కాజల్ అగర్వాల్ కారుకు ఘోర ప్రమాదం.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కారుకు ప్రమాదం జరిగినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కొన్ని ఛానెల్స్‌లో ఆమె పరిస్దితి విషమంగా ఉందని కథనాలు రావడంతో కాజలు అభిమానులు ఆమె క్షేమంగా తిరిగి రావాలని పోస్ట్‌లు పెట్టారు. సినీ ప్రముఖులు, సన్నిహితులు కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..

నేను క్షేమంగానే ఉన్నా
నేను ప్రమాదానికి గురయ్యానని, చనిపోయినట్లుగా కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతుండటం నా దృష్టికి వచ్చింది. వాటిని చూసి నేను నవ్వుకున్నాను.. ఇంతకు మించి నవ్వు తెప్పించే వార్త ఉండదేమో. నాకు యాక్సిడెంట్ జరిగినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవం. ఆ భగవంతుడి దయ వల్ల నేను క్షేమంగా ఉన్నాను. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయొద్దు, దానికి బదులుగా మంచి వార్తలను నలుగురితో పంచుకోవాలని కాజల్ అగర్వాల్ ట్వీట్ చేశారు. తమ అభిమాన నటి క్షేమంగా ఉన్నట్లు క్లారిటీ రావడంతో కాజల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

లక్ష్మీ కళ్యాణంతో టాలీవుడ్ ఎంట్రీ

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్‌లలో కాజల్ ఒకరు. 40 ఏళ్లు దాటినా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లను మించిన అందంతో రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం వయసు పెరుగుతుండటంతో తన ఇమేజ్‌కు తగిన పాత్రలు చేస్తూ ఇంకా బిజీగానే ఉంటున్నారు. 1985 జూన్ 19న ముంబైలో స్థిరపడిన పంజాబీ కుటుంబంలో జన్మించారు కాజల్ అగర్వాల్. మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ చేసిన కాజల్ 2004లో క్యా హో గయా నా అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర పోషించి చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత దర్శకుడు తేజ .. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఆమెను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. కలువల్లాంటి కళ్లు, అందంతో తొలి సినిమాతో కుర్రాళ్ల కలల రాకుమారిగా నిలిచారు కాజల్.

Kajal Aggarwal Condemns her Death Rumors in Road Accident

మగధీరతో స్టార్‌డమ్
కృష్ణవంశీ దర్వకత్వంలో తెరకెక్కిన చందమామతో తొలి బ్రేక్ అందుకున్న కాజల్ కెరీర్‌ను మగధీర మలుపు తిప్పింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో యువరాణి మిత్రవిందగా నటించిన కాజల్.. ఈ సినిమా విజయంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. స్టార్ హీరోయిన్‌గా అగ్రనటులతో సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళంలోనూ విజయ్, సూర్య, కార్తీ వంటి స్టార్స్‌తో సినిమాలు చేసింది. మధ్యమధ్యలో బాలీవుడ్‌లోనూ కాజల్ సినిమాలు చేసి మెప్పించారు. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ బాబు నీల్ సంతానం.

కాజల్ డైరీ ఫుల్‌
పెళ్లి తర్వాత కూడా కాజల్ నటిస్తూనే ఉన్నారు. మంచు ఫ్యామిలీ తెరకెక్కించిన కన్నప్పలో పార్వతి దేవిగా కాజల్ నటించారు. ప్రస్తుతం ది ఇండియా స్టోరీ, ఇండియన్ 3, రామాయణ పార్ట్ 1, పార్ట్ 2లో మండోదరిగా నటిస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్నారు చందమామ. భర్త, కొడుకుతో పాటు తన చెల్లెలు నిషా అగర్వాల్, తల్లిదండ్రులతో ఆమె గడుపుతుంటారు. ఇలాంటి పరిస్ధితుల్లో కాజల్ అగర్వాల్‌ రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. దీనిపై ఆమె సోషల్ మీడియాలో స్పందించారు.

More from Filmibeat

Read more about: kajal aggarwal movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X