రేమలో ఉన్నానని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే నటిగా ఎన్నడూలేనంత బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పింది. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఎప్పుడంటే...

బాలీవుడ్ నటుడు, నిర్మాతతో
బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గత కొద్దికాలంగా వస్తున్న నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. మీడియాకు సమాచారం అందించకుండా నేరుగా సోషల్ మీడియా ద్వారా తన అఫైర్‌ను బయటపెట్టారు. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో తాను అఫైర్‌లో ఉన్నాను అంటూ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో వెల్లడించారు. దాంతో ఆ వార్త సోషల్ మీడియాను కుదిపేసింది.

జాకీ భగ్నానీతో నా బంధం గురించి
అయితే రకుల్ ప్రీత్ సింగ్ తన వ్యక్తిగత జీవితం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఊహాగానాలు, రూమర్లు, గాసిప్ వార్తల విషయంలో మరింత జాగ్రత్తను పాటిస్తుంటుంది. ఏదైనా తప్పుడు వార్త కనిపిస్తే తాను బాధపడుతాను. అంతేకాకుండా తన జీవితంపై చాలా ప్రభావం చూపుతుందని రకుల్ ప్రీత్ సింగ్ పలు సందర్భాల్లో చెప్పారు. జాకీ భగ్నానీతో నా బంధం గురించి తప్పుడు రీతిలో చర్చించుకోవద్దనే కారణంతోనే నా ప్రేమను అధికారికంగా ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వెల్లడించాను అని రకుల్ ఫ్రీత్ చెప్పారు.

పబ్లిక్ ఫిగర్ కావడం అలాంటి ఇబ్బందులు
ఇటీవల సెలబ్రిటీల జీవితం గురించి రకుల్ ప్రీత్ మాట్లాడుతూ.. సెలబ్రిటీల జీవితంపై ప్రేక్షకులు, ప్రజలు ఆసక్తిగా ఉంటారు. అందులో తప్పేమీ లేదు. తమకు నచ్చిన వారి జీవితంలో ఏం జరుగుతుందనే విషయంపై నిశితంగా దృష్టిపెడుతారు. పబ్లిక్ ఫిగర్ కావడం వల్ల ఇలాంటి ఇబ్బందులు సెలబ్రిటీలకు ఉంటాయి. అయితే నా లైఫ్‌కు సంబంధించిన ఉన్నత విలువలను పాటించే అవకాశం లభించడం గర్వంగా ఉంటుంది అని రకుల్ ఫ్రీత్ అన్నారు.

నా కెరీర్ విషయంలో సంతృప్తి చెందడం లేదు
అయితే సినిమా పరిశ్రమలో తాను సాధించిన విషయాలను చూసి సంతృప్తి చెందడం లేదు. నేను ఇంకా గొప్పగా సాధించాలని ఎప్పుడూ కలలు కంటుంటాను. అందుకే నా లక్ష్యాలకు అంతం ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొంటాను. ప్రొఫెషనల్ జీవితం వేరు, వ్యక్తిగత జీవితం వేరనే విషయంపై నాకు స్పష్టమైన క్లారిటీ ఉంది. నా వ్యక్తిగత జీవితంపై ఎలాంటి వివాదాలు రాకుండా చూసుకొంటాను అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు.

నా పెళ్లికి సంబంధించి...
పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. నా ప్రేమ గురించి ఎప్పుడు చెప్పాల్సి వచ్చిందో అప్పుడే చెప్పాను. ఏది అప్పుడు చెప్పాలో, ఏది ఎప్పుడు జరుగుతుందో అది అప్పుడే జరుగుతుంది. నా పెళ్లికి సంబంధించిన టైమ్ వచ్చిన తప్పకుండా అధికారికంగా వెల్లడిస్తాను. తప్పకుండా మీకు చెప్పకుండా ఏది జరగదు అని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.
Recommended Video

రకుల్ ఫ్రీత్ సింగ్ కెరీర్ గురించి
రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే... ప్రియుడు జాకీ భగ్నానీ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌తో నటించే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే అయుష్మాన్ ఖురానా, షెఫాలీ షా నటించే డాక్టర్ జీ సినిమాలో కూడా నటించనున్నాను. తమిళంలో ఇండియన్ 2, ఆయాలాన్ చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ఎటాక్, మేడే, థ్యాంక్ గాడ్, డాక్టర్ జీ లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











