51 ఏళ్ల వయసులోనూ ఘాటు కోరిక.. ఆ హీరోతో అలా చేయాలని ఉందన్న కస్తూరి!
Kasthuri Shankar: అలనాటి హీరోయిన్ కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్ ద్వారా తులసిగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చే స్టేట్‌మెంట్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఇంతకీ ఏమన్నారంటే.?
ప్రముఖ టీవీ యాంకర్ వర్షా నిర్వహిస్తున్న "కిస్సిక్ టాక్స్" కార్యక్రమానికి కస్తూరి శంకర్ గెస్ట్‌గా హాజరయ్యారు. తన సినిమా అనుభవాలు, కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి స్పష్టంగా మాట్లాడింది. నటి కస్తూరికి వర్ష స్వాగతం పలుకుతూ..'గూగుల్ మ్యాప్ చూపిస్తుంది దారి.. అందరి కుర్రాళ్ల గుండెల్లో ఉంటుంది కస్తూరి 'అని హైప్ క్రియేట్ చేస్తుంది. కుర్రాళ్లకి మదర్ క్యారెక్టర్ చేస్తున్న కస్తూరి.. కుర్రాళ్ల గుండెల్లో ఉండటం ఏంటో మరి. అంతటితో ఆగితే కస్తూరి తన కళ్ల జోడికి పని చెప్పేది కాదు కానీ.. వర్ష అక్కడితో ఆగలేదు. ఇక తగ్గకుండా.. అన్నమయ్య సినిమాలో అప్పుడు ఎంత అందంగా ఉన్నారో.. ఇప్పుడు కూడా అంతే అందంగా ఉన్నారు అని అని పెద్ద బిస్కెట్టే వేసింది యాంకర్ వర్ష. అది చూసే మనకే ఓ మై గాడ్ అని అనిపించడం కాదు.. అక్కడున్న కస్తూరికి కూడా అదే అనిపించింది. ఓ మై గాడ్ అనేసింది.

'ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు?? ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నారు? ' అని కస్తూరిని అడిగింది వర్ష. 'ఏం మెయిన్ టైన్ చేయడమమ్మా.. కళ్లకి కళ్లద్దాలు కూడా వచ్చేశాయి' అని అన్నది. అయినా కూడా వర్ష ఆగకుండా.. 'చందమాకి రెండు పేర్లు ఉన్నాయి తెలుసా? ఒకటి చందమామ.. రెండో పేరు కస్తూరి అన్నది వర్ష. దాంతో కస్తూరి.. 'అయితే ఈ కళ్ల జోడు నాకంటే నీకే బాగా అవసరం' అని తన చేతిలో ఉన్న కళ్లద్దాలు ఇచ్చి.. వర్ష గాలి తీసేసింది.
అసలు నీకేం కావాలి? మణికొండ మొత్తం రాసి ఇచ్చేయనా? కస్తూరి అనగానే.. . 'నాకు మణికొండ రాసిచ్చేస్తారా? మీకు ఆస్తి ఎంత ఉంది? యూఎస్‌లో హౌస్ ఉంది.. చెన్నైలో హౌస్ ఉంది.. హైదరాబాద్‌లో హౌస్ ఉంది అంటూ కస్తూరి ఆస్తుల చిట్టా చదివేసింది వర్ష. దీంతో దాంతో కస్తూరి.. గృహలక్ష్మి సీరియల్ వల్ల.. హైదరాబాద్ లో ఓ గృహం కొన్నాను' అని చెప్పింది కస్తూరి. 'ఐ యామ్ ఇన్ లవ్ విత్ హైదరాబాద్.. ఐ యామ్ ఇన్ లవ్ విత్ హైదరాబాదీస్'అని కూడా చెప్పొచ్చు. అలా చెప్తే.. ఈ వయసులో ఎవడితోనే లవ్‌లో పడిందంటూ నానా రచ్చ చేస్తారని షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఈ క్రమంలో వర్షా కాస్త సరదాగా ప్రశ్నించింది. "మీకు మంచి రెమ్యూనరేషన్ ఇచ్చి, విజయ్ దేవరకొండ పక్కన సిస్టర్ రోల్ ఆఫర్ ఇస్తే చేస్తారా?" అన్ని ప్రశ్నించగా.. అందుకు కస్తూరి అందరూ షాక్ అయ్యే సమాధానమిచ్చింది. "సిస్టర్ క్యారెక్టర్ కాదు, అదే హీరో పక్కన వేరే రోల్ అయితే తక్కువ రెమ్యూనరేషన్‌కి కూడా చేస్తాను" అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఏ రోల్ అని వర్షా మరోసారి ప్రశ్నించగా.. కస్తూరి చిరునవ్వుతో "సిస్టర్ ఏంటి.. ఇప్పుడే అయితే ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను!" అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. అలా విజయ్ దేవరకొండ పక్కన ఐటమ్ సాంగ్ చేయాలని తన కోరికను బహిరంగంగా చెప్పడంతో, ప్రేక్షకులు మాత్రమే కాదు, సోషల్ మీడియా కూడా షాక్ అయ్యింది. "51 ఏళ్ల వయసులో కూడా ఈ స్థాయి కాన్ఫిడెన్స్, డిజైర్ అద్భుతం" అని నెటిజన్లు ప్రశంసిస్తుండగా, మరికొందరు "ఈ వయసులో ఐటమ్ సాంగ్ ఆలోచన షాకింగ్" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలిగిన కస్తూరి, ఇప్పటికీ సినిమాలు, టాక్ షోలలో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ వయసులో కూడా ఫిట్‌గా, గ్లామరస్‌గా కనిపించడమే కాదు, సరికొత్త అవకాశాల కోసం ముందడుగు వేస్తోంది. కస్తూరి లాంటి నటులు వయసు పరిమితుల్ని చెరిపి కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











