For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ సహజీవనం.. సహనటుడితో సీక్రెట్‌గా బిడ్డను కన్నారంటూ రచ్చ?

  |

  చిన్నారి పెళ్లికూతురు ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులనే కాకుండా సినీ అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకొన్న యువ హీరోయిన్ అవికా గోర్ సాధారణంగా వివాదాలకు, రూమర్లకు, గాసిప్స్‌కు దూరంగా ఉంటారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో తన సహ నటుడు మనీష్ రైసింఘన్‌తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలపై ఆమె ఘాటుగా స్పందించారు. ఆ విషయంలోకి వెళితే..

  సహనటుడితో సన్నిహిత సంబంధాలు

  సహనటుడితో సన్నిహిత సంబంధాలు

  హిందీ బుల్లితెరపై సంచలనం రేపిన సీరియల్ ససురాల్ సిమర్ కాలో అవికా గోర్, మనీష్ రైసింఘటన్‌ కలిసి నటించారు. వారి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిద్దరు చనువగా ఉండటం, రెస్టారెంట్లలో కలిసి ఉండటం మీడియా కంటపడింది. దాంతో రూమర్లు గుప్పుమన్నాయి. అయితే తనపై వస్తున్న రూమర్లను చూసి నవ్వుకున్నాను అని అవికా గోర్ తెలిపారు.

  మీడియా వార్తలతో మా మధ్య సంబంధాలు

  మీడియా వార్తలతో మా మధ్య సంబంధాలు

  మనీష్ రైసింఘాన్‌తో అఫైర్ వార్తలు మీడియాలో రావడంతో మా మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. రెండు వారాలుగా మాట్లాడుకోలేదు. కాకపోతే పాత వార్తలను తిరిగేసి రాసిన విధానాన్ని చూసి నవ్వుకొన్నాం. కాకపోతే మనీష్ నాకు మంచి స్నేహితుడు. అలాంటి వ్యక్తిని ముడిపెట్టి మాపై గాసిప్స్ రాయడం బాధగా ఉంది అని అవికా గోర్ పేర్కొన్నారు.

  13 ఏళ్లకే నా కెరీర్ ప్రారంభమై..

  13 ఏళ్లకే నా కెరీర్ ప్రారంభమై..


  తన కెరీర్ గురించి అవిక గోర్ వెల్లడిస్తూ .. నా వయసు 13 ఏళ్లు ఉన్నప్పటి నుంచి నేను సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఈ ప్రయాణంలో నాకు తారసపడిన మంచి వ్యక్తుల్లో మనీష్ ఒకరు. అలాంటి వ్యక్తితో నేను సీక్రెట్‌గా బిడ్డను కన్నానంటూ వార్తలు రాయడం ఎంత బాధగా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. నా కంటే మనీష్ 18 ఏళ్లు పెద్దవాడు. దాదాపు నా తండ్రి కంటే కొంచెం తక్కువ వయసు ఉంటుందేమో అని అవికా గోర్ ఆవేదన వ్యక్తం చేశారు.

  మనీష్ ప్రేమ పెళ్లితో

  మనీష్ ప్రేమ పెళ్లితో

  ఇక మనీష్ రైసింఘాటన్ విషయానికి వస్తే.. గత ఏడాది జూన్‌లో సంగీత చౌహాన్‌ను ఇంట్లో వారికి తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ముంబైలోని గురుద్వారాలో కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకొన్నారు. పెళ్లికి ముందు అవికా గోర్‌తో డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి.

  ఎంటీవీ స్టార్‌తో అవికా గోర్ డేటింగ్

  ఎంటీవీ స్టార్‌తో అవికా గోర్ డేటింగ్

  ఇదిలా ఉండగా, ఇలాంటి డేటింగ్, గాసిప్స్ మధ్య అవికా గోర్ ప్రేమలో పడ్డారు. ఎంటీవీ రోడీస్ కంటెస్టెంట్ మిలింద్ చంద్వానీ‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు అధికారికంగా ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో మనీష్‌తో డేటింగ్ వార్తలను మళ్లీ తిరగదోటడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

  Comedian Ali Fires On Film Critics | Raju Gari Gadi Succsess Meet
   అవికా గోర్ కెరీర్ ఇలా...

  అవికా గోర్ కెరీర్ ఇలా...

  అవికా గోర్ కెరీర్ విషయానికి వస్తే.. చిన్నారి పెళ్లికూతురు (హిందీలో బాలిక వధూ) ససురాల్ సిమర్ కా సీరియల్స్ నటించి విశేషంగా అభిమానులను సొంతం చేసుకొన్నారు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావ, లక్ష్మి రావే మా ఇంటికి, మాంజా, ఎక్కడికి పోతావు చిన్నాదాన, రాజు గారి గది 3 చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం థ్యాంక్యూ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కల్యాణ్ దేవ్‌తో ఓ చిత్రంలో కూడా నటించేందుకు అంగీకరించారు.

  English summary
  Balika Vadhu fame Avika Gor dating goes viral in the bollywood media Reports suggest that she had secret child with co star Manish Raisinghan. In this situation, Avika Gor condemns the news.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X