For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీక్రెట్‌గా కాజల్ అగర్వాల్ నిశ్చితార్థం.. టాలీవుడ్ యంగ్ హీరో హాజరు.. వరుడు ఎవరంటే..

  |

  కరోనావైరస్ లాక్‌డౌన్‌లో టాలీవుడ్‌కు చెందిన యువ తారల పెళ్లిళ్లు భారీగానే జరుగుతున్నాయి. నిఖిల్, నితిన్, రానా దగ్గుబాటి లాంటి హీరోలు పెళ్లి చేసుకొని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అందించి వచ్చిన సెలవులను, సినీ తారలు ఆస్వాదిస్తూనే ఉన్నారు. తాజాగా లాక్‌డౌన్‌లో మరో ఇద్దరు హీరోయిన్లు పెళ్లికి రెడీ అవుతున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు నిహారిక కొణిదెల కాగా, మరో కాజల్ అగర్వాల్ అనే పేరు మీడియాలో వైరల్ అయింది. అయితే సీక్రెట్‌ జరిగినట్టు పేర్కొంటున్న ఎంగేజ్‌మెంట్ గురించి మరిన్నీ వివరాలు..

  Kajal Aggarwal Wax Statue At Madame Tussauds Singapore
  సీక్రెట్‌గా కాజల్ ఎంగేజ్‌మెంట్

  సీక్రెట్‌గా కాజల్ ఎంగేజ్‌మెంట్

  తాజాగా కాజల్ అగర్వాల్ చేసిన పోస్టు అందర్నీ ఆకర్షిస్తున్నది. నేను అనే పదం మనంగా మారితే ఇల్‌నెస్ (అనారోగ్యం) కూడా వెల్‌నెస్‌ (ఆరోగ్యం)గా మారుతుందని తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దాంతో కొద్దికాలంగా వినిపిస్తన్న పెళ్లి వార్తలకు బలం చేకూరాయి. దాంతో సినీ వర్గాలు ఆరా తీయగా.. సీక్రెట్‌గా కాజల్ ఎంగేజ్‌మెంట్ జరిగిందనే దృష్టికి వచ్చింది.

  సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ

  సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ

  గత కొద్దికాలంగా కుటుంబ సభ్యులు వరుడి కోసం వెతుకుతున్నారని, వారు నిశ్చయించిన అబ్బాయినే కాజల్ పెళ్లి చేసుకొనబోతున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. తన పెళ్లి తర్వాత భర్తతో కలిసి ఫిలిం ప్రొడక్షన్‌లోకి ప్రవేశించి సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు ఓ వార్త వచ్చింది. తన ప్రొడక్షన్ కంపెనీ కోసం KA productions అనే బ్యానర్‌ను కూడా రిజిస్టర్ చేసిందనే విషయాన్ని స్వయంగా కాజల్ వెల్లడించింది.

  బిజినెస్ మెన్ గౌతమ్‌తో ఎంగేజ్‌మెంట్

  బిజినెస్ మెన్ గౌతమ్‌తో ఎంగేజ్‌మెంట్

  ఇలాంటి వార్తల నేపథ్యంలో కాజల్ అగర్వాల్ నిశ్చితార్థం జరిగినట్టు ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. తన తల్లిదండ్రులు చూసిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌తో నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఆ కార్యక్రమానికి ఓ టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా హాజరయ్యారనే విషయం ప్రముఖ టెలివిజన్ వెల్లడించిన కథనంలో పేర్కొన్నారు. అయితే సీక్రెట్‌గా కుటుంబ వేడుకగా నిర్వహించినట్టు సమాచారం.

  గుట్టుచప్పుడుగా ఫ్యామిలీ సభ్యులు

  గుట్టుచప్పుడుగా ఫ్యామిలీ సభ్యులు

  కాజల్ అగర్వాల్ నిశ్చితార్థం గురించి కుటుంబ సభ్యులు పెద్దగా స్పందించడం లేదు. మీడియా ఈ విషయం గురించి వివరాలు సేకరించడానికి ప్రయత్నించగా సమాధానం దాటవేశారనే విషయం స్పష్టమైంది. అయితే సినీ వర్గాలు కాజల్ ఎంగేజ్‌మెంట్‌ను ధృవీకరిస్తున్నాయి. త్వరలోనే పెళ్లికి వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది.

  కాజల్ అగర్వాల్ సినీ కెరీర్ ఇలా

  కాజల్ అగర్వాల్ సినీ కెరీర్ ఇలా

  ఇక కాజల్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇండియన్2 చిత్రంలో కమల్ హాసన్ సరసన నటిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య, మంచు విష్ణుతో మోసగాళ్లు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక హిందీ క్వీన్ రీమేక్ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇది కాకుండా కాజల్ బాలీవుడ్ సినిమా, వెబ్ సిరీస్‌పై దృష్టిపెట్టినట్టు సమాచారం. అయితే ఇలా బిజీగా ఉన్నందున కాజల్ పెళ్లి వార్తను సన్నిహితులు కొట్టిపడేస్తున్నారు. అయితే కాజల్ స్వయంగా తన నిశ్చితార్థంపై స్పందిస్తే తప్ప ఈ విషయంపై క్లారిటీ రావడం కష్టం.

  English summary
  South Star Herione Kajal Aggarwal getting married soon. Reports suggest that This Indian 2 Heroine got engaged to Business Man Gautam. This engagement function held in family affiar. Tollywood hero Bellamkonda Srinivas was in attendee list.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X