Don't Miss!
- News
ఎవరేం చేస్తున్నారో.. అంతా తెలుసు..!: చంద్రబాబు
- Sports
U19 Women’s T20 World Cup Final: టాస్ గెలిచిన భారత్.. ఇంగ్లండ్‌దే బ్యాటింగ్!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Rashmika Mandanna: పొట్టి నిక్కరులో కసిగా కష్టపడుతున్న రష్మిక.. ఆ స్టార్ హీరో సినిమా కోసమే..
నేషనల్ క్రష్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్న రష్మిక మందన్న సౌత్ నుంచి బాలీవుడ్ వరకు ఒక ప్రత్యేకమైన దారిని కూడా ఏర్పాటు చేసుకుంటోంది. ఈ బ్యూటీ ఇటీవల కాలంలో ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సక్సెస్ అవుతున్నాయి. హీరోయిన్ గా ఒకే తరహాలో గ్లామర్ ను మెయింటేనేన్స్ చేయడం అంటే చాలా కష్టమైన పని. సినిమాలో పాత్రలకు తగ్గట్లుగా కొన్నిసార్లు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉండాలి.
ఇక రీసెంట్ గా ఆమె తన తదుపరి సినిమా కోసం చేసిన ఒక వర్కౌట్ వీడియో అయితే అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ వీడియో లో రష్మిక మందన చిన్న నిక్కరులో కనిపించింది ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే...

స్టార్ హీరోలతో.. ఈజీగా
ఛలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి మంచి బాక్సాఫీస్ హిట్ తో అడుగుపెట్టిన రష్మిక మందన్న ఆ తరువాత సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటూ వచ్చింది. ఆమె ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకుంటూ వస్తున్నాయి. రష్మిక అదృష్టం ఏమిటో గాని చాలా ఈజీగా స్టార్ హీరోలతో నటించే అవకాశం అందుకుంది.

బేధాలు చూపకుండా..
కేవలం స్టార్ హీరోలతోనే కాకుండా మీడియం రేంజ్ హీరోలతో కూడా రష్మిక నటించేందుకు ఒప్పుకుంటుంది. ముఖ్యంగా ఆమెకు పాత్ర నచ్చితేనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. నటీనటులు ఎవరు పెద్ద సినిమాలతో చిన్న సినిమాల అనే భేదాలు అస్సలు చూడడంలేదు. పుష్ప సినిమా తర్వాత శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో ప్రేక్షకుల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

పుష్ప అనంతరం..
పుష్ప సినిమాలో శ్రీవల్లి అనే పాత్రలో రష్మిక మందన్న నటించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. అంతకు ముందు వరకు గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు అందుకున్న రష్మిక మందన్న ఆ సినిమాతో మంచి నటిగా కూడా క్రేజ్ అయితే అందుకుంది. పుష్ప సినిమాతో హిందీలో కూడా మంచి సక్సెస్ అందుకోవడంతో రష్మిక కు అక్కడ కూడా మంచి సినిమా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

వర్కౌట్ వీడియో వైరల్
ఇక హీరోయిన్ గా గ్లామర్ ను ఎప్పటికప్పుడు కాపాడుకోవడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. రష్మిక కెరీర్ మొదటి నుంచి కూడా ఫిట్ నెస్ విషయంలో ఎన్నో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆమె వర్కౌట్ చేయడం మొదలు పెడితే అలుపులేకుండా హార్డ్ వర్క్ చేస్తుంది అని చాలా మంది చెప్పారు. ఇక రీసెంట్ గా రష్మిక మందనకు సంబంధించిన వర్కౌట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
Recommended Video

ఆ హీరో సినిమా కోసమే
జిమ్ ట్రైనర్ తో పాటు రష్మిక మందన ఓకే చోట ఉరుకులు పరుగులు పెడుతూ చాలా కసిగా కనిపించినట్లుగా అర్థమైంది. ఇక ఆమె పొట్టి నిక్కర్ లో కనిపించడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో తొందరగానే వైరల్ గా మారిపోయింది. రష్మిక మందన చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని కూడా నెటిజన్లు చాలా పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు. రష్మీక తలపతి 66వ సినిమా కోసమే కాస్త ఫిట్నెస్ లో మార్పులు చేయాలని ఫిక్స్ అయ్యిందట. విజయ్ వంశీ పైడిపల్లి కలయికలో వస్తున్న ఆ సినిమా తెలుగు తమిళ్ లో ఒకేసారి తెరకెక్కనుంది.