గంజాయిని చట్టబద్ధం చేయాలి.. ఆ మొక్కల్ని తులసి చెట్టుతో పోల్చి చిక్కుల్లో పడిన హీరోయిన్

దేశవ్యాప్తంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఒక సరికొత్త వివాదాలకు దారి తీస్తోంది. మొన్నటి వరకు రియా దశ వరకే ఉన్న కేసు రకరకాల కోణాల్లో యూ టర్న్ తీసుకుంటోంది. ముఖ్యంగా డ్రగ్స్ సీక్రెట్స్ చాలానే బయటపడుతున్నాయి. రియా చక్రవర్తి సోదరుడిపై ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఇలాంటి సమయంలో ఒక హీరోయిన్ గంజాయి మొక్కలను తులసి మొక్కలతో పోల్చడం సరికొత్త కాంట్రవర్సీకి దారి తీస్తోంది.

కన్నడ స్టార్స్ పై కేసులు నమోదు

కన్నడ స్టార్స్ పై కేసులు నమోదు

బాలీవుడ్ నే కాకుండా కన్నడ సినిమా ఇండస్ట్రీ శాండీల్ వూడ్ ని కూడా ఇప్పుడు డ్రాగ్స్ వ్యవహారం గట్టిగానే కుదిపేస్తోంది. ఇటీవల కొందరి స్టార్స్ పై కేసులు కూడా నమోదు కాగా తీగ లాగితే డొంక కదిలినంత పనయ్యింది. బెంగుళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఇప్పటికే జెండా పై కపిరాజు ఫేమ్ రాగిణీ ద్వివేది రెడ్ హ్యాండెడ్ గా దొరికేసింది.

రాగిణీకి డ్రగ్స్ మాఫియాతో లింకులు..

రాగిణీకి డ్రగ్స్ మాఫియాతో లింకులు..

ఇక బుజ్జిగాడు సినిమాలో నటించిన సంజనపై ఆరోపణలు రాగా ఆమెకు కూడా అధికారులు నోటీసులు అంధించడం ఆ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రాగిణీకి డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయని కామెంట్స్ కూడా ఎక్కువవ్వడంతో పోలీసులు ఆమె వెనుక ఉన్న మరికొంత మంది స్టార్స్ ని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గంజాయి తులసి మొక్క లాంటిదే అంటూ..

గంజాయి తులసి మొక్క లాంటిదే అంటూ..

ఆ సంగతి పక్కనపెడితే.. ఇటీవల ఒక హీరోయిన్ గంజాయి మొక్కలను ఏకంగా తులసి మొక్కలతో అందరిని ఆశ్చర్యపరిచింది. ముందుగా ఆమె రాగిణీని అరెస్ట్ చేయడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. గంజాయి మొక్కలను కూడా మన దేశంలో చట్టబద్ధం చేయాలని కామెంట్ చేసింది. ఎందుకంటే గంజాయి తులసి మొక్క లాంటిదే అంటూ బ్యాన్ చేయకముందు ఆయుర్వేదానికి అదొక వెన్నుముక అని తెలియజేశారు.

గంజాయిని చట్టబద్ధం చేయాలని..

గంజాయిని చట్టబద్ధం చేయాలని..


అదే విధంగా మన దేశంలో గంజాయిని చట్టబద్ధం చేయాలని అలాగే అది తులసి మొక్కతో సమానమని అనడంతో నివేదితపై ఊహించని విధంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ముఖ్యంగా పాము విషంతో మెడిసిన్స్ తయారు చేయగలం గాని విషాన్ని డైరెక్ట్ గా తీసుకోలేము కదా అనే విధంగా సెటైర్స్ వేస్తున్నారు. అదే విధంగా గంజాయి తులసి లాంటిదేనని నువ్వు కూడా తీసుకుంటున్నవా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X